సోవియట్ సమాఖ్య లేదా సోవియట్ యూనియన్ [lower-alpha 1], అధికారికంగా సోవియట్ సామ్యవాద గణతంత్రాలు సమాఖ్య [lower-alpha 2], సూక్ష్మ రూపం యు.ఎస్.ఎస్.ఆర్ (ఆంగ్లము USSR నుండి) ఇంకనూ సోవియట్ యూనియన్ [1] (రష్యన్ లో Советский Союз ) ; (రోమనీకరణ : Sovetsky Soyuz), రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సోషలిస్టు రాజ్యం. ఇది యురేషియాలో 1922 నుండి 1991 వరకు విలసిల్లింది. 1991 లో ఇందు నుండి దీని రిపబ్లిక్ రాష్ట్రాలు విడిపోయాయి.

త్వరిత వాస్తవాలు సోవియట్ సామ్యవాద గణతంత్రాలు సమాఖ్య Союз Советских Социалистических Республик¹Soyuz Sovetskikh Sotsialisticheskikh Respublik¹, రాజధాని ...
సోవియట్ సామ్యవాద గణతంత్రాలు సమాఖ్య

Союз Советских Социалистических Республик¹
Soyuz Sovetskikh Sotsialisticheskikh Respublik¹
19221991
Thumb
జండా
Thumb
Coat of arms
నినాదం: Пролетарии всех стран, соединяйтесь!
(Translit.: Proletarii vsekh stran, soyedinyaytes!)
English translation: Workers of the world, unite!
గీతం: The Internationale (1922–1944)
Hymn of the Soviet Union (1944-1991)
Thumb
రాజధానిమాస్కో
సామాన్య భాషలురష్యన్ (de facto),
14 other official languages
ప్రభుత్వంసోషలిస్టిక్ గణతంత్రం
General Secretary 
 1922–1924 (మొదటి)
వ్లాదిమిర్ లెనిన్
 1985–1991 (ఆఖరి)
మిఖాయిల్ గోర్బచేవ్
Premier 
 1923–1924 (మొదటి)
వ్లాదిమిర్ లెనిన్
 1991 (ఆఖరి)
ఇవాన్ సిలయేవ్
చరిత్ర 
 స్థాపన
డిసెంబరు 30 1922
 పతనం
December 26 19912 1991
విస్తీర్ణం
199122,402,200 కి.మీ2 (8,649,500 చ. మై.)
జనాభా
 1991
293047571
ద్రవ్యంరూబుల్ (SUR)
కాల విభాగంUTC+2 to +13
ఫోన్ కోడ్7
Internet TLD.su
Preceded by
Succeeded by
Russian Soviet Federative Socialist Republic
Transcaucasian Socialist Federative Soviet Republic
Ukrainian Soviet Socialist Republic
Byelorussian Soviet Socialist Republic
రష్యా
బెలారుస్
ఉక్రెయిన్
మాల్డోవా
జార్జియా
ఆర్మీనియా
అజర్‌బైజాన్
కజకస్తాన్
ఉజ్బెకిస్తాన్
తుర్కమేనిస్తాన్
కిర్గిజిస్తాన్
తజికిస్తాన్
ఎస్టోనియా
లిథువేనియా
లాట్వియా
1Official names of the USSR
2On 21 December 1991, eleven of the former socialist republics declared in Alma-Ata (with the twelfth republic - Georgia - attending as an observer) that with the formation of the Commonwealth of Independent States the Union of Soviet Socialist Republics ceases to exist.
మూసివేయి

ఏర్పాటు

1917లో రష్యా విప్లవం, 1918 - 1921 లో రష్యన్ ప్రజా యుద్ధాల తరువాత, రష్యన్ సామ్రాజ్యం నుండి సోవియట్ యూనియన్ ఉద్భవించింది. ఈ సోవియట్ యూనియన్ అనేక సోవియట్ రిపబ్లిక్ ల సమూహం. సోషలిస్టు సోవియటు రిపబ్లికుల సమితి. 1918లో రష్యాలో జరిగిన విప్లవఫలితముగా ఏర్పడిన సంయుక్తరాష్ట్రము. దీనిలో 7 రాష్ట్రములు ఉన్నాయి. దీని విస్తీర్ణము 82,41,910 చ|| మైళ్ళు. జనసంఖ్య14 కోట్ల 80 లక్షలు. దీనిని పరిపాలించు రాజ్యాంగ సంస్థలు సెనేటు వంటి కౌన్సిల్‌ ఆఫ్‌ నేషనాలిటీస్‌, యూనియన్‌ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివు కమిటీ అనబడు కేంద్ర కార్యనిర్వాహక సంఘము; వీరెన్నుకొను పీపిల్సు కమిజారియట్‌ కవున్సిలు అనబడు కార్యనిర్వాహక ఉపసంఘములు, కమిజారియటు ఉపసంఘములు, ఇతరదేశములందలి మంత్రివర్గముల వంటివి. ఒక్కొక డిపార్టుమెంటు ఒక్కొక కమిజారియటు క్రింద నుండును. సోనియటు కాంగ్రెసు అనబడు ప్రజాప్రతినిధుల శాసనసభ యొకటి అప్పుడప్పుడు సమావేశ మగుచుండును. సోవియటు అనగా కవున్సిలు లేక జనసంఘము. గ్రామ సోవియటు పట్టణ సోవియటు సభలకు రచయితలు, కార్మికులు బహిరంగముగా ప్రతినిధుల నెన్నుకొందురు. ఈ సోవియటులు ఫిర్కా సోవియటులకును, అవి సోవియటు కాంగ్రెసునకును ప్రతినిధుల నెన్నుకొనును. సోనియటు కాంగ్రెను శాస్త్ర ప్రకారము శాసనసభయైనను నిజముగా శాసనములు చేయు సంస్థ సెంట్రలు ఎగ్జిక్యూటివు కేంద్ర కార్యనిర్వాహక సంఘమే. ఈ శాసనములను రాజ్యాంగ పద్ధతులను సూచించు సంస్థ ఈ రెంటికిని భిన్నమైన కమ్యూనిస్టు పార్టీ అనబడు రాజకీయపక్షీయుల సభ. ఇది అనుద్యోగసంస్థయైనను నిజముగా దేశములో గొప్పపలుకుబడి కలిగియున్నది. ఈ సంస్థకుమాత్రమే బహిరంగముగను స్వేచ్ఛగను సమావేశమగు హక్కు ఉంది. వార్తాపత్రికలద్వారా అభిప్రాయ ప్రకటన స్వాతంత్ర్యము ఉంది. వైర్లెసు, సినిమాల నుపయోగించుకొని ప్రజాభిప్రాయమును కలిగింపగలదు. దీని యభిప్రాయములను సెంట్రలు ఎగ్జిక్యూటివు కవున్సిలువారును కవున్సిలు ఆఫ్‌ నేషనాలిటీస్‌ సభవారును కూడా మన్నించుచుందురు.

స్టాలిన్ యుగం

స్టాలిన్ యుగం సోవియట్ సమాఖ్య గొప్ప ముందడుగు వేసింది. స్టాలిన్ నాయకత్వంలో వ్యవసాయాన్ని సమిష్ఠీకరించడం జరిగింది, వేగవంతమైన పారిశ్రామికీకరణ కూడా జరిగింది. స్టాలిన్ యుగంలో ప్రైవేట్ మార్కెట్ ను పూర్తిగా రద్దు చేశారు. వ్యవసాయ సమిష్ఠీకరణని భూస్వాములు, మధ్య తరగతి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిఘటించిన భూస్వాములు, రైతుల్ని అరెస్ట్ చెయ్యడం లేదా బలవంతంగా పని చెయ్యించడం జరిగింది. సోవియట్ సమాఖ్యలో వ్యవసాయ సమిష్ఠీకరణ తరువాత గణణీయంగా ఆహారోత్పత్తి పెరిగింది. కానీ రష్యన్ జైళ్ళలో మాత్రం ఖైదీలకి సరైన ఆహారం, మందులు అందక చనిపోయారు. సోవియట్ సమాఖ్య నుంచి ఇతర దేశాలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. 1940 కాలంలో ప్రపంచం మొత్తంలోని 40% ఆహారం సోవియట్ సమాఖ్యలోనే ఉత్పత్తి అయ్యేది. రెండవ ప్రపంచ యుధ్ధ సమయంలో నాజీ జర్మనీ రష్యన్ వ్యవసాయ క్షేత్రాల పై బాంబులు వెయ్యడం వల్ల వ్యవసాయానికి భారీ నష్టం వచ్చింది. స్టాలిన్ చనిపోయిన తరువాత ప్రపంచ ఆహార ఉత్పత్తిలో సోవియట్ సమాఖ్య వాటా 40% నుంచి 20%కి తగ్గిపోయింది.

స్టాలిన్ అనంతర కాలం

స్టాలిన్ చనిపోయిన తరువాతి కాలంలో రష్యాలో కృష్చేవ్, బ్రెజ్ఞేవ్ వంటి రివిజనిస్ట్ నాయకులు అధికారంలోకి వచ్చారు. వీరు రష్యాలో ప్రైవేట్ పెట్టుబడులని పునరుద్ధరించారు. పెట్టుబదారీ బ్యూరోక్రాటిక్ ప్రభుత్వం నడిపారు. 1991లో సోవియట్ సమాఖ్యని పూర్తిగా రద్దు చేశారు.

ఇవీ చూడండి

  • సోవియట్ యూనియన్ చరిత్ర
  • రష్యా విప్లవం

నోట్స్

  1. ఆంగ్లము Soviet Union నుండి, రష్యన్: Сове́тский Сою́з, tr. Sovétsky Soyúz సోవియట్స్కీ సైయుజ్, IPA: [sɐˈvʲɛt͡skʲɪj sɐˈjus]
  2. రష్యన్: Сою́з Сове́тских Социалисти́ческих Респу́блик (СССР), tr. Soyúz Sovétskikh Sotsialistícheskikh Respúblik (SSSR) సైయుజ్ సోవియట్స్కీ సోత్సియాలిస్టిచీకి రేస్పుబ్లిక్ (ఎస్.ఎస్.ఎస్.ఆర్), IPA: [sɐˈjus sɐˈvʲɛtskʲɪx sətsɨəlʲɪsˈtʲitɕɪskʲɪx rʲɪˈspublʲɪk], ఆంగ్లము: Union of Soviet Socialist Republics యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.