వరాహమిహిరుడు
ప్రాచీన భారతీయ గణిత శాస్త్రవేత్త / From Wikipedia, the free encyclopedia
దైవజ్ఞ వరాహమిహిర Daivajna Varāhamihira (సంస్కృతం : वराहमिहिर; 505 – 587), లేదా వరాహమిహిరుడు, లేదా వరాహ, లేదా మిహిర. భారత ఖగోళ శాస్త్రజ్ఞుడు, గణిత శాస్త్రజ్ఞుడు,, జ్యోతిష్య శాస్త్రవేత్త. ఉజ్జయినిలో ఒక బ్రాహ్మణ వంశంలో జన్మించాడు. చంద్రగుప్త విక్రమాదిత్య ఆస్థానములోని నవరత్నాలలో ఒకడు. బృహత్సంహిత, బృహజ్జాతకము ఈయన రచనల్లో ముఖ్యమైనవి.