సామాన్య శకం
ప్రస్తుతం వాడుకలో ఉన్న క్రీస్తు శకానికి ప్రత్యామ్నాయ నామం / From Wikipedia, the free encyclopedia
"క్రీస్తు శకం"కు నవీన రూపమే సామాన్య శకం. ఇంగ్లీషులో దీన్ని కామన్ ఎరా (Common Era) అని లేదా కరెంట్ ఎరా (Current Era) అనీ అంటారు. లాటిన్ భాషలో యానో డొమిని (Anno Domini -AD) ని కామన్ ఎరా (Common Era -CE) గాను, "క్రీస్తు పూర్వం" (Before Christ -BC) ను బిఫోర్ కామన్ ఎరా (Before Common Era -BCE) గానూ వాడుతున్నారు. వీటిని తెలుగులో సామాన్య శకం (సా.శ..), సామాన్య శక పూర్వం (సా.పూ. లేదా సా.శ..పూ.) గా వ్యవహరిస్తున్నారు. ఈ మార్పుకు, మతతటస్థత ప్రధాన కారణం. ఈ మార్పు, పేరులోనే తప్ప కాలగణనలో కాదు. ఉదాహరణకు క్రీ.పూ. 512, సా.శ..పూ. 512 గాను, సా.శ.. 1757, సా.శ.. 1757 గాను మారుతాయి.