స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు From Wikipedia, the free encyclopedia
మోతీలాల్ నెహ్రూ (ఆంగ్లం: Motilal Nehru) (మే 6, 1861 – ఫిబ్రవరి 6, 1931). భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. ఇతను, బలీయమైన రాజకీయ కుటుంబ స్థాపకుడు.
మోతీలాల్ నెహ్రూ ఆగ్రాలో పుట్టాడు, తండ్రి 'గంగాధర్' ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబీకుడు.నెహ్రూ, ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాదు నుండి బారిష్టరు డిగ్రీను పొందాడు.భారత జాతీయ కాంగ్రస్ కు చెందిన మధ్యేయవాద, ధనిక నాయకుడు. మహాత్మా గాంధీ మార్గదర్శకత్వంలో జాతీయ రాజకీయాలలో ప్రవేశించాడు. మోతీలాల్, స్వరూప్ రాణీని వివాహమాడాడు.
క్రింది వారసులు భారత రాజకీయాలలో తమ ప్రభావాన్ని, ప్రాభవాన్నీ చూపారు:
లక్ష్మీ నారాయణ్ నెహ్రూ
గంగాధర్ నెహ్రూ (తండ్రి: లక్ష్మీనారాయణ్ నెహ్రూ, ఢిల్లీ కొత్వాల్)
మోతీలాల్ నెహ్రూ (తండ్రి: గంగాధర్ నెహ్రూ) కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు.
నందలాల్ నెహ్రూ (తండ్రి: గంగాధర్ నెహ్రూ) ఖేత్రీ రాజ్యపు దీవాన్.