వికీమీడియా ఫౌండేషన్
అమెరికన్ లాభాపేక్షరహిత స్వచ్ఛంద సంస్థ / From Wikipedia, the free encyclopedia
వికీమీడియా ఫౌండేషన్ అమెరికాలో స్థాపించబడిన లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. ఇది వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టుల పురోగతికి కృషిచేస్తుంది. ఇది 2005లో స్థాపించబడింది. విజ్ఞానాన్ని అందరికి అందుబాటులోకి తేవటానికి వివిధ దేశాలలో కల వికీపీడియా సంఘాలతో కలసిపనిచేస్తుంది. అంతేకాకుండా ప్రపంచంలోని కొన్ని దక్షిణాది దేశాలలో నేరుగా కార్యాలయాలను నెలకొల్పి ఉద్యోగులద్వారా వికీమీడియా ప్రాజెక్టుల త్వరిత పురోగతికి తోడ్పడుతుంది. భారతదేశంలో 2011 జనవరిలో పని ప్రారంభించింది. తరువాత నేరు పని విరమించి, సి.ఐ.ఎస్.(ప్రభుత్వేతర సంస్థ) ద్వారా కృషి కొనసాగిస్తున్నది.