From Wikipedia, the free encyclopedia
ఓం ప్రకాశ్ చౌతాలా (జననం 1 జనవరి 1935) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను భారత 6వ ఉప ప్రధాని చౌదరి దేవి లాల్ కుమారుడు. ఓం ప్రకాశ్ చౌతాలా చౌతాలా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 1995 నుంచి 2005 వరకు నాలుగు పర్యాయాలు హర్యానా ముఖ్యమంత్రిగా పని చేశాడు.
ఓం ప్రకాశ్ చౌతాలా | |||
పదవీ కాలం 24 జులై 1999 – 5 మార్చి 2005 | |||
ముందు | బన్సీ లాల్ | ||
---|---|---|---|
తరువాత | భూపిందర్ సింగ్ హూడా | ||
పదవీ కాలం 22 మార్చి 1991 – 6 ఏప్రిల్ 1991 | |||
ముందు | హుకమ్ సింగ్ | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
పదవీ కాలం 12 జులై 1990 – 17 జులై 1990 | |||
ముందు | బనారసీ దాస్ గుప్తా | ||
తరువాత | హుకమ్ సింగ్ | ||
పదవీ కాలం 2 డిసెంబర్ 1989 – 22 మే 1990 | |||
ముందు | దేవీలాల్ | ||
తరువాత | బనారసీ దాస్ గుప్తా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | చౌతాలా, పంజాబ్, భారతదేశం | 1935 జనవరి 1||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | ||
జీవిత భాగస్వామి | స్నేహ లత చౌతాలా | ||
సంతానం | అజయ్ సింగ్ చౌతాలా, అభయ్ సింగ్ చౌతాలా సహా 5 | ||
నివాసం | సిర్సా జిల్లా, హర్యానా | ||
వృత్తి | వ్యవసాయదారుడు | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
హర్యానాలో 2000 సంవత్సరంలో 3,206 మంది జూనియర్ ఉపాధ్యాయులను అక్రమంగా నియమించిన కేసులో చౌతాలా, అతను కుమారుడు అజయ్ చౌతాలా, ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ సహా 53 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో అతనిని 2013లో అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించింది.
2021లో కరోనాను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ప్రభుత్వం జైళ్లలో రద్దీని తగ్గించేందుకు పదేళ్ల జైలు శిక్షలో కనీసం తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్షా కాలం పూర్తి చేసిన వారికి 6నెలలు మినహాయింపును ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో అతనికి ఆరు నెలల మినహాయింపు లభించి జైలు నుంచి విడుదలయ్యాడు.[1]
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా 1993 నుంచి 2006 మధ్య ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని నిర్ధారణ కావడంతో ఢిల్లీకి చెందిన సీబీఐ కోర్టు అతనికి 2002 మే 27న నాలుగేళ్ల జైలుశిక్షతో పాటు 50 లక్షల జరిమానా కూడా విధించింది.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.