From Wikipedia, the free encyclopedia
1979, సెప్టెంబర్ 21న జమైకా లోని కింగ్‌స్టన్‌లో జన్మించిన క్రిస్టోఫర్ క్రిస్ హెన్రీ గేల్ (Christopher "Chris" Henry Gayle) వెస్ట్ఇండీస్కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఎడమ చేతితో బ్యాటింగ్, కుడి చేతితో బౌలింగ్ చేయగల నైపుణ్యం ఇతనికి ఉంది. 2001 జూలైలో క్రిస్ గేల్స్, డారెన్ గంగాతో కలిసి జింబాబ్వేపై బులావయో మ్యాచ్‌లో తొలి వికెట్టుకు 215 పరుగుల భాగస్వామ్యం చేసి రికార్డు సృష్టించారు.
క్రిస్ గేల్స్ ఇంతవరకు 103 టెస్టుమ్యాచ్‌లు ఆడి 7214 పరుగులు చేశాడు. అందులో 15 సెంచరీలు, 37 అర్థసెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక టెస్ట్ స్కోరు 333 పరుగులు. బౌలింగ్‌లో 73 టెస్ట్ వికెట్లు కూడా సాధించాడు.
వన్డేలలో 301 మ్యాచ్‌లు ఆడి 10480 పరుగులు సాధించాడు. అందులో 25 సెంచరీలు, 54 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 215. బౌలింగ్‌లో 167 వన్డే వికెట్లు కూడా సాధించాడు.
క్రిస్ గేల్ 2003, 2007 20l9ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లలో వెస్ట్ఇండీస్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
2005లో దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 317 పరుగులు సాధించి తన ప్రతిభను నిరూపించాడు. అంతకు ముందు అదే సీరీస్ తొలి టెస్టులో జట్టు తరఫున స్పాన్సర్షిప్ వివాదం వల్ల మరో ఆరుగురు వెస్ట్ఇండీస్ క్రికెటర్లతో పాటు ఆడలేకపోయాడు. రెండో, మూడవ టెస్టు మ్యాచ్ ఆడిననూ అంతగా రాణించలేడు. ఆ తరువాత నాలుగవ మ్యాచ్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించి దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను చితకబాది తన క్రీడా జీవితంలోనే అత్యధిక టెస్ట్ స్కోరును సాధించాడు.
ఢాకా వేదికగా జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) టోర్నీలో రంగ్‌పూర్ రైడర్స్ తరపున ఏకంగా 18 సిక్సర్లు బాది, కేవలం 69 బంతుల్లో 146 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో నాలుగు ఫోర్లు కూడా ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 211.59గా ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.