![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/c/cd/Ghantasala.jpg/640px-Ghantasala.jpg&w=640&q=50)
ఘంటసాల వెంకటేశ్వరరావు
సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. / From Wikipedia, the free encyclopedia
ఘంటసాల వెంకటేశ్వరరావు (1922 డిసెంబర్ 4 [1] - ఫిబ్రవరి 11, 1974) తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. ఘంటసాల జన్మతః వచ్చిన గంభీరమైన స్వరంతో, పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో, తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో ఒకరు. వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందినది.
ఈ వ్యాసం నేపథ్య గాయకుడు ఘంటసాల గురించి. ఇతర వాడుకల కొరకు, ఘంటసాల (అయోమయ నివృత్తి) చూడండి.
త్వరిత వాస్తవాలు ఘంటసాల వెంకటేశ్వరరావు, జననం ...
ఘంటసాల వెంకటేశ్వరరావు | |
---|---|
![]() ఘంటసాల | |
జననం | ఘంటసాల వెంకటేశ్వరరావు డిసెంబర్ 4, 1922 |
మరణం | 1974 ఫిబ్రవరి 11(1974-02-11) (వయసు 51) చెన్నై, తమిళనాడు |
ఇతర పేర్లు | ఘంటసాల |
వృత్తి | నేపథ్య గాయకుడు, |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సంగీత దర్శకుడు, గాయకుడు |
పదవీ కాలం | 1942–1974 |
జీవిత భాగస్వామి | సావిత్రమ్మ, సరళా దేవి (రెండో భార్య) |
పిల్లలు | నలుగురు కుమారులు (విజయ కుమార్, రత్న కుమార్, శంకర్ కుమార్, రవికుమార్) కుమార్తెలు (శ్యామల, సుగుణ, మీరా, శాంతి) |
తల్లిదండ్రులు |
|
వెబ్సైటు | http://www.ghantasala.info/ |
మూసివేయి