రామకృష్ణ (చిత్రకారుడు)
From Wikipedia, the free encyclopedia
రామకృష్ణ తెలుగులో మనకున్న మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. ఇతని పూర్తి పేరు మునగపాటి శివరామకృష్ణ. ఇతడు తెలుగులోనే కాక, ఆంగ్లంలోకూడ కార్టూన్లు వేయటం జరిగింది. చిత్రకారుడు బాపు ప్రభావంతో వ్యంగ్య చిత్రరంగానికి ఆకర్షించబడిన మరొక మంచి చిత్రకారుడితను. భారత దేశంలోని అతి పెద్ద బ్యాంకులో మేనేజరు పదవిలో బాధ్యతలు నిర్వహిస్తూనే, కార్టూనిస్ట్‌గా పేరుతెచ్చుకోవటం ఇతని ఏకాగ్రత, కష్టపడే తత్వం తెలియచేస్తాయి.
త్వరిత వాస్తవాలు మునగపాటి శివ రామకృష్ణ, జననం ...
మునగపాటి శివ రామకృష్ణ | |
---|---|
![]() రామకృష్ణ | |
జననం | మునగపాటి శివ రామకృష్ణ 1946, జులై 11 ప్యాపర్రు గ్రామం, గుంటూరు జిల్లా |
మరణం | 2020 , డిశెంబరు 19 |
నివాస ప్రాంతం | హైదరాబాదు |
ఇతర పేర్లు | ఎమ్.ఎస్.రామకృష్ణ |
వృత్తి | బ్యాంకు మేనేజరు (రిటైర్డ్), చిత్రకారుడు |
పదవి పేరు | మానేజరు |
భార్య / భర్త | సుగుణ |
పిల్లలు | కుమార్తె జయంతి సునీత |
తండ్రి | మునగపాటి విశ్వనాధ శాస్త్రి |
తల్లి | మునగపాటి విశాలాక్షి |
మూసివేయి