వెనక్కి కూడా ఎగిరే సత్తా వీటికుంది. ఈ పక్షులు గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలవు.
ఇవి సెకనుకు 200 సార్లు రెక్కలాడించగలవు!
వీటిల్లో మగ పక్షుల ముక్కులు కాస్త పొడుగ్గా, వాడిగా ఉంటాయి. అవి వాటి పదునైన ముక్కునే కత్తుల్లా వాడుకుంటాయిట. అంటే శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ముక్కునే ఆయుధాల్లా ఉపయోగిస్తాయన్నమాట. న్యూ మెక్సికో స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఇన్నాళ్లూ ఈ పక్షులు చురుకైన ముక్కుల ద్వారా పూల మకరందాన్ని మాత్రమే ఆస్వాదిస్తాయని అనుకున్నారు. కానీ ఇవి ముక్కుతో చేసే పనులు చూసి ఆశ్చర్యపోయారు.
ఇవి ఒకదానితో మరోటి గొంతుపై ముక్కుతో పొడుచుకుంటూ పోటీపడతాయి. తమ జతపక్షి ఇబ్బందుల్లో ఉంటే శత్రువుల్నించి కాపాడ్డానికి కూడా మగ హమ్మింగ్ పక్షులు ముక్కులతో ప్రత్యర్థుల గొంతుపై గట్టిగా పొడుస్తూ యుద్ధానికి దిగుతాయి.
కొస్టారికా ప్రాంతంలో శాస్త్రవేత్తలు నాలుగేళ్ల పాటు ఈ పరిశోధన చేశారు. అక్కడున్న వివిధ వయసు పక్షుల ముక్కుల పొడవు, చురుకుతనం లాంటివి తెలుసుకుని మరీ పరీక్షించారట. ఇలాంటి నైపుణ్యం అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్‌కు ఉండడంతో ఆశ్చర్యపోయారు.
ఇది వరకు జరిగిన పరిశోధనల్లో మగ హమ్మింగ్‌లు ఆడ పక్షుల్ని ఆకట్టుకోవడానికి గొంతును మార్చుతూ శబ్దాలు చేస్తాయనే సంగతి తెలిసింది.
Anna's hummingbird
Hummingbird feeding from a flower in the University of California Botanical Garden
Hummingbird with yellow pollen on its beak in the University of California Botanical Garden
Magnificent hummingbird
Costa's hummingbird
Green violet-ear
Juvenile Anna's hummingbird with tongue sticking out
A hummingbird on a feeding fountain in Brazil
Calypte anna perched
Grooming
Hummingbird attacking larger song sparrow
Hummingbird and honey bee sizes compared
Hummingbird feeding in winter
Artificial hummingbird
Hummingbird chicks in nest in cactus in Mesa, Arizona
Hummingbird adult in nest in cactus in Mesa, Arizona
త్వరిత వాస్తవాలు
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.