హైదరాబాదు క్రికెట్ జట్టు
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో దేశీయ క్రికెట్ జట్టు / From Wikipedia, the free encyclopedia
హైదరాబాదు క్రికెట్ టీం అనేది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా నిర్వహించబడుతున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ఉన్న దేశీయ క్రికెట్ టీం. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‌లో భాగంగా ఉన్న ఈ టీం, రంజీ ట్రోఫీలో అనేక సంవత్సరాలుగా విజయాలను సాధిస్తున్నది. రంజీ ట్రోఫీలో రెండుసార్లు గెలిచి, మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఇరానీ ట్రోఫీలో కూడా ఒకసారి ఆడింది.
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, కెప్టెన్ ...
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | తన్మయ్ అగర్వాల్ |
కోచ్ | జె. అరుణ్ కుమార్ |
యజమాని | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ |
జట్టు సమాచారం | |
స్థాపితం | 1934 |
స్వంత మైదానం | రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం |
సామర్థ్యం | 55,000 |
చరిత్ర | |
రంజీ ట్రోఫీ విజయాలు | 2 (1937/38,1986/87) |
ఇరానీ ట్రోఫీ విజయాలు | 1 (1986/87) |
విజయ్ హరారే ట్రోఫీ విజయాలు | 0 |
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు | 0 |
అధికార వెబ్ సైట్ | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ |
2021–22 హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీజన్ |
మూసివేయి