![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b0/ManikeswarTemple.jpg/640px-ManikeswarTemple.jpg&w=640&q=50)
కలహండి జిల్లా
ఒడిశా లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో కలాహండి జిల్లా (ఒడిషా:କଳାହାଣ୍ଡି) ఒకటి. భవానీపట్న ఈ జిల్లాకు కేంద్రం. పురాతన కాలంలో ఈ ప్రాంతం సుందరమైన, గొప్ప సాంస్కృతిక వైభవం కలిగి ఉంది. ఈ ప్రాతంలో పురాతత్వ త్రవ్వకాలలో రాతియుగం, ఇనుప యుగానికి చెందిన మానవ ఆవాసాలకు చెందిన ఆధారాలు లభించాయి.[2] ఈప్రాంతంలోని అసురగర్ 2000 సంవత్సరాలకు ముందునాటి నగరప్రాంతానికి చెందిన మానవ ఆవాసాల ఆధారాలు లభించాయి.[3] ఆసియాలో వరిపంట పండిచిన ప్రాతాలలో కలాహండి, కోరాపుట్ ప్రాంతాలు మొదటివని విశ్వసించబడుతుంది. పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని " మహాకాంతారా " (గొప్ప అరణ్యం), కరుంద మండలం ( అని పిలిచేవారు. కురందం అంటే కురందం లేక మాణిక్యం, కెంపు (గార్నెట్), బెరుజ్, నీలం, అలెగ్జాండ్రా మొదలైన విలువైన రాళ్ళు లభించే ప్రాంతం అని అర్ధం. బ్రిటిష్ ఇండియాలో ఈ ప్రాంతం రాజసంస్థానంగా ఉంది. స్వతంత్రం తరువాత కలాహండి ప్రాతం (ప్రస్తుత నౌపడా జిల్లా ప్రాంతంతో కలిపి) ఒడిషాలో కలుపబడింది. 1967లో కలాహండి జిల్లాలోని కాశీపూర్ బ్లాకు పరిపాలనా సౌలభ్యంకొరకు రాయగడ జిల్లాలో కలుపబడింది. 1980లో కలాహండి జిల్లా వెనుకబడిన జిల్లా, కరువుకాటకాలకు, ఆకలి మరణాలకు కేంద్రంగా గుర్తించబడింది. దీనిని " కలాహండి సిండ్రోం "గా పిలిచారు.[4] గతంలో కలాహండి ప్రాంతం సంపన్నతకు చిహ్నంగా ఉండేది. చరిత్రలో ఈ ప్రాంతం వ్యవసాయం, అరణ్యం సంపద, రత్నాలు, బాక్సైట్, జానపద నృత్యాలు, జానపద సంగీతం, ఫోల్క్లోర్, హద్థకళలు, కళలకు ప్రతీకగా ఉండేది. 1993 నౌపడా ఉపవిభాగం జిల్లాగా రూపొందించబడింది. ప్రస్తుత కలాహండి పార్లమెంటు నియోజక వర్గంలో కహంది, నౌపడా జిల్లాలు భాగంగా ఉన్నాయి.
కలాహండి | ||||
---|---|---|---|---|
జిల్లా | ||||
ఎగువ: మాణికేశ్వరి ఆలయం దిగువ: డోకరిచంచర | ||||
![]() ఒడిశా పటంలో జిల్లా స్థానం | ||||
దేశం | ![]() | |||
State | ఒడిశా | |||
ప్రధాన కార్యాలయం | Bhawanipatna | |||
Government | ||||
• కలెక్టరు | Dr Bijay Ketan Upadhyaya, IAS | |||
• Member of Lok Sabha | Arka Keshari Deo, BJD | |||
విస్తీర్ణం | ||||
• Total | 7,920 కి.మీ2 (3,060 చ. మై) | |||
జనాభా (2011)[1] | ||||
• Total | 15,73,054 | |||
• జనసాంద్రత | 169/కి.మీ2 (440/చ. మై.) | |||
భాషలు | ||||
• అధికార | ఒరియా, హిందీ, English | |||
Time zone | UTC+5:30 (IST) | |||
పిన్కోడ్ | 766 xxx | |||
Vehicle registration | OD-08 | |||
లింగ నిష్పత్తి | 0.999 ♂/♀ | |||
అక్షరాస్యత | 62.45% | |||
లోక్సభ నియోజకవర్గం | Kalahandi | |||
Vidhan Sabha constituency | 5
| |||
శీతోష్ణస్థితి | Aw (Köppen) |