భారతీయ ఖడ్గమృగం (ఆంగ్లం Indian Rhinoceros) లేదా ఒంటి కొమ్ము ఖడ్గమృగం లేదా ఆసియా ఒంటికొమ్ము ఖడ్గమృగం, ఓ పెద్ద క్షీరదం, నేపాల్, భారత్ లోని అస్సాం యందు ఎక్కువగా కానవస్తుంది. హిమాలయాల పాదభాగాలలోని గడ్డిమైదానా లలోను, అడవులలోనూ కానవస్తుంది. భారత ఖడ్గమృగం గంటకు 25 మైళ్ళ వేగంతో పరుగెత్తగలదు. ఇది ఈతలో ప్రావీణ్యం గలది. దీని చూపు చాలా మందం.
భారతీయ ఖడ్గమృగం | |
---|---|
భారతీయ ఖడ్గమృగం (వరుసగా ఎడమనుండి కుడి : శిశువు (మగ), ఆడ మృగం, లేత దశ ఆడమృగం) | |
Conservation status | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | పెరిసోడాక్టిలా |
Family: | రైనోసెరాటిడే |
Genus: | |
Species: | ఆర్. యూనికార్నిస్ |
Binomial name | |
రైనోసెరాస్ యూనీకార్నిస్ | |
భారతీయ ఖడ్గమృగాల పరిధి |
ప్రాచీన శిలాజాల కాలపు జంతువులా కనబడే ఈ ఖడ్గమృగం, మందమైన 'వెండి రంగు చర్మాన్ని' గలిగి, వుంటుంది. దీని చర్మపు మడతలవద్ద చర్మం ఎర్రగావుంటుంది. మగజంతువుల మెడపై మందమైన చర్మపు మడతలుంటాయి, దీని శరీరంపై వెండ్రుకలు బహు స్వల్పం.[2]
బంధించి వుంచితే 40 యేండ్లు, స్వేచ్ఛగా వదిలేస్తే 47 యేండ్లు బ్రతుకుతాయి.[2]
వీటికి ప్రకృతిలో శత్రువులు చాలా తక్కువ. పులులు వీటి ప్రధాన శత్రువులు. ఇవి సమూహాలలో లేని దూడలను చంపివేస్తాయి. మానవులు రెండవ శత్రువుల కోవలోకి వస్తారు. మానవులు వీటిని చంపి వీటి శరీరభాగాలను అమ్ముకుంటారు.[2]
పరిధి
ఈ ఖడ్గమృగాలు, భారతదేశం, పాకిస్తాన్ నుండి బర్మా వరకు, బంగ్లాదేశ్, చైనా వరకు తిరుగుతూంటాయి. ఈశాన్యభారతం, నేపాల్ లో వీటి జనాభా ఉంది.
జనాభా , అపాయాలు
పందొమ్మిదో శతాబ్దపు ఆఖరులో, ఇరవయ్యో శతాబ్దపు ప్రారంభ దశలో, వీటిని వేటాడి చంపేవారు. ఆ కాలంలో అస్సాం లోని ఆఫీసర్లు, స్వతహాగా 200 మృగాలను వేటాడి చంపారని రికార్డులు చూపిస్తున్నాయి. 1910 లో వీటి వేట భారతదేశంలో నిషేధింపబడింది.[2]
1900 సం.లో కేవలం 100 మృగాలు మాత్రమే వుండగా, నేటికి వీటి జనాభా 2500 చేరింది. అయిననూ వీటి జనాభా అపాయస్థితిలోనే ఉంది. భారత్, నేపాల్ ప్రభుత్వాలు ప్రపంచ వన్యప్రాణుల ఫండ్ నుండి సహాయం పొంది, వీటిని కాపాడుతున్నాయి.
ఖడ్గమృగాల జనాభా వనరులు : here.
చిత్రమాలిక
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.