శతపది
From Wikipedia, the free encyclopedia
శతపాదులు (ఆంగ్లం Centipede) (from లాటిన్ prefix centi-, "నూరు", and గ్రీకు ποδός podos, "పాదం") ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జంతువులు. ఇవి మిరియాపోడా ఫైలమ్ లోని కీలోపోడా తరగతికి చెందినవి. వీటిని జెఱ్ఱి అని కూడా పిలుస్తారు.
త్వరిత వాస్తవాలు శతపాదులు కాల విస్తరణ: Silurian - Recent, శాస్త్రీయ వర్గీకరణ ...
శతపాదులు కాల విస్తరణ: Silurian - Recent | |
---|---|
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Subphylum: | మిరియాపోడా |
Class: | కీలోపోడా Latreille, 1817 |
Orders and Families | |
See text |
మూసివేయి
ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 జాతుల శతపాదులున్నట్లు అంచనా.[1] వీటిలో సుమారు 3,000 జాతులు మాత్రమే గుర్తించబడ్డాయి. ఇవి విస్తృతంగా ఆర్కిటిక్ ప్రాంతం నుండి ఉష్ణమండలం, ఎడారి వాతావరణంలోనూ నివసిస్తాయి.[2] వీటికి తేమ చాలా అవసరం. అందువలన ఇవి ఎక్కువగా భూమిలోపల, రాళ్ళక్రింద నివసిస్తాయి.
కొన్ని శతపాదులు మానవులకు హాని కలిగిస్తాయి. అయితే వీటికాటు వలన నొప్పి కలుగుతుంది. కొందరికి ఎలర్జీ వస్తుంది. సామాన్యంగా ప్రాణహాని ఉండదు.