From Wikipedia, the free encyclopedia
క్రోమియం(III)సల్ఫేట్ ఒక ఆకర్బన రసాయన సంయోగ పదార్ధం. ఇది నిర్జల, ఆర్ద్ర (జలయుత)రూపాల్లో లభిస్తుంది.అందువలన ఈ ఘన సంయోగ పదార్తంయోక్క రసాయన ఫార్ములా Cr2(SO4)3.x(H2O). ఈఈ ఫార్ములాలో Xఅను పదం, సదరు సంయోగపదార్థంలో మిళితమైఉన్న నీటి అణువుల సంఖ్యను తెలుపును. ఈ సంఖ్య1 నుండి 18 వరకు ఉండు అవకాశం ఉంది. ఈ సంయోగ పదార్ధం ఊదా రంగు లేదా పచ్చని రంగులో లభించును. క్రోమియం, సల్ఫర్, ఆక్సిజన్ మూలకాల పరమాణువుల సంయోగం వలన ఈ సంయోగ పదార్థం ఏర్పడినది.
పేర్లు | |
---|---|
IUPAC నామము
క్రోమియం(III)సల్ఫేట్ | |
ఇతర పేర్లు
Basic chromium sulfate, chromic sulfate | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [10101-53-8] |
పబ్ కెమ్ | 24930 |
SMILES | [Cr+3].[Cr+3].[O-]S(=O)(=O)[O-].[O-]S([O-])(=O)=O.[O-]S([O-])(=O)=O.O.O.O.O.O.O.O.O.O.O.O.O |
| |
ధర్మములు | |
Cr2(SO4)3 • 12H2O | |
మోలార్ ద్రవ్యరాశి | 392.16 g/mol 608.363 g/mol (dodecahydrate) 716.45 g/mol (octadecahydrate) |
స్వరూపం | reddish-brown crystals (anhydrous), purple crystals (hydrated) |
సాంద్రత | 3.10 g/cm3 (anhydrous) 1.86 g/cm3 (pentadecahydrate) 1.709 g/cm3 (octadecahydrate) |
ద్రవీభవన స్థానం | 90 °C |
బాష్పీభవన స్థానం | decomposes to chromic acid |
నీటిలో ద్రావణీయత |
insoluble (anhydrous) soluble (hydrated) |
ద్రావణీయత | soluble in alcohol practically insoluble in acid |
అయస్కాంత ససెప్టిబిలిటి | +11,800·10−6 cm3/mol |
ప్రమాదాలు | |
భద్రత సమాచార పత్రము | MSDS |
జ్వలన స్థానం | {{{value}}} |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible) |
TWA 1 mg/m3[1] |
REL (Recommended) |
TWA 0.5 mg/m3[1] |
IDLH (Immediate danger) |
250 mg/m3[1] |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
క్రోమియం(III)సల్ఫేట్ ను క్రింద వివరించ బడిన మూడు రకాలగా వర్గీకరణచెయ్యవచ్చు
ఇంకా మరికొన్ని క్రోమియం(III)సల్ఫేట్గా పిలవబడు సంయోగ పదార్థాలున్నప్పటికి అవి హైడ్రాక్సైడ్లను లేదా ఆక్సైడ్ లిగండులను(ligands)కల్గి ఉండును.ముఖ్యంగా వాణిజ్య పరంగా లభించుప్రాథమిక క్రోమియం సల్ఫేట్ [Cr2(H2O)6(OH)4]SO4 రూపంలో ఉంది.దీని CAS సంఖ్య#39380-78-4.హెక్సా హైడ్రేట్ను పాక్షిక తటస్థీకరణ (neutralization) చెయ్యడం ద్వారా తయారు చేయుదురు
నిర్జల సంయోగ పదార్ధం ఎరుపు, గోధుమరంగుల మిశ్రమ రూప స్పటికాకృతిలో ఉండును.
నిర్జల సంయోగ పదార్ధం యొక్క అణుభారం లేదా మోలారు బరువు 392.18 గ్రాములు.[2] 12 నీటి అణువులున్న రసాయనపదార్థ అణుభారం 608.363 గ్రాములు/మోల్. అలాగే 18 జలాణువులున్న పదార్ధం అణుభారం 716.45 గ్రాములు/మోల్.
నిర్జల సంయోగ పదార్ధం యొక్క సాంద్రత 3.10 గ్రాములు/సెం.మీ2.[3] 15 జలాణువులున్న సంయోగ పదార్ధం సాంద్రత 1.86 గ్రాములు/ సెం.మీ2.అలాగే 18 జలాణువులున్న సంయోగ పదార్ధం సాంద్రత 1.709 గ్రాములు. సెం.మీ2.
క్రోమియం (III)సల్ఫేట్ ద్రవీభవన స్థానం 90 °C.
90 °C మించి వేడి చేసిన క్రోమిక్ ఆమ్లంగా వియోగం చెందును.
నిర్జల సంయోగ పదార్ధం నీటిలో కరగదు.అయితే జలాణువులున్న సంయోగ పదార్ధం నీటిలో కరుగును.ఆల్కహాల్లో కరుగును.ఆమ్లాలలో కరుగదు.
వివిధ రకాల సేంద్రియ సమ్మేళన సంయోగ పదార్థాలతో క్రోమేట్ల ఆక్సీకరణ వలన ఏర్పడు క్రోమియం(III)వ్యర్థపదార్థాలు క్రోమియం (III)సల్ఫేట్ యొక్క ముఖ్య జనక/ ఉత్పాదకమూల పదార్థాలు. అంత్రాసిన్, ఫెనోల్ లను క్రోమిక్ ఆమ్లంతో రసాయన చర్యకు లోను కావించినపుడు అంత్రాసిన్, ఫెనోల్ ఉత్పత్తి అగును.ఆసమయంలో క్రోమియం(III)ఆక్సైడ్ ఉప ఉత్పత్తిగా ఏర్పడును.ఇలా ఏర్పడిన క్రోమియం ఆక్సైడ్ ను సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కరిగించి సంగ్రహించెదరు. ఇప్పుడు ఈ ఆమ్లద్రావణాన్ని ఇగుర్చుట వలన జలబిందుయుత(hydrate)క్రోమియం(III)సల్ఫేట్ ఉత్పత్తి అగును. అలాగే క్రోమియం ఖనిజాన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లంతో కొంత క్రోమేట్ సమక్షములో సంగ్రహించినపుడు, కొన్ని ఇతర లోహమలినాలతో కూడిన క్రోమియం(III)సల్ఫేట్ ద్రావణాన్ని ఇస్తుంది. అలాగే క్రోమియం ధాతువుమిశ్రమాలను సల్ఫ్యూరిక్ ఆమ్లంలో చర్య నొందించడం వలన కుడా ఫెర్రస్ సల్ఫేట్లతో కూడిన క్రోమియం(III)సల్ఫేట్ను ఏర్పరచును
ఇతర ఉత్పత్తి పద్ధతులున్నప్పటికి ప్రాథమిక క్రోమియం సల్ఫేట్]ను సల్ఫర్ డయాక్సైడ్ తో క్రోమియం లవణాలను క్షయికరణ చర్యకు లోను కావించడం వలన ఉత్పత్తి కావించెదరు.
క్రోమియం(III)సల్ఫేట్ యొక్క కొన్ని రసాయన చర్యలు[3]
క్రోమియం(III)సల్ఫేట్ ను రంగుల్లో,సిరాలతయారిలో, వస్త్రాల అద్దకంలో ఉపయోగిస్తారు.[4]
ఈ రసాయనం వాతావరణంలో కలిసిన దాని ప్రభావం చ్గూపును.కావున వాడు నపుదు వాతవరనంలో కలువకుందా జాగ్రత్తలు తీసుకోవాలి[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.