అంగారకుడు
సూర్యుడి దగ్గర నుంచి నాలుగో గ్రహం / From Wikipedia, the free encyclopedia
అంగారకుడు సౌరవ్యవస్థలోని గ్రహాలలో నాలుగవ గ్రహం. దీనికి కుజుడు అనే పేరు కూడా ఉంది. దీని రంగు కారణంగా 'అరుణ గ్రహం' అని కూడా పేరు వచ్చింది. ఇది సౌర కుటుంబం సూర్యుని చుట్టూ పరిభ్రమించే 9 గ్రహాలలో నాలుగో స్థానంలో ఉంటుంది. ఈ గ్రహం సూర్యుడు నుంచి 14 కోట్ల పది లక్షల మైళ్ళ దూరంలో ఉంది ఇది సూర్యుని చుట్టూ తిరగడానికి 687 రోజులు పడుతుంది ఆగ్రహం తన చుట్టూ తాను తిరగడానికి 14 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది.ఈ గ్రహంలో ఎర్ర రాళ్లు ఉండటం వలన ఎర్రగా ఉంటుంది సూర్యుని చుట్టూ తిరిగే దీనికి కక్ష్య దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది అందువలన ఇది పరిభ్రమించే టప్పుడు కొన్ని సమయాల్లో దగ్గరగానే మరి కొన్ని సమయాల్లో దూరంగానే ఉంటుంది దీని పరిమాణం భూ పరిమాణాల్లో 1/9 వంతు.
హబుల్ టెలీస్కోపు నుండి 'అంగారకుడు' | ||||||||||
కక్ష్యా లక్షణాలు[1] | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
Epoch J2000 | ||||||||||
అపహేళి: | 249,209,300 km 1.665861 AU | |||||||||
పరిహేళి: | 206,669,000 km 1.381497 AU | |||||||||
Semi-major axis: | 227,939,100 km 1.523679 AU | |||||||||
అసమకేంద్రత (Eccentricity): | 0.093315 | |||||||||
కక్ష్యా వ్యవధి: | 686.971 day 1.8808 Julian years | |||||||||
సైనోడిక్ కక్ష్యా వ్యవధి: | 779.96 day 2.135 Julian years | |||||||||
సగటు కక్ష్యా వేగం: | 24.077 km/s | |||||||||
వాలు: | 1.850° 5.65° to సూర్యుని మధ్యరేఖ (నడిమి గీఁత) | |||||||||
Longitude of ascending node: | 49.562° | |||||||||
Argument of perihelion: | 286.537° | |||||||||
దీని ఉపగ్రహాలు: | 2 | |||||||||
భౌతిక లక్షణాలు | ||||||||||
మధ్యరేఖ వద్ద వ్యాసార్థం: | 3,396.2 ± 0.1 km[2][3] 0.533 Earths | |||||||||
ధ్రువాల వద్ద వ్యాసార్థం: | 3,376.2 ± 0.1 km[2][3] 0.531 Earths | |||||||||
ఉపరితల వైశాల్యం: | 144,798,500 km² 0.284 Earths | |||||||||
ఘనపరిమాణం: | 1.6318×1011 km³ 0.151 Earths | |||||||||
ద్రవ్యరాశి: | 6.4185×1023 kg 0.107 Earths | |||||||||
సగటు సాంద్రత: | 3.934 g/cm³ | |||||||||
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: | 3.69 m/s² 0.376 g | |||||||||
పలాయన వేగం: | 5.027 km/s | |||||||||
సైడిరియల్ రోజు: | 1.025957 day 24.62296 h | |||||||||
మధ్యరేఖ వద్ద భ్రమణ వేగం: | 868.22 km/h | |||||||||
అక్షాంశ వాలు: | 25.19° | |||||||||
ఉత్తర ధ్రువపు రైట్ ఎసెన్షన్: | 21 h 10 min 44 s 317.68143° | |||||||||
డిక్లనేషన్: | 52.88650° | |||||||||
అల్బిడో: | 0.15 | |||||||||
ఉపరితల ఉష్ణోగ్రత: Kelvin సెల్సియస్ |
| |||||||||
Apparent magnitude: | +1.8 to -2.91[5] | |||||||||
Angular size: | 3.5" — 25.1"[5] | |||||||||
విశేషాలు: | 'అంగారకుని' | |||||||||
వాతావరణం | ||||||||||
ఉపరితల పీడనం: | 0.7–0.9 kPa | |||||||||
సమ్మేళనం: | 95.72% కార్బన్ డై ఆక్సైడ్ 2.7% నైట్రోజన్ |
అంగారకుడి పుట్టుక గుఱించి హిందూ పురాణాల్లో మూడు కథలు వాడుకలో ఉన్నాయి.
1. భూదేవికి విష్ణుమూర్తికి పుట్టిన కొడుకే అంగారకుడు అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది.
2. ఒకసారి, నేల మీద పడ్డ విష్ణువు చెమట బొట్టు నుండి ఒక పురుషుడు పుట్టాడు. అతను తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఒక గ్రహంగా మారాడు. ఆ గ్రహమే 'కుజ గ్రహం' అని పద్మ పురాణం చెబుతుంది.
3. దాక్షాయణి దూరమైన ఎడబాటులో ఉన్న శివుడి శరీరం లోంచి రాలిన ఓ చెమట బొట్టు నుండి ఒక పురుషుడు పుడితే, భూదేవి అతన్ని తన సొంత కొడుకుఁగా చేరదీసిందనీ, అతనే కుజుఁడని మరో కథ కూడా నానుడిలో ఉంది.
కుజ గ్రహానికి రెండు సహజసిద్ధ ఉపగ్రహాలు ఉన్నాయి. అవి ఫోబోస్, డెయిమోస్, ఇవి చిన్నవిగాను, గుండ్రతనం కొఱవడి అనాకారంగాను ఉన్నాయి.[5]