అవిసె మొక్క లినేసి /లైనేసి కుటుంబానికి చెందినమొక్క. ఈమొక్క వృక్షశాస్త్రనామం:Linum usitatissimum.తెలుగులో అవిశ అనే పేరుతోఒక చెట్టు ఉంది. ఆచెట్టు ఫాబేసి కుటుంబానికి చెందినది.ఆచెట్టు వృక్షశాస్త్రనామం:సెస్బానియా గ్రాండిఫ్లోరా.కావున కొన్నిసందర్భాలలో అవిసెను అవిశగా పొరబడే అవకాశమున్నది.ఈవ్యాసంలో పెర్కొన్న అవిసెను ఆంగ్లంలో linseed లేదా Flaxseed అంటారు.వ్యవసాయపంటగా నూనెగింజలకై సాగుచేయు మొక్క.ఏకవార్షికం.

Thumb
అవిసె పూలు
Thumb
పందిన కాయలు
Thumb
అవిసె గింజలు
Thumb
అవిసె నూనె

ఇతరభారతీయభాషలలో అవిసె పేరు

  • హింది, గుజరాతి, పంజాబి:అల్సి (Alsi)
  • మరాతి:జరస్ (jaras, అల్సి, (Alsi)
  • కన్నడం:అగసె (agase)
  • తమిళం:అలిరిథల్ (alirithal)
  • ఒరియా:పెషి (peshi)
  • బెంగాలి, అస్సామీ:తిషి (Tishi, అల్సి (Alsi)

ఈపంటను సాగుచేస్తున్న రాష్ట్రాలు

భారతదేశంలో మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహరు, రాజస్తాన్, బెంగాలు,, కర్నాటక రాష్ట్రాలు సాగుచేస్తున్నవి.[1]

నూనెగింజలు

మొక్కలు నాలుగడుగుల ఎత్తువరకు పెరుగును,.[2] ఆకులు 20-40మి.మీ.పొడవు, 3 మి.మీవెడల్పు వుండును.ఇందులో రెండు రకాలు న్నాయి. చిన్నగింజల రకం, పెద్దగింజల రకం .చిన్నగింజలు బ్రౌనురంగులో, పెద్దవి పసుపురంగులో వుండును. పూలు లేతనీలంరంగులో వుండును. విత్తనదిగుబడి వర్షాధారమైనచో 210-450 కిలోలు/హెక్టారుకు వచ్చును. నీటిపారుదలక్రింద 1200-1500కిలోలు/హెక్టారుకు దిగుబడివచ్చును.నూనెశాతం చిన్నరకం గింజల్లో 33.0% వరకు పెద్దగింజల్లో 34-36%వరకుండును.గింజలలో 15-29% వరకు చక్కెరలు,5-10%వరకు పీచుపదార్థం (Fiber) వుండును. మాంసకృత్తులు 20-24% వరకుండును.నూనెగింజలు ఆపిలు పండు గింజల ఆకారంలో వుండి, పైపొట్టు మెరుపుగా వుండును. పొడవు 4-6మి.మీ.పొడవుండును. చిన్నరకం గింజలైనచో గ్రాముకు 170 వరకు, పెద్దగింజలైనచో 130 వరకు తూగును.

నూనె

అవిసె నూనెగింజలను మొదట నూనెతీయు యంత్రాలలోఆడించి నూనెను తీసి, కేకులోవున్న నూనెను సాల్వెంట్ ఎక్సుట్రాక్షను ప్లాంటుద్వారా తీయుదురు. నూనెతీయు యంత్రాలలో నూనెను రెండు పద్ధతులలో తీయుదురు. ఒకటి కోల్డుప్రాసెస్. ఈపద్ధతిలో నూనెగింజలను వేడిచెయ్యకుండ నేరుగా ఎక్సుపెల్లరులను నూనెతీయు యంత్రాలలో క్రష్‍చేయుదురు. ఈపద్ధతిలో వచ్చిననూనె పసుపురంగులో వుండును.కాని కేకులో ఎక్కువశాతం నూనె మిగిలిపోవును. హాట్‍ప్రాసెసు పద్ధతిలో గింజలను స్టీముద్వారా మొదట వేడిచేసి ఆపిమ్మట క్రష్‍ చేయుదురు.ఈ పద్ధతిలో సేకరించిన నూనెకొద్దిగా ముదురు పసుపురంగులో వుండును. కాని గింజలనుండి వచ్చుదిగుబడి ఎక్కువ వుండును.

అవిసె నూనె భౌతిక లక్షణాలు (ముడి నూనె, [3]

లక్షణాలువిలువలమితి
తేమ0.25
వక్రీభవణ సూచిక 400C1.4720-1.4750
సాంద్రత 300C/300C0.923-0.928
సపొనిఫికేసను విలువ188-195
ఐయోడిన్ విలువ170 కనిష్ఠం.
అన్‍సపోనిఫియబుల్‍పదార్థం1.5-2.0%
Foots1.0 గరిష్ఠం

అవిసె నూనెలోని కొవ్వు ఆమ్లాలశాతం (భారతదేశం లో) [3]

కొవ్వు ఆమ్లాలుశాతము
పామిటిక్ ఆమ్లంC16:04-16
స్టియరిక్ ఆమ్లంC18:00.-10.0
ఒలిక్ ఆమ్లంC18:113-38
లినొలిక్ ఆమ్లంC18:27-18
లినొలెనిక్ ఆమ్లంC18:335-67

విదేశాలలో ఉత్పత్తిఅగు అవిసెనూనెలో వున్న కొవ్వుఆమ్లాలశాతం

కొవ్వు ఆమ్లాలుశాతం
పామిటిక్ ఆమ్లం.C16:06.0
పామిటొలిక్ ఆమ్లం.C16:10.0-0.5
స్టియరిక్ ఆమ్లం.C18:02.0-3.0
అరచిడిక్ ఆమ్లం.C20:00-0.5
ఒలిక్ ఆమ్లం.C18:110.0-22.0
లినొలిక్ ఆమ్లం.C18:212.0-18.0
లినొలెనిక్ ఆమ్లం.C18:356.0-71.0

నూనె వినియోగం

అవిసె నూనెలో మూడు ద్విబంధాలున్న లినోలెనిక్ కొవ్వు ఆమ్లం 55% దాటి వుండటంవలన ఈనూనె మంచి డ్రయింగ్ (drying oil) నూనె లక్షణాలు కల్గివున్నది. బహు ద్విబంధాలున్న కొవ్వు ఆమ్లాలు త్వరగా పాలిమరులుగా మార్పుచెందును. అందుచే రిఫైండు చేసిన అవిసెనూనెను నేరుగా రంగులలో కలిపే తిన్నరు (thinner) గా వినియోగిస్తారు. అలాగే రంగుల పరిశ్రమలలో కూడా [4][5] మరి చిత్రకళలో ఉపయోగించు రంగుల తయారిలో అవిసె నూనెను ఉపయోగిస్తారు. .అల్ఫా-లినోలెనిక్ కొవ్వు ఆమ్లం ఎక్కువగా వున్నందున, అవిసె రిఫైండునూనెను కొద్దిమొత్తంలో ఇతర రిఫైండు నూనెలో కలిపి వంటనూనెగా ఉపయోగించవచ్చును.[4]

ఆధారాలు-అంతరలింకులు

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.