సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ (/snt ˈvɪnsənt ænd ðə ɡrɛnəˈdnz/) లెస్సర్ ఆంటిల్లెస్ ద్వీపసమూహంలో సార్వభౌమాధికారం కలిగిన దేశం.ఇది కరీబియన్ సముద్రంలోని దక్షిణతీరంలో ఉంది. ద్వీపం ఈతరువాత అట్లాంటిక్ సముద్రం మొదలౌతుంది. దేశాన్ని సెయింట్ విన్సెంట్ అని కూడా క్లుప్తంగా పిలుస్తారు.

త్వరిత వాస్తవాలు Saint Vincent and the Grenadines, రాజధాని ...
Saint Vincent and the Grenadines

Thumb
జండా
Thumb
Coat of arms
నినాదం: "Pax et Justitia" (Latin)
"Peace and Justice"
గీతం: 
Thumb
రాజధానిKingstown
13°10′N 61°14′W
అధికార భాషలుEnglish
జాతులు
  • 66% Black
  • 19% Mixed
  • 6.0% Indian
  • 4% European
  • 2.0% Carib Amerindian
  • 3.0% others
పిలుచువిధంVincentian, Vincy
ప్రభుత్వంParliamentary democracy under constitutional monarchy
 Monarch
Elizabeth II
 Governor-General
Frederick Ballantyne
 Prime Minister
Ralph Gonsalves
శాసనవ్యవస్థHouse of Assembly
Independence
 Associated State
27 October 1969
 from the United Kingdom
27 October 1979
విస్తీర్ణం
 మొత్తం
389 కి.మీ2 (150 చ. మై.) (184th)
 నీరు (%)
negligible
జనాభా
 2013 estimate
103,000[1] (196th)
 2011 census
109,991
 జనసాంద్రత
307/చ.కి. (795.1/చ.మై.) (39th)
GDP (PPP)2016 estimate
 Total
$1.243 billion[2]
 Per capita
$11,291[2]
GDP (nominal)2016 estimate
 Total
$784 million[2]
 Per capita
$7,123[2]
హెచ్‌డిఐ (2014)Increase 0.720[3]
high · 97th
ద్రవ్యంEast Caribbean dollar (XCD)
కాల విభాగంUTC-4
వాహనాలు నడుపు వైపుleft
ఫోన్ కోడ్+1 784
ISO 3166 codeVC
Internet TLD.vc
మూసివేయి

దేశంలోని 389చ.కి.మీ వైశాల్యం కలిగిన భూభాగం సెయింట్ విన్సెంట్ ద్వీపం ప్రధానభూభాగంగా ఉంది. దేశంలో భాగంగా ఉన్న సెయింట్ విన్సెంట్ ద్వీపానికి గ్రెనడా ద్వీపానికి మద్య ఉన్న చిన్నద్వీపాలను గ్రెనడైంస్ ద్వీపాలు అంటారు.సెయింట్ విన్సెంట్ ద్వీపంలోని అత్యధిక భాగం హరికెన్ బెల్టులో ఉంది.సెయింట్ విన్సెంట్ ఉత్తరదిశలో సెయింట్ లూసియా, తూర్పుదిశలో బార్బడోస్ ఉన్నాయి.1,02,000 జనసంఖ్య కలిగిన సెయింట్ విన్సెంట్ గ్రెనడైంస్ జసంధ్రత అధికంగా కలిగినదేశం. రాజధాని నగరం " కింగ్‌స్టన్ " దేశానికి ప్రధాన నౌకాశ్రయ నగరంగా కూడా ఉంది.సెయింట్ విన్సెంట్ ఫ్రెంచి, బ్రిటిష్ కాలానీచరిత్రను కలిగి ఉంది.ప్రస్తుతం " ఆర్గనైజేషన్ ఆఫ్ ఈస్టర్న్ కరీబియన్ స్టేట్స్, కరీబియన్ కమ్యూనిటీ, కామంవెల్ట్ ఆఫ్ నేషంస్, బొలివేరియన్ అలయంస్ ఫర్ ది అమెరికాస్ , కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికన్ అండ్ కరీబియన్ స్టేట్స్‌లో భాగంగా ఉంది.

చరిత్ర

ఆరంభకాల సెటిల్మెంట్

ప్రస్తుతం సెయింట్ విన్సెంట్ అని పిలువబడుతున్న ద్వీపం గతంలో " యులౌమియన్ " అని పిలువబడింది.[4] స్థానిక ఐలాండు కరీబియన్లు ఈద్వీపాన్ని కలినా లేక కరినా (వారి భాషలో ఎల్. , ఆర్. ఒకేలా ఉచ్ఛరించబడుతుంది) అని పిలిచేవారు.1719 వరకు సెయింట్ విన్సెంట్ లోని కరీబియన్లు యురేపియన్ సెటిల్మెంట్లను తీవ్రంగా ఎదుర్కొన్నారు. అంతకు పూర్వం నౌకధ్వంశం కావడం కారణంగా ద్వీపానికి చేరుకున్న, సెయింట్ లూసియా,బార్బడోస్ , గ్రెనడాల నుండి ఆశ్రయం కోరి ప్రధానభూభాగం సెయింట్ విన్సెంట్ చేరుకున్న ఆఫ్రికన్ బానిసలు కరీబియన్లను జాత్యంతర వివాహాలు చేసుకుని బ్లాక్ కరీబియన్లు , గరిఫ్యునా అని పిలువబడ్డారు.

ఫ్రెంచి కాలనీ - మొదటి విడత

సెయింట్ విన్సెంట్ మొదటి సారిగా ఫ్రెంచి ఆక్రమించుకున్నది. వరుస యుద్ధాలు , ఒప్పందాలు తరువాత ద్వీపాలు బ్రిటిష్ ప్రభుత్వానికి స్వాధీనం చేసింది. బ్రిటిష్ సెయింట్ విన్సెంట్‌ను బ్రిటిష్ స్వాధీనం చేసుకున్న అదే సమయంలో మార్టినిక్యూ ద్వీపాన్ని ఫ్రెంచి స్వాధీనం చేసుకున్నది. 1719లో సెయింట్ విన్సెంట్ లీవర్డ్ వైపు " బర్రౌల్లీ " సెటిల్మెంటు స్థాపించిన తరువాత అది ద్వీపంలో మొదటి కాలనీగా సెటిల్మెంటుగా గుర్తించబడింది.[5] ఫ్రెంచి సెటిలర్లు కాఫీ, పొగాకు, ఇండిగొ, ప్రత్తి , చెరకు పండించారు.[ఆధారం చూపాలి] తోటలలో ఆఫ్రికన్ బానిసలు పనిచేసారు.

బ్రిటిష్ కాలనీ - మొదటి విడత

Thumb
Colonial flag (to 1979)

ఏడు సంవత్సరాల యుద్ధం (1754-1763) కాలంలో " ట్రీటీ ఆఫ్ పారిస్ " ఒప్పందం తరువాత బ్రిటిష్ ఫ్రెంచి నుండి ద్వీపాన్ని ఫ్రెంచి నుండి స్వాధీనం చేసుకుంది.తరువాత బ్రిటిష్ , కరీబియన్ల మద్య తలెత్తిన సంఘర్షణల కారణంగా మొదటి కరీబియన్ యుద్ధం సంభవించింది. 1763లో బ్రిటిష్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంది.తరువాత బ్రిటిష్ " చార్లొట్టే కోట " కు పునాది వేసింది.

ఫ్రెంచి కాలనీ - రెండవ విడత

1779లో ఫ్రెంచి సెయింట్ విన్సెంట్ ద్వీపాన్ని ఫ్రెంచి తిరిగి స్వాధీనం చేసుకుంది. అయినప్పటికీ 1783లో " ట్రీటీ ఆఫ్ వర్సిల్లెస్ " ఒప్పందం అధారంగా బ్రిటిష్‌కు స్వాధీనం చేయబడింది.

బ్రిటిష్ కాలనీ - రెండవ విడత

1783 , 1796 మద్య కాలంలో బ్రిటిష్ , పారామౌంట్ చీఫ్ " జోసెఫ్ చార్టర్ " నాయక్త్వంలోని బ్లాక్ కరీబియన్ల మద్య తిరిగి సంఘర్షణలు చోటుచేసుకున్నాయి. 1795 , 1796 మద్య మార్టినిక్యూ లోని ఫ్రెంచి సైన్యం మద్దతుతో బ్లాక్ కరీబియన్లు బ్రిటిష్‌తో వరుసయుద్ధాలు కొనసాగించారు. చివరికి వారి తిరుగుబాటు అణిచివేయబడింది.సంఘర్షణల ఫలితంగా 5,000 మంది బ్లాక్ కరీబియన్లు బెక్వియా తీరంలో ఉన్న " బాలిసెయక్స్ " అనే అతిచిన్న ద్వీపానికి పారిపోయారు.1796 వరకు బ్రిటిష్ , బ్లాక్ కరీబియన్ల మద్య సంఘర్షణలు కొనసాగాయి. 1797లో బ్రిటిష్ జనరల్ " సర్ రాల్ఫ్ అబర్‌క్రోంబీ " బ్లాక్ కరీబియన్ల రెండవ తిరుగుబాటుకు ముగింపు తీసుకువచ్చాడు.రెండమారు తిరుగుబాటుకు ఫ్రెంచి తిరుగుబాటుదారుడు విక్టర్ హుగ్యూస్ నాయకత్వం వహించాడు. 1806లో చార్లొట్టె కోట నిర్మాణం పూర్తి అయింది.1812లో " లా సర్ఫియరే " అగ్నిపర్వతం బ్రద్ధలైంది.

1838లో పూర్తిస్థాయిలో బానిసత్వం నిషేధించబడే వరకు గతంలో ఫ్రెంచివారు చేసినట్లు బ్రిటిష్ కూడా ఆఫ్రికన్ బానిసలను చెరకు, కాఫీ, ఇండిగొ, పొగాకు, ప్రత్తి , కొకయా తోట్లలో ఉపయోగించుకుంది.తరువాత స్వతంత్రులైన బానిసలకు భూములను వదిలి భూస్వాములు ఎస్టేటులను వదిలి వెళ్ళిన తరువాత దేశంలో ఆర్ధికసంక్షోభం మొదలైంది.

సెయింట్ విన్సెంట్‌లో యునైటెడ్ కింగ్డం , బ్రిటిష్ కాలనీలో (1835) బానిసత్వం నిర్మూలించబడిన తరువాత ప్రారంభం అయిన అప్రెంటిస్‌షిప్ 1838లో ముగిసింది. తరువాత తోటలలో శ్రామికుల కొరత సమస్యగా మారింది. ఫలితంగా తోటలలో పనిచేయడానికి ఒప్పంద కూలీలు తూసుకుని రాబడ్డారు. 1840లో మాడ్రియా నుండి పోర్చుగీసు వలసప్రజలు వచ్చిచేరారు. 1861 , 1888 మద్య నౌకలలో ఆఫ్రికన్ కార్మికులు ద్వీపానికి చేరుకున్నారు. మునుపటి బానిసలు , వలస కూలీల మద్య గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రపంచ చక్కెర ధరలలో పతనం సంభవించిన కారణంగా ఆర్ధికసమస్యలు శతాబ్ధం చివరి వరకు కొనసాగాయి.

20వ , 21వ శతాబ్ధాలు

Thumb
Residents of Saint Vincent making casabe (casava bread) in the 1910s

1902లో లా సౌఫ్రియరె అగ్నిపర్వతం బ్రద్దలైన సంఘటనలో 2,000 మంది మరణించారు. ఈసంఘటనలో వ్యవసాయభూములు ధ్వంశం అయ్యాయి ఆర్ధికసంక్షోభం కొనసాగింది.1763 నుండి 1979 వరకు సెయింట్ విన్సెంట్ పలు స్థాయిలలో బ్రిటిష్ కాలనీ పాలన అనుభవించారు.1776లో ప్రతినిధుల అసెంబ్లీ రూపొందించబడి 1877లో క్రౌన్ కాలనీ ప్రభుత్వం స్థాపించబడింది.1925లో లెజిస్లేటివ్ అసెంబ్లీ రూపొందించబడింది. 1951లో ఓటుహక్కు మంజూరు చేయబడింది.

సెయింట్ విన్సెంట్ బ్రిటిష్ నియంత్రణలో ఉన్న సమయంలో పరిపాలనా సౌలభ్యం కొరకు బ్రిటిష్ పలుమార్లు ద్వీపాన్ని విండ్వర్డ్ ఐలాండ్స్‌తో అనుసంధానించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.1960లో బ్రిటిష్ నియంత్రణలో ఉన్న పలు ప్రాంతీయ ద్వీపాలతో ఏర్పాటు చేసిన " వెస్ట్ ఇండీస్ ఫెడరేషన్ "లో సెయింట్ విన్సెంట్ ద్వీపాన్ని అనుసంధానం చేయడానికి ప్రయత్నించబడింది. 1962లో ప్రయత్నం విఫలం అయింది.1969 అక్టోబర్ 27న గ్రేట్ బ్రిటన్ సెయింట్ విన్సెంట్‌కు " అసోసియేటెడ్ స్టేట్‌హుడ్ " మంజూరు చేసింది.తరువాత సెయింట్ విన్సెంట్‌కు తన అంతర్గతవ్యవహారాల మీద పూర్తిస్థాయి నియంత్రణ కలిగినప్పటికీ సంపూర్ణ స్వతంత్రం లభించలేదు.సెయింట్ విన్సెంట్‌కు " అసోసియేటెడ్ స్టేట్‌హుడ్ " లభించిన 10 సంవత్సరాల తరువాత సెయింట్ విన్సెంట్‌కు సంపూర్ణ స్వతంత్రం లభించింది.1979 ఏప్రిల్‌లో లా సౌఫ్రియరే అగ్నిపర్వతం తిరిగి బ్రద్దలైంది. అయినప్పటికీ ఎటువంటి మరణాలు సంభవించనప్పటికీ వేలాది మంది ప్రజలు నివాసప్రాంతాల నుండి తరలించబడ్డారు.తిరిగి వ్యవసాయ భూములు ధ్వంసం అయ్యాయి. 1980, 1987 సంభవించిన తుఫాను అరటి, కొబ్బరి తోటలను ధ్వంసం చేసింది.1998, 1999 తుఫానులు కూడా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాయి.1999 లో తుఫాను ద్వీపం పశ్చిమతీరంలో తీవ్రమైన విధ్వంసం సృష్టించింది.2009 నవంబరు 25న ఓటర్లు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా కొత్త రాజ్యాంగం రూపొందించమని కూరారు. కొత్త రాజ్యాంగం దేశాన్ని రెండవ ఎలిజబెత్ నాయకత్వం నుండి కొత్త అధ్యక్షుని నియమించాలని సూచించింది. ప్రజాభిప్రాయసేకరణ ద్వారా కొత్తరాజ్యాంగం రూపకల్పన ప్రయత్నం ఓటమి పొందింది. [6]

భౌగోళికం

Thumb
A map of Saint Vincent and the Grenadines.

సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ తూర్పుదిశలో బార్బడొస్, ఉత్తరంలో సెయింట్ లూసియా, దక్షిణంలో గ్రెనడా ఉన్నాయి.ఇది కరీబియన్ సంద్రంలో ఉన్న అర్ధవృత్త ద్వీపాలలోని లెస్సర్ అంటిల్లెస్‌లోని విండ్వర్డ్ ద్వీపాలలో భాగంగా ఉంది.సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ లోని 344 చ.కి.మీ. వైశాల్యం కలిగిన సెయింట్ విన్సెంట్, ద్వీపం దేశానికి ప్రధానభూభాగంగా భావించబడుతుంది.45చ.కి.మీ వైశాల్యం ఉన్న గ్రెనడిన్స్, చిన్నచిన్న ద్వీపాలతోకూడిన గ్రెనడైంస్ ద్వీపమాలిక దేశంలో భాగంగా ఉన్నాయి.మొత్తం 32 ద్వీపాలు, కేస్ దేశంలో భాగంగా ఉన్నాయి. వీటిలో ప్రధానభూభాగం విన్సెంట్, గ్రెనడైన్స్ ద్వీపాలతో (యంగ్ ద్వీపం, బెక్యుయా, ముస్టిక్యూ, కానౌయాన్, యూనియన ద్వీపం, మెరీయు, పెటిట్, సెయింట్ విన్సెంట్, పాల్మ్‌ ద్వీపం) కలిసి 9 దీవులు మానవనివాసితాలుగా ఉన్నాయి. సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ రాజధాని నగరం కింగ్‌స్టన్. ప్రధానభూభాగం సెయింట్ విన్సెంట్ ద్వీపం పొడవు 26కి.మీ., వెడల్పు 15కి.మీ, మొత్తం వైశాక్యం 344 చ.కి.మీ. గ్రెనడింస్ ద్వీపాల మొత్తం పొడవు 60కి.మీ. వైశాల్యం 45చ.కి.మీ. సెయింట్ విన్సెంట్ ద్వీపం అగ్నిపర్వత మయంగా ఉండి స్వల్పంగా భూభాగం ఉంటుంది.ద్వీపం విండ్వర్డ్ వైపు నిటారుగా శిలామయమై ఉంటుంది.లీవర్డ్ వైపు ఇసుక కలిగిన సముద్రతీరాలు ఉంటాయి.[ఆధారం చూపాలి] సెయింట్ విన్సెంట్‌లోని అత్యంత ఎత్తైన అగ్నిపర్వతశిఖరం ఎత్తు 1234 మీ.

ఆర్ధికం

Thumb
A proportional representation of St Vincent and the Grenadines' exports.

సెయింట్ విన్సెంట్ వ్యవసాయంలో అరటి ఆర్థికరంగం మీద అత్యంత ప్రభావం చూపుతుంది. సేవారంగంలో పర్యాటకం ప్రముఖపాత్ర వహిస్తుంది. కొత్త పరిశ్రమలు స్థాపించడంలో ప్రభుత్వం విఫలమౌతూ ఉంది.1991 గణాంకాల ఆధారంగా దేశంలో 19.8% ఉన్న నిరుద్యోగం [7] 2001 నాటికి 15% నికి చేరింది.[8] నిరంతరంగా ఒకే పంట మీద ఆధారపడి ఉండడం ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా మారింది.పలు సంవత్సరాలు ఉష్ణమండల తుఫానులు అరటితోటలను పడగొటట్టి దేశానికి తీవ్రనష్టం కలిగిస్తుంది.దేశంలో చిన్నతరహా తయారీ రంగం, ఫైనాంస్ రంగం ఉన్నాయి అయినప్పటికీ వాటి చట్టాలు, నిబంధనలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తుంది.[ఆధారం చూపాలి] అదనంగా స్థానిక " బెక్వియా " ఐ.డబల్యూ.సి. కోటా ఆధారంగా నాలుగు జాతుల హంబాక్ వేల్ వేటకు అనుమతి లభిస్తుంది.

పర్యాటకం

పర్యాటకరంగంలో అభివృద్ధిచేయడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. సమీపకాలంలో ఇక్కడ చిత్రీకరించబడిన " పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ " చలనచిత్రం ద్వీపం గురించి పర్యాటకులకు, పెట్టుబడిదారులకు మరింత అవగాహన కలగడానికి సహకరించింది. సమీపకాలంలో నిర్మాణరంగం, పర్యాటకరంగం అభివృద్ధిచేయడానికి శక్తివంతమైన ప్రయత్నాలు ఆరంభం అయ్యాయి.[9]

రవాణాసౌకర్యాలు

దేశంలో సరికొత్తగా " ఆర్గిలే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ " నిర్మించబడింది.[10] కొత్త సౌకర్యం 2017 ఫిబ్రవరి 14న ఆరంభం చేయడానికి ప్రణాళిక చేయబడింది. [11]

సాంకేతికం

2010లో సెయింట్ విన్సెంట్, 21,700 లాండ్ లైన్ టెలిఫోన్లు ఉన్నాయని అంచనావేయబడింది. లాండ్ ఫోన్ సిస్టం పూర్తిగా ఆటోమాటిక్ చేయబడింది. టెలిఫోన్ ద్వీపం అంతటా, మానవనివాసిత గ్రెనడైంస్ ద్వీపాలన్నింటికీ అందుబాటులో ఉంది.[8] 2002 గణాంకాల ఆధారంగా సెయింట్ విన్సెంట్‌లో 10,000 మొబైల్ ఫోనులు ఉన్నాయని అంచనా.[12] 2010 నాటికి మొబైల్ ఫోన్ల సంఖ్య 1,31,800 ఉంటుందని అంచనా.[8] సెయింట్ విన్సెంట్‌లో అనేకప్రాంతాలలో మొబైల్ ఫోన్ సర్వీసు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.సెయింట్ విన్సెంట్‌లో ఉన్న రెండు ఐ.ఎస్.పి.కేంద్రాలు సిల్యులర్ టెలిఫోన్, అంతర్జాల సేవలు అందిస్తున్నాయి.[13]

గణాంకాలు

2013 గణాంకాల ఆధారంగా జనసంఖ్య 1.03,220.[1] వీరిలో ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజలు 66%, మిశ్రిత వర్ణాలకు చెందిన ప్రజలు 19%, ఈస్టిండియన్లు 6%, యురేపియన్లు 4% (ప్రధానంగా పోర్చుగీసు ప్రజలు), ఐలాండ్ కరీబియన్లు 2%, ఇతరులు 3% ఉన్నారు.[1] విన్సెంట్ ప్రజలలో అత్యధికంగా ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు. వీరు తోటలలో పనిచేయడానికి ఈద్వీపానికి బానిసలుగా తీసుకుని రాబడ్డారు. వీరుగాక ద్వీపంలో పోర్చుగీసు ప్రజలు (మడియారా వాసులు), ఈస్టిండియన్లు (వీరిరువురు బానిసత్వం రద్దు చేయబడిన తరువాత ప్లాంటేషంస్‌లో పనిచేయడానికి ఒప్పంద కూలీలుగా బ్రిటిష్ వారి చేత తూసుకుని రాబడ్డారు). దేశంలో చైనీయుల సంఖ్య క్రమంగా అధికమౌతూ ఉంది.[ఆధారం చూపాలి]

భాషలు

సెయింట్ విన్సెంట్ అధికార భాష ఆంగ్లం. విన్సెంటియన్లు అధికంగా క్రియోల్ భాష మాట్లాడుతుంటారు.[14] విద్యాబోధన, ప్రభుత్వ కార్యాకలాపాలు, మతం, ఇతరవ్యవహారాలకు ఆగ్లం ఉపయోగించబడుతుంది.క్రియోల్ నివాసగృహాలలో, స్నేహితుల మద్య వాడుకలో ఉంది.[15]

మతం

2001 గణాంకాల ఆధారంగా సెయింట్ విన్సెంట్, గ్రెనడైంస్ ప్రజలలో 81.5% క్రైస్తవులు, ఇతర మతస్థులు 6.7%, నాస్థికులు, ఏమతానికి చెందని ప్రజలు 8.8% ఉన్నారు.[16] ప్రజలలో 17.8% ఆంగ్లికన్లు, 17.6% పెంటెకోస్టన్లు, మెథడిస్టులు 10.9%, సెవెంత్‌ డే అద్వెంచరిస్టులు 10.2%, బాప్టిస్టులు 10% ఉన్నారు. ఇతర క్రైస్తవులలో జెహోవాస్ విట్నెసెసులు 0.6%, రోమన్ కాథలిక్కులు 7.5%, ఎవాంజెలికన్లు 2.8%, చర్చి ఆఫ్ గాడ్ 2.5%, బ్రెతర్న్ క్రైస్తవులు 1.3%, సాల్వేషన్ ఆర్మీకి చెందిన వారు 0.3% ఉన్నారు.1991, 2001 మద్య ఆంగ్లికన్లు, బ్రెథరన్లు, మెథడిస్టులు, రోమన్ కాథలిక్కుల సంఖ్య క్షీణించింది. పెంటెకొస్టల్స్, సెంట్ డే అద్వెంచర్ల సంఖ్య అధికరించింది.క్రైస్త్వేతరుల సంఖ్య స్వల్పంగా ఉంది. వీరిలో రస్టఫరియన్లు (1.5%), హిందువులు, ముస్లిములు ఉన్నారు.

సంస్కృతి

Thumb
The island of Mustique in the Grenadines.

క్రీడలు

క్రికెట్, రగ్బీ ఫుట్‌బాల్, అసోసియేషన్ ఫుట్‌బాల్ క్రీడలు పురుషుల మద్య ఆదరణ కలిగి ఉంది. మహిళల మద్య నెట్‌బాల్ అత్యధిక ఆదరణ కలిగి ఉంది. బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్ క్రీడలు కూడా ద్వీపంలో అత్యధిక ఆదరణ కలిగి ఉన్నాయి.[17] దేశానికి చెందిన ఎన్.ఎల్.ఎల్. ప్రీమియర్ లీగ్ పలువురు క్రీడాకారులకు శిక్షణ ఇస్తుంది.మునుపటి నేషనల్ టీంకు కేప్టన్‌ ప్రఖ్యాత విన్సెంటియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు " ఎజ్రా హెండ్రిక్సన్ " పలు ప్రధాన లీగ్ సూకర్ క్లబ్బుల తరఫున యునైటెడ్ స్టేట్స్‌ ఫుట్‌బాల్ క్రీడలలో పాల్గొన్నాడు.ప్రస్తుతం ఎజ్రా హెండ్రిక్సన్ సియాటెల్లో సియాటెల్ సౌండర్స్ ఎఫ్.సి. శిక్షకుడుగా ఉన్నాడు.[18] దేశం రెగ్యులర్‌గా " కరీబియన్ బాస్కెట్‌బాల్ చాంపియన్ షిప్ " క్రీడలలో పాల్గొంటున్నది.వీటిలో పురుషుల బృందం, మహిళల బృందం కూడా పాల్గొంటున్నది.సెయింట్ విన్సెంట్ రగ్బీ ఫుట్‌బాల్ టీం ప్రపంచంలో 84వ స్థానంలో ఉంది.ఇతర క్రీడకారులు కూడా ప్రాంతీయస్థాయిలో క్రీడలలో పాల్గొంటున్నారు.

సంగీతం

సెయింట్ విన్సెంట్ సంగీతంలో బిగ్ డ్రం, కలిప్సొ, సొకా, చుట్నె, స్టీల్‌పాన్, రెగ్గీ మొదలైన సంగీత బాణీలు ప్రధానమైనవి.స్ట్రింగ్ బ్యాండ్ సంగీతం, గాడ్రిల్లే, బెలే సంగీతం, సంప్రదాయ స్టోరీటెల్లిగ్ బాణీలు ప్రజాదరణ కలిగి ఉన్నాయి. సెయింట్ విన్సెంట్ స్థానిక సంగీతకారులలో కెవిన్ లిటిల్ విజయవంతంగా కచేరీలు అందిస్తున్నాడు.2013 సెప్టెంబరు 19న ఆయన " కల్చరల్ అంబాసిడర్ ఫర్ ది ఐలాండ్ " సత్కరించబడ్డాడు.[19] సెయింట్ విన్సెంట్ జాతీయగీతం " సెయింట్ విన్సెంట్ లాండ్ సో బ్యూటిఫుల్ " 1979లో దేశానికి స్వతంత్రం లభించిన తరువాత జాతీయగీతంగా స్వీకరించబడింది.

మాధ్యమం

సెయింట్ విన్సెంట్‌లో ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ ఉంది.[20] వీటిలో 89.1 జెం రేడియో, 89.7 ఎన్.బి.సి. రేడియో, 88.9 అడోరేషన్ ఎఫ్.ఎం, 95.9, 105.7 ప్రైజ్ ఎఫ్.ఎం., 96.7 నైస్ రేడియో, 97.1 హాట్ 97,98.3 స్టార్ ఎఫ్.ఎం.,103.7 హిత్జ్,102.7 ఎజీ రేడియో, 104.3 ఎక్స్‌ట్రీం ఎఫ్.ఎం, 106.9 బూం ఎఫ్.ఎం ప్రధానమైనవి.క్రోనికల్స్ క్రిస్టియంస్ రేడియో వంటి ఇంటర్నెట్ రేడియో స్టేషన్లు ఉన్నాయి.[21] దేశంలో జెడ్.ఇ.జి- టివి (ఎస్.వి.జి. టి.వి) దూరదర్శన్ ప్రసారకేంద్రం ఉంది.[22]

వెలుపలి లింకులు

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.