ఖలీల్ జిబ్రాన్
From Wikipedia, the free encyclopedia
ఖలీల్ జిబ్రాన్ (/dʒɪˈbrɑːn/;[1] పూర్తి అరబిక్ పేరు జిబ్రాన్ ఖలీల్ జిబ్రాన్ (జుబ్రాన్ ఖలీల్ జుబ్రాన్ అనీ పలకవచ్చు) (అరబ్బీ: جبران خليل جبران / Jubrān Khalīl Jubrān or Jibrān Khalīl Jibrān) (1883 జనవరి 6 – 1931 ఏప్రిల్ 10) లెబనీస్-అమెరికన్ రచయిత, కవి, చిత్రకారుడు.
ఖలీల్ జీబ్రాన్ | |
---|---|
![]() 1931 ఏప్రిల్లో ఖలీల్ జీబ్రాన్ | |
పుట్టిన తేదీ, స్థలం | జుబ్రాన్ ఖలీల్ జుబ్రాన్ (1883-01-06)1883 జనవరి 6 బ్షార్రీ, లెబనాన్ ముతసర్రిఫేట్ పర్వతం, ఒట్టోమాన్ సిరియా |
మరణం | 1931 ఏప్రిల్ 10(1931-04-10) (వయసు 48) న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ |
వృత్తి | కవి, చిత్రకారుడు, రచయిత, తత్త్వవేత్త, ధార్మికవేత్త, విజువల్ ఆర్టిస్టు |
జాతీయత | లెబనీస్, అమెరికన్ |
రచనా రంగం | కవిత్వం, పారాబుల్ (దీర్ఘ వచనం), చిన్న కథ |
సాహిత్య ఉద్యమం | మహ్జార్ |
గుర్తింపునిచ్చిన రచనలు | ది ప్రాఫెట్, బ్రోకెన్ వింగ్స్ |
జిబ్రాన్ ఒట్టోమాన్ సామ్రాజ్యంలోని లెబనాన్ ముతసర్రిఫేట్ పర్వత ప్రాంతం (ప్రస్తుతం లెబనాన్లో భాగం) బ్షార్రీ పట్టణంలో[2] ఖలీల్ జిబ్రాన్, కమిలా జిబ్రాన్ (రహ్మెహ్) దంపతులకు జన్మించాడు. చిన్నవయసులోనే జిబ్రాన్ తన కుటుంబంతో పాటు అమెరికా వలసవెళ్ళి అక్కడ కళను అభ్యసించి, ఆంగ్ల, అరబిక్ భాషల్లో సాహిత్య రచన ప్రారంభించారు. అరబ్ ప్రపంచంలో, జిబ్రాన్ సాహిత్యంలోనూ, రాజకీయంలోనూ తిరుగుబాటుదారునిగా పేరొందాడు. అతని కాల్పనికవాద శైలి ఆధునిక అరబిక్ సాహిత్య పునరుజ్జీవనంలో కేంద్ర స్థానం పొందింది. అప్పటివరకూ ఉన్న సంప్రదాయ శైలి నుంచి ఖలీల్ జిబ్రాన్ శైలి విడిపోయి ప్రత్యేక మార్గాన్ని ఏర్పరిచింది. లెబనాన్లో ఆయనను ఇప్పటికీ సాహిత్యంలో హీరోగా భావిస్తారు.[3]
1923లో వెలువడ్డ ఖలీల్ జిబ్రాన్ రచన ద ప్రాఫెట్ (అనువాదం: ప్రవక్త) అతనికి ఆంగ్ల-భాషా ప్రపంచంలో ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది. ద ప్రాఫెట్ పుస్తకం ఆంగ్ల సాహిత్యంలో స్ఫూర్తిదాయకమైన కల్పనాత్మక రచనలకు తొలినాళ్ళ ఉదాహరణగా నిలుస్తోంది. దీనితోపాటుగా కవితాత్మకమైన ఆంగ్ల వచనంలో అతను రాసిన తాత్త్విక వ్యాసాలు ప్రాచుర్యం పొందాయి. విమర్శకులు పుస్తకం పట్ల పెద్దగా ఆసక్తి కనబరచకపోయినా మంచి పాఠకాదరణ పొందింది. 1930ల్లోనూ, తిరిగి 1960ల నాటి కౌంటర్ కల్చర్లోనూ ద ప్రాఫెట్ బాగా ఆదరణ పొందింది.[3][4] షేక్స్పియర్, లోజీల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అతిఎక్కువగా అమ్ముడైన పుస్తకాలు రాసిన కవుల్లో జిబ్రాన్ది మూడోస్థానం.[4]