![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/50/TeideS.jpg/640px-TeideS.jpg&w=640&q=50)
టెయిడ్ నేషనల్ పార్క్
From Wikipedia, the free encyclopedia
టెయిడ్ నేషనల్ పార్క్ స్పెయిన్ దేశంలో టెనెరిఫే (కానరీ దీవులు, స్పెయిన్) ఉన్న ఒక జాతీయ ఉద్యానవనం.టెయిడ్ జాతీయ ఉద్యానవనం స్పెయిన్ దేశంలోని మౌంట్ టెయిడ్ అనే ఎత్తైన పర్వతం (3,718 మీటర్ల ఎత్తు) మీద కేంద్రీకృతమై ఉంది.అట్లాంటిక్ మహాసముద్ర ద్వీపాలలో ఇది ఎత్తైన అగ్నిపర్వతం, సముద్రంలోని దానిఅడుగుభాగం నుండి (7.500 మీటర్ల ఎత్తు) దాని స్థావరం నుండి ప్రపంచంలో మూడవ ఎత్తైన అగ్నిపర్వతం.పికో వీజో జాతీయ ఉద్యానవన పరిధి కూడా ఈ పర్వతశ్రేణిలో ఉంది. ఇది కానరీ ద్వీపాలలో 3,135 మీటర్ల శిఖరంతో రెండవ ఎత్తైన అగ్నిపర్వతం. కానరీ ద్వీపాలలో టెయిడ్ మౌంట్ , పికో వీజో మాత్రమే రెండు శిఖరాలుగా ఉన్నాయి.18,990 హెక్టార్ల వైశాల్యాన్ని ఆక్రమించి, కానరీ ద్వీపంలోని అత్యంత పురాతన, అతిపెద్ద జాతీయ ఉద్యానవనంగా, స్పెయిన్ లోని పురాతనమైన వాటిలో ఒకటి. 2010లో టెయిడ్ ఐరోపాలో అత్యధికంగా సందర్శించబడిన జాతీయ ఉద్యానవనం. ఈ ఉద్యానవనం లా ఒరోటవా మునిసిపాలిటీ పరిధిలో ఉంది.ఇది 18,990 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.2007 జూన్ 28న యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేర్కొంది [1] ఇది 2007 చివరి నుండి స్పెయిన్ 12 సంపదలలో ఒకటి. టెయిడ్ తూర్పున ఒక శిఖరంపై, అబ్జర్వేటోరియో డెల్ టెయిడ్ టెలిస్కోపులు ఉన్నాయి.
టెయిడ్ నేషనల్ పార్క్ | |
---|---|
IUCN category II (national park) | |
![]() టెయిడ్ పర్వత శిఖరం | |
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Spain Tenerife" does not exist. | |
Location | టెనెరిఫే, స్పెయిన్ |
Coordinates | 28°15′47″N 16°36′58″W |
Area | 189.9 km2 |
Established | 1954 |
Visitors | సంవత్సరానికి 4 మిలియన్లు |
రకం | సాధారణ |
క్రైటేరియా | vii, viii |
గుర్తించిన తేదీ | 2007 (31st session) |
రిఫరెన్సు సంఖ్య. | 1258 |
రాష్ట్రం | స్పెయిన్ |
ప్రాంతం | ఐరోపాలోని ప్రపంచ వారసత్వ ప్రదేశం, యూరప్, ఉత్తర అమెరికా |
టెయిడ్ స్పెయిన్లో అత్యధికంగా సందర్శించే జాతీయ ఉద్యానవనం.2015 నాటికి ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే వాటిలో ఇది ఎనిమిదవదిగా గుర్తించబడింది.[2] దీనిని సంవత్సరానికి 3 మిలియన్ల మంది సందర్శకులు దర్శిస్తారు.[3] 2016 లో దీనిని 4,079,823 మంది పర్యాటకులు సందర్శించి చారిత్రక రికార్డును చేరుకుంది.[4][5]ఉద్యానవనం దర్శించటానికి దక్షిణాన ఎంచుకున్న ప్రాంతాల నుండి బయలుదేరి టెనెరిఫే పర్యాటక పట్టణాలకు ఉదయం, మధ్యాహ్నం కోచ్ ప్రయాణాలు ఉన్నాయి.శిఖరం చివరివరకు చేరుకోవటానికి అనుమతి (ఉచిత) అవసరం, అది ముందుగా పొందాలి.[6]