మలాయిక
From Wikipedia, the free encyclopedia
మలాయిక ఇస్లాంలో దేవదూతలను మలాయిక అంటారు. (అరబ్బీ : 'మలక్' ఏకవచనము, మలాయిక బహువచనము). పర్షియన్ భాషలో 'ఫరిష్తే'. అల్లాహ్ వీరిని 'రశ్మి' లేక 'కాంతి' చే సృష్టించాడు. ఇస్లాంలో నమ్మకం ఉంచవలసిన విషయాలు : అల్లాహ్, అతని దూతలు, అతని గ్రంథాలు, అతని ప్రవక్తలు, ప్రళయదినం, అతనిచే వ్రాయబడ్డ విధి (మంచి గాని చెడు గాని) అల్లాహ్ చే ప్రసాదింపబడును. : ఖురాన్, సూరా 17. అల్-ఇస్రా పంక్తి 95. (ఇస్రా అనగా 'రాత్రిప్రయాణం' (షబ్ ఎ మేరాజ్), బనీ ఇస్రాయీల్)
- " వారితో చెప్పండి, ఒకవేళ మలాయిక భూమ్మీద స్థిరపడి ప్రశాంతముగా, నిశ్యబ్ధంగా ప్రయాణిస్తూ వుండివుంటే మేము (అల్లాహ్) వారి (మలాయిక) కొరకు ఒక మలక్ ను ప్రవక్తగా అవతరింపజేసివుండేవారము : ఖురాన్ : قُلْ لَوْ كَانَ فِي الأرْضِ مَلائِكَةٌ يَمْشُونَ مُطْمَئِنِّينَ لَنَزَّلْنَا عَلَيْهِمْ مِنَ السَّمَاءِ مَلَكًا رَسُولا 17:95