అబ్రహం లింకన్
16వ అమెరికా అధ్యక్షుడు / From Wikipedia, the free encyclopedia
అబ్రహం లింకన్ (ఫిబ్రవరి 12, 1809 – ఏప్రిల్ 15, 1865) ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాజీ అమెరికా అధ్యక్షుడు. అమెరికా అంతర్యుద్ధ సమయంలో అత్యంత కార్యదక్షతతో పరిపాలించిన లింకన్ దురదృష్టవశాత్తూ అంతర్యుద్ధం ముగిసే సమయంలోనే హత్యగావింపబడ్డాడు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అబ్రహం లింకన్ | |||
అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 16వ అధ్యక్షుడు | |||
---|---|---|---|
పదవీ కాలం ఏప్రిల్ 3, 1861 – ఏప్రిల్ 15, 1865 | |||
ఉపరాష్ట్రపతి | Hannibal Hamlin (1861 – 1865) Andrew Johnson (1865) | ||
ముందు | జేమ్స్ బుకానన్ | ||
తరువాత | ఆండ్రూ జాన్సన్ | ||
పదవీ కాలం మార్చి 4, 1847 – మార్చి 3, 1849 | |||
ముందు | జాన్ హెన్రీ | ||
తరువాత | థామస్ హారిస్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1809-02-12)1809 ఫిబ్రవరి 12 హార్డిన్ కౌంటీ, కెంటకీ | ||
మరణం | 1865 ఏప్రిల్ 15(1865-04-15) (వయసు 56) వాషింగ్టన్ డి.సి | ||
జాతీయత | అమెరికన్ | ||
రాజకీయ పార్టీ | Whig (1832-1854), Republican (1854-1864), National Union (1864-1865) | ||
జీవిత భాగస్వామి | Mary Todd Lincoln | ||
సంతానం | Robert Todd Lincoln, Edward Lincoln, Willie Lincoln, Tad Lincoln | ||
వృత్తి | న్యాయవాది | ||
మతం | క్రైస్తవం | ||
సంతకం |
లింకన్ కెంటకీలోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. వారి ఒక పురాతన చెక్క ఇల్లు. అమెరికా పాశ్చాత్య సరిహద్దు ప్రాంతం, ప్రధానంగా ఇండియానాలో పెరిగాడు. తానే స్వంతంగా చదువుకుని న్యాయవాది అయ్యాడు. విగ్ పార్టీకి నాయకుడు అయ్యాడు. ఇల్లినోయ్ రాష్ట్ర లెజిస్లేటర్ గారూ, ఆ రాష్ట్రం నుంచి అమెరికన్ ప్రతినిథిగానూ ఎన్నికయ్యాడు. 1849 లో స్ప్రింగ్ ఫీల్డ్, ఇల్లినోయ్ లో మళ్ళీ న్యాయవాదిగా కొంతకాలం ఉన్నాడు. 1854 లో కంసాన్-నెబ్రాస్కా చట్టం బానిసత్వానికి వంత పాడటంతో మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వచ్చాడు. తొందర్లోనే కొత్త రిపబ్లికన్ పార్టీకి నాయకుడు అయ్యాడు.