విశాఖపట్నం నగరంలోని పురాతన ప్రాంతాలలో ఒకటి From Wikipedia, the free encyclopedia
చెంగల్ రావు పేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని పురాతన ప్రాంతాలలో ఒకటి.[1] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలోని ఈ ప్రాంతం ద్వారకా బస్ స్టేషన్ నుండి సుమారు 4 కి.మీ.ల దూరంలో ఉంది.[2]
చెంగల్ రావు పేట | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17.697766°N 83.296371°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
Vehicle registration | ఏపి-31 |
ఇది 17.697766°N 83.296371°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.[3]
విశాఖపట్నం నగరంలోని ప్రధాన నివాస కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో ఓల్డ్ మునిసిపల్ ఆఫీస్, టౌన్ హాల్ విశాఖపట్నం, రీడింగ్ రూమ్, గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ వంటి అనేక పాత స్మారక చిహ్నాలు ఉన్నాయి.[4]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో చెంగల్ రావు పేట మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, కైలాసగిరి, టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, వెంకోజిపాలెం, ఓహ్పో, అరిలోవ, పూర్ణా మార్కెట్, యారాడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, మర్రిపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.