సహాయం:చిన్న మార్పులు
From Wikipedia, the free encyclopedia
చిన్న మార్పు అనే చెక్ బాక్సులో టిక్కు పెట్టడం ద్వారా ప్రస్తుతపు కూర్పుకు, గత కూర్పుకు మధ్య ఏవో పైపై మార్పులు మాత్రమే ఉన్నాయని సూచిస్తున్నట్లు: టైపింగు తప్పుల సవరణలు, ఫార్మాటు మార్పులు, వ్యాస విషయం మారకుండా వాక్యం అమరికను మార్చడం లాంటివి. సదరు మార్పులను సమీక్షించనవసరం లేనివని, వాటిపై వివాదం రేగే అవకాశమే లేదని ఆ సభ్యుడు/సభ్యురాలు భావించినట్లు.
ఇతర రచయితల సమీక్ష అవసరమైన దిద్దుబాటు ఏదైనా పెద్ద మార్పే. వ్యాసపు అర్థాన్ని మార్చే మార్పు, అది ఎంత చిన్నదైనా సరే, పెద్ద మార్పే.
చిన్న పెద మార్పుల మధ్య ఉన్న అంతరం చాలా ప్రముఖమైనది. వికీపీడియనులు చిన్న మార్పులను పెద్దగా గమనించరు. కొందరు సభ్యులైతే చొఇన్న మార్పులను కనబడకుండా తమ అభిరుచులలో సెట్ చేసుకుంటారు. చిన్న మార్పు కాదేమోనని సందేహంగా అనిపిస్తే దాన్ని చిన్న మార్పుగా గుర్తించకండి.
లాగిన్ కాని సభ్యులు తమ దిద్దుబాట్లను చిన్న మార్పుగా గుర్తించలేరు.