జాంబియా
From Wikipedia, the free encyclopedia
జాంబియా అధికారికంగా " జాంబియా రిపబ్లికు ". ఇది దక్షిణ-మధ్య ఆఫ్రికాలో ఒక భూ పరివేష్టిత దేశం.[4] (కొన్ని వనరులు ఇది తూర్పు ఆఫ్రికా[5]) లో భాగంగా ఉందని సూచిస్తున్నాయి). దేశ ఉత్తరసరిహద్దులో కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్, ఈశాన్యసరిహద్దులో టాంజానియా, తూర్పుసరిహద్దులో మలావి, దక్షిణసరిహద్దులో మొజాంబిక్, దక్షిణసరిహద్దులోజింబాబ్వే, బోత్సువానా, నైరుతిసరిహద్దులో నమీబియా, పశ్చిమసరిహద్దులో అంగోలా ఉన్నాయి. రాజధాని నగరం లుసాకా జాంబియా దక్షిణ-కేంద్ర ప్రాంతంలో ఉంది. జనాభా ప్రధానంగా దక్షిణప్రాంతంలో ఉన్న లసుకా, వాయవ్య ప్రాంతంలో ఉన్న కాపెబెల్టు ప్రావింసులో కేంద్రీకృతమై ఉంది. ఇవి రెండూ దేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాలుగా ఉన్నాయి.
రిపబ్లిక్ ఆఫ్ జాంబియా | ||||||
---|---|---|---|---|---|---|
నినాదం "ఒకే జాంబియా, ఒకే దేశం" |
||||||
జాతీయగీతం |
||||||
రాజధాని | లుసాక 15°25′S 28°17′E | |||||
అతి పెద్ద నగరం | లుసాకా | |||||
అధికార భాషలు | ఆంగ్లము | |||||
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | న్యంజ, బెంబ, లుండ, టోంగ, లొజి, లువలె, కవొండె. | |||||
ప్రజానామము | జాంబియన్ | |||||
ప్రభుత్వం | రిపబ్లిక్ | |||||
- | అధ్యక్షుడు | రుపియబండ | ||||
- | ఉపాధ్యక్షుడు | జార్జ్ కుండ | ||||
స్వతంత్రము | బ్రిటన్ దేశము నుండి | |||||
- | తేదీ | 24 అక్టోబరు1964 | ||||
- | జలాలు (%) | 1 | ||||
జనాభా | ||||||
- | 2009 అంచనా | 12,935,000[1] (71st) | ||||
- | 2000 జన గణన | 9,885,591[2] | ||||
జీడీపీ (PPP) | 2009 అంచనా | |||||
- | మొత్తం | $18.454 billion[3] | ||||
- | తలసరి | $1,541[3] | ||||
జీడీపీ (nominal) | 2009 అంచనా | |||||
- | మొత్తం | $13.000 billion[3] | ||||
- | తలసరి | $1,086[3] | ||||
జినీ? (2002–03) | 42.1 (medium) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | 0.434 (low) (165th) | |||||
కరెన్సీ | జాంబియన్ క్వాచా (ZMK ) |
|||||
కాలాంశం | CAT (UTC+2) | |||||
- | వేసవి (DST) | not observed (UTC+2) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .zm | |||||
కాలింగ్ కోడ్ | +260 |
ఈ ప్రాంతంలో ముందుగా ఖియోసన్ ప్రజలు నివసించేవారు. ఈ ప్రాంతం 13 వ శతాబ్దంలో బంటు విస్తరణ ద్వారా ప్రభావితమైంది. 19 వ శతాబ్దంలో ఐరోపా అన్వేషకుల సందర్శనల తరువాత ఈ ప్రాంతం 19 వ శతాబ్దం చివరలో బారోట్జిలాండ్-నార్తు- వెస్టర్ను రోడేషియా, నార్తు-తూర్పు రోడేసియా బ్రిటీషు సంరక్షక ప్రాంతాలుగా మారాయి. 1911 లో ఇవి విలీనమై ఉత్తర రొడీషియాగా పిలువబడింది. బ్రిటీషు సౌత్ ఆఫ్రికా కంపెనీ సలహాతో లండను నుండి నియమించిన అధికారులు జాంబియాను పాలించారు.
1964 అక్టోబరు 24 న జాంబియా యునైటెడు కింగ్డం నుండి స్వతంత్రం పొందింది. ప్రధాన మంత్రి కెన్నెత్ కౌండ మొదటి అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. కౌండా సోషలిస్టు యునైటెడు నేషనలు ఇండిపెండెన్సు పార్టీ 1964 నుండి 1991 వరకు అధికారాన్ని నిర్వహించింది. ప్రాంతీయ దౌత్య కార్యక్రమంలో కౌండా కీలక పాత్ర పోషించింది. రోడెసియా (జింబాబ్వే), అంగోలా, నమీబియాలలో వివాదాలకు పరిష్కారాల కోసం యునైటెడు స్టేట్సుతో సన్నిహితంగా ఉండి సహకరించింది.[6] 1972 నుండి 1991 వరకు జాంబియా "వన్ జాంబియా, వన్ నేషన్" అనే నినాదంతో " యు.ఎన్.ఐ.పి. పార్టీ " ఏకైక చట్టపరమైన రాజకీయ పార్టీగా ఏకపార్టీ-దేశంగా ఉంది. 1991 లో బహుళ-పార్టీ ప్రజాస్వామ్య స్థాపన కొరకు సామాజిక-ప్రజాస్వామ్య ఉద్యమం సాగించి ఫ్రెడెరికు చిలుబా కౌండా నుండి అధికారం స్వాధీనం చేసుకున్నాడు. తరువాత సామాజిక-ఆర్ధిక వృద్ధి, ప్రభుత్వ అధికార వికేంద్రీకరణ కాలం ప్రారంభమైంది. చిలీ ఎన్నుకున్న వారసుడిగా ఉన్న లేవీ మ్వానవాసా 2002 జనవరి నుండి ఆయన మరణం వరకు జాంబియా అధ్యక్షపదవి వహించాడు. 2008 ఆగస్టులో అతని మరణం వరకు అవినీతిని తగ్గించడానికి, జీవన ప్రమాణం పెంచడానికి ప్రచారంలో పాల్గొన్నాడు. మ్వానవాసా చనిపోయిన తరువాత 2008 లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యే ముందు తాత్కాలిక అధ్యక్షుడుగా రూపియా బండా అధ్యక్షత వహించారు. 3 సంవత్సరాలు తాత్కాలిక అద్యక్షుడుగా కార్యాలయ బాధ్యతలు వహించిన తరువాత నిర్వహించబడిన " పేట్రియాటిక్ ఫ్రంట్ పార్టీ " నాయకుడైన మైఖేల్ సతా తన ఎన్నికలలో బండాను ఓడించి పదవి నుండి తొలగించాడు. 2014 అక్టోబరు 28 న సతా మరణించాడు. దీనితో ఆయన కార్యాలయంలో చనిపోయిన రెండవ జాంబియా అధ్యక్షుడిగా గుర్తించబడ్డాడు.[7] Guy Scott served briefly as interim president until new elections were held on 20 January 2015, [8] 2015 జనవరి 20 న కొత్త ఎన్నికలు నిర్వహించబడే వరకు గై స్కాట్ తాత్కాలిక అధ్యక్షుడిగా స్వల్పకాలం సేవలను అందించాడు. ఎన్నికలలో ఎడ్గరు లుంగు జింబావే 6 వ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.
2010 లో ప్రపంచ బ్యాంకు ప్రపంచంలో అత్యంత వేగంగా ఆర్థికంగా సంస్కరించబడిన దేశం జాంబియా అని వర్గీకరించింది.[9] తూర్పు, దక్షిణ ఆఫ్రికా కామను మార్కెట్టు ప్రధాన కార్యాలయం లూసాకాలో ఉంది.కెన్నెత్ కౌండజాంబియా దేశానికి మొదటి అధ్యక్షుడుగా పనిచేశాడు.