గూగ్లి ఎల్మో మార్కోని
ఇతలిఅన్ ఇంవెంతొర్ మరియు రెడ్యొ పిఒనీర్ / From Wikipedia, the free encyclopedia
గుగ్లిఎల్మో జియోవన్ని మారియా మార్కోనీ (1874 ఏప్రిల్ 25 - 1937 జూలై 20) ఇటాలియన్ ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్. [1][2][3][4] అతను సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపుటకు, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయుటలో పితామహుడుగా గుర్తింపు పొందాడు[5]. అతను రేడియో యొక్క ఆవిష్కర్త[6]. 1909 లో కార్ల్ ఫెడ్రినాండ్ బ్రాన్ తో కలసి వైర్లెస్ టెలిగ్రాఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి తీసుకున్నాడు[7][8][9]. 1897 లో బ్రిటన్ లో వైర్లెస్ టెలిగ్రాఫ్, సిగ్నల్ కంపెనీకి వ్యవస్థాపకునిగా ఉన్నాడు. అతను ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారంగా చేసుకొని రేడియో అనే కొత్త ఆవిష్కరణ చేసి వ్యాపార రంగంలో ఘనమైన విజయాన్ని సాధించాడు[10][11]. 1929 లో మార్కోనీని మార్చీజ్ అనే అవార్డుతో విక్టర్ ఇమ్మాన్యుయేల్ III గౌరవించాడు. 1931లో అతను పోప్ పియస్ XI కోసం వాటికన్ రేడియోను ఏర్పాటు చేశాడు.
గూగ్లి ఎల్మో మార్కోని | |
---|---|
జననం | 1874, ఏప్రిల్ 25 పాలెజ్జో మారిస్కాల్చి, బోలొగ్నా, ఇటలీ |
మరణం | 1937, జూలై 20 రోమ్,ఇటలీ |
నివాసం | ఇటలీ |
జాతీయత | ఇటాలియన్ |
చదువుకున్న సంస్థలు | బోలోగ్నా విశ్వవిద్యాలయం |
ప్రసిద్ధి | రేడియో |
ముఖ్యమైన పురస్కారాలు | నోబెల్ బహుమతి (1909) |
సంతకం |