From Wikipedia, the free encyclopedia
అమలా పాల్ కేరళకు చెందిన సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.
అమలా పాల్ | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | అనఖ |
వృత్తి | నటి, రూపదర్శి |
క్రియాశీల సంవత్సరాలు | 2009 నుండి ఇప్పటివరకు |
జీవిత భాగస్వామి | ఎ. ఎల్. విజయ్ (m. 2014; div. 2017) |
ఈమె అసలు పేరు అనఖ . కేరళ లోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. వీరి కుటుంబము కేరళ లోని కొచ్చిలో స్థిరపడింది. తండ్రి వర్గీస్ పాల్, కేంద్రప్రభుత్వ ఉద్యోగి. తల్లి అన్నీస్ పాల్ గృహిణి. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. విద్యాభ్యాసాన్ని కోచిలో పూర్తిచేసింది.
2009 లో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ లో ప్రవేశానికై ఒక సంవత్సరము విరామము తీసుకొంది. ఈ సమయంలో ఈవిడ చాయాచిత్రాలు చూసిని ప్రముఖ మలయాళ దర్శకుడు లాల్ జోస్ తన చిత్రం నీల తామర లో ఒక చిన్న పాత్రకు ఈమెను ఎంచుకున్నాడు. ఆచిత్రం విజయవంతము కానప్పటికి, అందులో ఈవిడ నటన విమర్శకుల ప్రశంసలు అందుకొంది. తరువాత తమిళ హాస్యచిత్రం వికడకవి లో ఒక పాత్రను పోషించింది. ఈ చిత్ర విడుదల బాగా ఆలస్యంగా జరిగి, ఈవిడ 6 వ చిత్రంగా విడుదలయ్యింది. ఈమధ్యలో వీర శేకరన్ , సింధు సామవేళి అనే తమిళ చిత్రాలలో నటించింది. సామి దర్శకత్వంలో వచ్చిన సింధు సామవేళిలో ఈమె పోషించిన సుందరి పాత్ర వివాదాలను సృష్టించింది. ఇందులో మావగారితో అక్రమ సంబంధాన్ని కొనసాగీచే కోడలి పాత్రలో నటించింది. తరువాత మైనా చిత్రంలో నటించింది. ఈ చిత్ర ఘనవిజయంతో అవకాశాలు వెల్లువెత్తాయి.
సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు | మూ |
---|---|---|---|---|---|
2009 | నీలతామర | బీనా | మలయాళం | ||
2010 | వీరశేఖరన్ | సుగంధి | తమిళం | ||
సింధు సమవేలి | సుందరి | అనఖా గా ఘనత పొందారు | |||
మైనా | మైనా | ||||
2011 | ఇది నమ్ముదే కథ | ఐశ్వర్య | మలయాళం | ||
వికడకవి | కవిత | తమిళం | |||
దైవ తిరుమగల్ | శ్వేతా రాజేంద్రన్ | ||||
బెజవాడ | గీతాంజలి | తెలుగు | |||
2012 | వెట్టై | జయంతి | తమిళం | ||
కాదలిల్ సోదప్పువదు ఎప్పడి / లవ్ ఫెయిల్యూర్ | పార్వతి | తమిళం/తెలుగు | తమిళం & తెలుగులో ద్విభాషా చిత్రం | ||
ముప్పోజుదుమ్ ఉన్ కార్పనైగల్ | చారులత (చారు / లత) | తమిళం | |||
ఆకాశతింటే నిరం | పడుచు అమ్మాయి | మలయాళం | |||
రన్ బేబీ రన్ | రేణుక | ||||
2013 | నాయక్ | నందిని | తెలుగు | ||
ఇద్దరమ్మాయిలతో | కోమలి శంకరాభరణం | ||||
తలైవా | ఏసీపీ మీరా నారాయణన్ | తమిళం | |||
ఓరు భారతీయ ప్రణయకధ | ఐరీన్ గార్డనర్ | మలయాళం | |||
2014 | నిమిరందు నిల్ | పూమారి | తమిళం | ||
వేలైల్లా పట్టధారి | డా. షాలిని | ||||
కథై తిరైకతై వసనం ఇయక్కమ్ | ఆమెనే | పొడిగించిన అతిధి పాత్ర | |||
ఐయోబింటే పుస్తకం | నర్తకి | మలయాళం | అతిధి పాత్ర | ||
2015 | మిలి | మిల్లీ | |||
జెండాపై కపిరాజు | ఇందుమతి | తెలుగు | [1] | ||
లైలా ఓ లైలా | అంజలి మీనన్ (లైలా) | మలయాళం | |||
పసంగ 2 | వెంబ తమిళ్ నాదన్ | తమిళం | తెలుగులో మేము | ||
2016 | 2 పెంకుట్టికల్ | అశ్వతి | మలయాళం | ||
అమ్మ కనక్కు | శాంతి గోపాల్ | తమిళం | [2] | ||
షాజహనుం పరీకుట్టియుమ్ | జియా | మలయాళం | |||
2017 | హెబ్బులి | నందిని | కన్నడ | [3] | |
అచాయన్లు | రీటా | మలయాళం | |||
వేలైల్లా పట్టధారి 2 | డా. షాలినీ రఘువరన్ | తమిళం | |||
తిరుట్టు పాయలే 2 | అగల్య సెల్వం | ||||
2018 | భాస్కర్ ఓరు రాస్కెల్ | అను | |||
రాత్ససన్ | విజయ "విజి" లక్ష్మి | ||||
2019 | ఆడై | కామిని / సుధంతిర కోడి | తెలుగులో ఆమె | ||
2021 | కుట్టి స్టోరీ | మృణాళిని | విభాగం: "ఎదిర్పారా ముతం" | [4] | |
పిట్ట కథలు | మీరా | తెలుగు | విభాగం: "మీరా" | [5][6] | |
2022 | శవ | డా. బధ్ర తంగవేల్ | తమిళం | నిర్మాత కూడా | [7][8] |
గురువు | దేవిక | మలయాళం | [9] | ||
2023 | క్రిస్టోఫర్ | సులేఖ | [10] | ||
భోలా | డాక్టర్ స్వర | హిందీ | ప్రత్యేక ప్రదర్శన | [11] | |
2024 | ది గోట్ లైఫ్ | సైను | మలయాళం | పోస్ట్ ప్రొడక్షన్ | [12] |
ద్విజ † | TBA | చిత్రీకరణ | [13] | ||
లెవల్ క్రాస్ † | TBA | పూర్తయింది | [14] |
సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు | మూ |
---|---|---|---|---|---|
2021 | కుడి ఎడమైతే | సీఐ దుర్గాగౌడ్ | తెలుగు | ||
2022 | రంజిష్ హాయ్ సాహి | అమ్నా పర్వేజ్ | హిందీ | ||
రాజు వూట్ల పార్టీ | తమిళం | ||||
బాధితుడు: నెక్స్ట్ ఎవరు? | అంజన | తమిళం |
అమలా పాల్ 2014లో దర్శకుడు విజయ్‌తో వివాహం చేసుకొని 2017లో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె నటుడు జగత్ దేశాయ్ ను 2023 నవంబర్ 5న వివాహం చేసుకుంది.[15][16]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.