స్థానిక స్వపరిపాలన
రాష్ట్ర స్థాయి కంటే తక్కువ ప్రభుత్వ అధికార పరిధిని సూచిస్తుంది. / From Wikipedia, the free encyclopedia
ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వామం ఉండాలి. పెద్దదేశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే, సులభం కాదు. అతి విశాలమైన భారతదేశంలో మారుమూల ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలంటే పరిపాలన / పరిపాలనా అధికార వికేంద్రీకరణం చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని స్థానిక స్వపరిపాలన విధానం ఏర్పాటైంది.[1]