లోయ ఎత్తైన కొండల మధ్యన ఉండే లోతైన ప్రదేశము. బాగా లోతైన లోయను గండి (కాన్యన్ లేదా గోర్జీ) అంటారు. ఇవి ఎక్కువగా U లేదా V ఆకారంలో ఉంటాయి. చాలా వరకు లోయలు నదుల ప్రవాహం వలన గాని గ్లాసియర్ల మూలంగా ఏర్పడతాయి.
లోయ ఏర్పడిన విధానాన్ని బట్టి వీటిలో అనేక రకాలున్నాయి. వాటిలో కొన్ని:
నది ప్రవహించే లోయ
వెడల్పైన చదునైన లోయ. అందులో నది ప్రవహిస్తూంటుంది
కొండలు గుట్టల మధ్య ఉండే చిన్నపాటి లోయ
లోతైన, సన్నటి, చదునైన అడుగుతో ఉండే లోయ.
కోత వల్ల ఏర్పడే లోయ
భూగర్భంలో ఏర్పడే పరిమాణాల వల్ల ఏర్పడే లోయలు
పొడి లోయ - నీటి కోత వల్ల ఏర్పడని లోయలు
రెండూ సమాంతర పర్వత శ్రేణుల మధ్య ఏర్పడే పొడవాటి లోయ.