From Wikipedia, the free encyclopedia
అల్యూమినియం పొటాషియం సల్ఫేట్ లేదా పొటాషియం అల్యూమినియంసల్ఫేట్ ఒక రసాయన సంయోగ పదార్థం.ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్థం. ఈ సంయోగ పదార్థం పొటాషియం, అల్యూమినియం, సల్ఫర్, ఆక్సిజన్ మూలకాల సంయోగము వలన ఏర్పడినది. అల్యూమినియం పొటాషియం సల్ఫేట్ రసాయన సంకేత పదం KAl (SO4) 2. అల్యూమినియం పొటాషియం సల్ఫేట్ సాధారణంగా 12 జలాణువులు (dodecahydrate) కల్గిన దొడేకా హైడ్రేట్ అల్యూమినియం పొటాషియం సల్ఫేట్ (KAl (SO4) 2•12H2O) లభిస్తుంది. 12 జలాణువులు కల్గిన సజల/నార్ద్ర అల్యూమినియం పొటాషియం సల్ఫేట్ను ఆలం (Alum/పటిక) అంటారు. అల్యూమినియం పొటాషియం సల్ఫేట్/పటికను నీటిని శుద్ధీకరణ చెయ్యుటకు, తోళ్ళను పదును పెట్టుటకు, రంగుల అద్దకం,[2] అగ్నినిరోధక దుస్తుల తయారీ,, బేకింగ్ పౌడర్లలో ఉపయోగిస్తారు. అలాగే సౌందర్యసామాగ్రిలైన డియోరెంట్లులలో, ఆప్టర్ షేవ్ లోషన్ గా ఉపయోగిస్తారు.[3]
పేర్లు | |
---|---|
IUPAC నామము
Aluminium potassium sulfate dodecahydrate[1] | |
ఇతర పేర్లు
Potassium alum Potash alum Alum-(K) | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [10043-67-1] |
పబ్ కెమ్ | 24856 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:86463 |
SMILES | [O-]S(=O)(=O)[O-].[O-]S(=O)(=O)[O-].[Al+3].[K+] |
| |
ధర్మములు | |
KAl(SO4)2·12H2O | |
మోలార్ ద్రవ్యరాశి | 474.3884 g/mol |
స్వరూపం | white small crystals |
వాసన | watery metallic |
సాంద్రత | 1.725 g/cm3 |
ద్రవీభవన స్థానం | 92–93 °C (198–199 °F; 365–366 K) |
బాష్పీభవన స్థానం | 200 °C (392 °F; 473 K) |
నీటిలో ద్రావణీయత |
14.00 g/100 mL (20 °C) 36.80 g/100 mL (50 °C) |
ద్రావణీయత | insoluble in acetone |
వక్రీభవన గుణకం (nD) | 1.4564 |
ప్రమాదాలు | |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
పొటాషియం ఆలం, పొటాష్ ఆలం, ఆలం (K),, పొటాషియం అల్యూమినియంసల్ఫేట్
అల్యూమినియం పొటాషియం సల్ఫేట్/ పోటాష్ ఆలం తెల్లని స్పటికరూపంలో లభించును. ఒకరకమైన లోహ వాసన కల్గి ఉంది.అల్యూమినియం పొటాషియం సల్ఫేట్ అణుభారం 474.3884 గ్రాములు /మోల్.25 °C వద్ద పోటాష్ ఆలం సాంద్రత 1.725 గ్రాములు/సెం.మీ3. పోటాష్ ఆలం ద్రవీభవన స్థానం 92 to 93 °C (198 to 199 °F; 365 to 366K) .పోటాష్ ఆలం బాష్పీభవన స్థానం 200 °C (392 °F;473K) .పోటాష్ ఆలం నీటిలో కరుగుతుంది. 100 మి.లీ నీటిలో 20 °C వద్ద 14.0 గ్రాములు, 50 °C వద్ద గ్రాముల పోటాష్ ఆలం కరుగుతుంది. పోటాష్ ఆలం అసిటోన్ లో కరుగదు. అల్యూమినియం పొటాషియం సల్ఫేట్/ పోటాష్ ఆలం వక్రీభవన సూచిక 1.4564 .
అల్యూమినియం పొటాషియం సల్ఫేట్/పొటాషియం ఆలం చదునైన అంచులున్నఅష్టభుజాకృతి స్పటికసౌష్టవం కల్గిఉన్నది.లిట్మస్ పేపరును పోటాష్ ఆలం కషాయము (astringent) ఎరుపు రంగుకు మార్చును.ఎరుపుగా మరే వరకు వేడిచేసిన గుల్లతనంకలిగిన, నలిస్తే చూర్ణము అయ్యేరూపం కలిగిన ‘’’కాల్చినపటిక’’’ ఏర్పడును. 92°C(198°F) వరకు వేడిచేసిన, అణువులో ఉన్న స్పటికజలంలోద్రవీకరణ చెంది కరిగిపోతుంది. ‘’’తటస్థ ఆలం’’’ను పొందుటకై సోడియం బై కార్బోనేట్ ను పోటాష్ ఆలం ద్రవానికి ఎక్కువ ప్రమాణంలో చేర్చినఅల్యుమిన అపక్షేపముగా వేరుపడును.
సల్ఫైడ్ ఖనిజాలు, పొటాషియం కలిగిన ఖనిజాలు ఆక్సీకరణచెందటం వలనఏర్పడును. గతంలోఅగ్ని సల్ఫర్ కలిగిన అగ్నిపర్వత సేడిమేంటలు వనరు అయిన అలునైట్ (alunite) [4] నుండి అల్యూమినియం పొటాషియం సల్ఫేట్ను ఉత్పత్తి చేసేవారు. ఈ ఖనిజ ప్రాంతాలను, ఇటలీఆరిజోనా, పిలిప్పిన్స్, శాంతాక్రజ్ కంట్రీలలో గుర్తించారు.
చర్మాన్ని తాకినపుడు స్వల్పంగా ఇరిటేసన్ కల్గించును.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.