సహాయం:నిర్వహణ మూసలను తీసెయ్యడం
From Wikipedia, the free encyclopedia
అనేక వికీపీడియా పేజీల్లో, వాటిలో ఉన్న సమస్యలను వివరించే నిర్వహణ మూసలు ఉంటాయి. "ఈ మూస సందేశాన్ని ఎలా, ఎప్పుడు తీసివేయాలో తెలుసుకోండి " అని చెప్పే నిర్వహణ మూసలోని లింక్‌ను క్లిక్ చేస్తే మీరు ఈ సహాయ పేజీకి వచ్చి ఉండవచ్చు.
![]() | ఈ పేజీ గురించి ఒక్క ముక్కలో: మీకు తగు కుశలత ఉంటే, నిర్వహణ మూసల్లో చూపిన సమస్యలను వెనకాడకుండా పరిష్కరించండి! వికీలో సమస్యలన్నిటినీ మీవంటి స్వచ్ఛంద సేవకులే పరిష్కరిస్తారు. మూస ఎత్తిచూపిన సమస్య గురించి మీకు అవగాహన ఉంటే, లేదా ఈ పేజీ లోని సమచారం ద్వారా తెలుసుకుని ఉంటే, ఆపై సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరిస్తే మీరు నిర్వహణ మూసను తీసివేయవచ్చు; దాన్ని ఆటోమాటిగ్గా తీసివేయము. |
నిర్వహణ మూసలను వికీ స్వచ్ఛంద సేవకులు చేరుస్తారు. తీసివేసేది కూడా వాళ్ళే. ఆ మూసలను పరిశీలించే, తొలగించే ప్రక్రియను ఈ సహాయ పేజీ వివరిస్తుంది.