సంస్థ (organization) ఒక సామాజిక వ్యవస్థ. మానవుల యొక్క వ్యక్తిగత సామర్ద్యాలు, జీవనకాలము, గమనవేగము పరిమితమైనవి, అపరిమితమైన, అనేక రకాల సామర్ద్యాలు అవసరమైన, ఏక కాలములో చేయవలసిన వ్యవహారాలను అవిచ్ఛన్నముగా కొనసాగించటానికి వ్యక్తులు సమూహాలుగా ఏర్పడి నడిపిస్తారు. ఇటువంటి సమూహాలను సంస్థలు అంటారు.
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఒక సంస్థ యొక్క ముఖ్య లక్షణాలు
- అది సమాజంలో ఏర్పడిన ఒక వ్యవస్థ (social arrangement)
- ఆ సంస్థకు కొన్ని ఉమ్మడి లక్ష్యాలు ఉంటాయి (collective goals). ఆ సంస్థ పనితీరు ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి.
- ఆ సంస్థకు దాని పరిసర వాతావరణం (సమాజం) తో కొన్ని హద్దులు ఉంటాయి. అంటే ఆ "సంస్థకు చెందినవి" అనబడే వ్యక్తులను లేదా వస్తువులను లేదా కార్యాలను గుర్తించడానికి వీలవుతుంది.
సామాజిక శాస్త్రాలలో అనేక విభాగాలలో సంస్థలను వేరు వేరు దృక్కోణాలలో అధ్యయనం చేస్తారు - ఉదాహరణకు సామాజిక శాస్త్రము (sociology), ఆర్ధిక శాస్త్రము (economics), రాజకీయ శాస్త్రము (political science), మానసిక శాస్త్రము (psychology), మేనేజిమెంటు (management), సంస్థలలో భావ వ్యక్తీకరణ (organizational communication) వంటివి. ప్రత్యేకంగా సంస్థల గురించి అధ్యయనం చేసే శాస్త్రాలుగా సంస్థల అధ్యయనము (en:organizational studies), సంస్థలలో ప్రవర్తన (en:organizational behavior) అనేవిగా చెప్పవచ్చును. వివిధ అధ్యయనాలలో సంస్థలను క్రింది ప్రమాణాలను బట్టి వర్గీకరించవచ్చును -
- పని విధానాన్ని బట్టి (Organization – process-related) - అవి ఎలా పని చేస్తాయి?
- లక్ష్యాలను బట్టి (Organization – functional) - వ్యాపారం, ప్రభుత్వం, సేవ, విద్య వంటివి.
- నిర్మాణాన్ని బట్టి (Organization – institutional) - అది కేంద్రీకృతమా? ప్రజాస్వామ్యమా? సమాజంలో దాని స్థానం ఏమిటి? వంటి విషయాలు (organization as an actual purposeful structure within a social context)
సంస్థలలో రకాలు
ప్రభుత్వరంగ సంస్థలు
ప్రైవేటురంగ సంస్థలు
బహుళజాతి సంస్థలు (MNC)
విద్యా సంస్థలు
సాంస్కృతిక సంస్థలు
- వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక
ఈ సంస్థ గత ఎనిమిదేళ్ళుగా 'నాటిక పోటీలు ' నిర్వహిస్తున్నది. దీని అధ్యక్షులు పందిళ్ళ శేఖర్ బాబు, కార్యదర్శి కాసిపేట తిరుమలయ్య. 2003వ సం.లో గుంటూరు కేంద్రంగా ప్రారంభింపబడ్డ ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళకారుల ఐక్యవేదిక కు వరంగల్ జిల్లా శాఖగా ఇది ఆవిర్భవించింది. డాక్టర్ భండారు ఉమామహేశ్వరరావు అధ్యక్షులుగా, శతపతి శ్యామలరావు కార్యదర్శిగా తొలి మూడేళ్ళూ ఎన్నో కార్యక్రమాలను రూపొందించారు. అందులో ముఖ్యమైనవి తెలంగాణాస్థాయి నాటిక పోటీలు, కళాకారుల క్రెడిట్ కార్పొరేషన్. 50 మంది సభ్యులుగా చేరిన ఈ కార్పొరేషన్ లాభాల్లోనుండి సగాన్ని నాటకరంగ అభ్యున్నతికి వినియోగిస్తారు. సంస్థ నిర్వహించే నాటిక పోటీలను, దాతలు, ప్రాయోజకులు అందించే ఆర్థిక సహకారంతో నిర్వహిస్తారు. విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ కళాసామ్రాట్ పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గౌరవ అధ్యక్షులుగా ఉన్న ఈ సంస్థకు, వనం లక్ష్మీకాంతరావు, బోయినపల్లి పురుషొత్తమరావు, డా. భండారు ఉమామహేశ్వరరావు వంటి అనుభవజ్ఞులు తమ సలహాలను, సూచనలను అందిస్తున్నారు. సోదరసభ్యులు యెలిగేటి సాంబయ్య, సి.హెచ్.ఎస్.ఎన్.మూర్తి, శతపతి శ్యామలరావు, వేముల ప్రభాకర్, జీ.వీ.బాబు, బి.శ్రీధరస్వామి, రామనరసిమ్హ స్వామి, రాగి వీరబ్రహ్మాచారి, మట్టెవాడ అజయ్, రంగరాజు బాలకిషన్, సామల లక్ష్మణ్, ఆకుతోట లక్ష్మణ్, కళా రాజేశ్వరరావు, ఎన్.ఎస్.ఆర్.మూర్తి, జి.రవీందర్, దేవర్రాజు రవీందర్ రావు, ఆకుల సదానందం, యం.వి.రామారావు తమ సహకారాన్ని అందిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.
ఆధ్యాత్మిక సంస్థలు
స్వచ్ఛంద సేవాసంస్థలు
ఇవి కూడా చూడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.