![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/39/Irish_Goat.jpg/640px-Irish_Goat.jpg&w=640&q=50)
మేక
From Wikipedia, the free encyclopedia
మేక ఒక రకమైన జంతువు. ఈ మేకలు ఆసియా, ఐరోపా దేశపు కొండ మేకను పెంపుడు జంతువుగా మార్పుచెందినవి. ఇవి బొవిడే కుటుంబానికి చెందినవి, గొర్రె, జింక లకు సంబంధించిన కాప్రినే ఉపకుటుంబం లోనివి. ఇవి నెమరువేయు జంతువులు.
త్వరిత వాస్తవాలు మేక, Conservation status ...
మేక | |
---|---|
![]() | |
Conservation status | |
పెంపుడు జంతువు | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | ఆర్టియోడాక్టిలా |
Family: | బొవిడే |
Subfamily: | కాప్రినే |
Genus: | |
Species: | C. aegagrus |
Subspecies: | C. a. hircus |
Trinomial name | |
Capra aegagrus hircus (లిన్నేయస్, 1758) |
మూసివేయి
మేకలలో సుమారు 300 సంకర జాతులున్నాయి.[1]
మేకలు అతి పుతాతన కాలం నుండి మానవుడు పెంచుకుంటున్న జంతువులు. వేల సంవత్సరాల నుండి వీటిని పాలు, మాంసం, ఊలు, తోలు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగంలో ఉన్నాయి.[2] మేక మాంసాన్ని మటన్ అంటారు. నిక్కచ్చిగా చెప్పాలంటె chevon చెవన్ అని అంటారు.