మన్నా డే (ఆంగ్లం: Manna Dey) ప్రముఖ నేపథ్య గాయకుడు. మన్నాడేకు 2007 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. 90 ఏళ్ల మన్నాడే భారత చలనచిత్ర రంగంలోనే అత్యంత ప్రతిభావంతుడైన గాయకుడిగా పేరు పొందారు. 1950 నుంచి 1970 వరకు హిందీ చలనచిత్ర రంగంలో దాదాపు 3,500 పాటలకు పైగా పాడారు. మన్నాడేగా ప్రసిద్ధుడైన ప్రబోధ్ చంద్ర డే 1919 మే 1న కోల్‌కతాలో జన్మించారు. 1942లో ముంబయి వచ్చిన ఆయన సచిన్‌దేవ్ బర్మన్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. తమన్నా (1942) సినిమాతో నేపథ్యగాయకుడిగా మారారు. అమర్‌ భూపాలి సినిమాతో గాయకుడిగా స్థిరపడ్డారు. అనంతరం షోలే, పడోసన్, మేరానామ్ జోకర్, బర్సాత్‌కీ ఏక్ రాత్, సఫర్, సాఖీ, జ్యోతి, అనిత, పతి పత్ని ఔర్ ఓ, వక్త్, ఉపకార్, బాబీ, ఆనంద్ తదితర అసంఖ్యాకమైన చిత్రాల్లో ఆయన హిట్ పాటలెన్నో పాడారు. మెలోడీ అంటే మన్నాడే అనే పేరు సంపాదించారు. ప్రత్యేకించి రాజ్‌ కపూర్ సినిమాల్లో ఆయన పాటలు లేకుండా ఉండేవి కాదు. బెంగాలీలోను పలు చిత్రాల్లో పాటలు పాడారు. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్‌లు గతంలోనే లభించగా ఇప్పుడు ఫాల్కే అవార్డుతో చలనచిత్ర రంగంలోను అత్యున్నత స్థాయి అవార్డు లభించినట్లయింది. ఆయన 2013 అక్టోబరు 24న మరణించారు.

త్వరిత వాస్తవాలు మన్నా డే, వ్యక్తిగత సమాచారం ...
మన్నా డే
Thumb
రవీంద్రభారతి విశ్వవిద్యాలయంలో డి.లిట్ డిగ్రీ తీసుకున్న తర్వాత (మే 2004)
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంప్రబోధ్ చంద్ర డే
ఇతర పేర్లుమన్నా డే
జననం(1919-05-01)1919 మే 1 [1]
కలకత్తా, బ్రిటిష్ ఇండియా
మరణం2013 అక్టోబరు 24(2013-10-24) (వయసు 94)
బెంగళూరు, భారతదేశం
సంగీత శైలినేపధ్య గాయకుడు
వృత్తిగాయకుడు
వాయిద్యాలువోకలిస్టు
క్రియాశీల కాలం19292013
బంధువులుకృష్ణ చంద్ర డే (మేనమామ)
మూసివేయి

మన్నా డేకు దక్కిన అవార్డులు

పద్మశ్రీపురస్కారం
  • 1. 1969 - జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుని అవార్డు ( మేరే హుజూర్‌ చిత్రానికి)
  • 2. 1971 - జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుని అవార్డు (బెంగాలీ చిత్రం.. నిషీ పద్మ)
  • 3. 1971 - భారత ప్రభుత్వం చేత పద్మశ్రీఅవార్డు
  • 4. 1985 - లతా మంగేష్కర్‌ అవార్డు
  • 5. 1988 - మైఖేల్‌ సాహిత్య పురస్కారం
  • 6. 2004 - కేరళ ప్రభుత్వం చేత జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుని అవార్డు
  • 7. 2005 - మహారాష్ర్ట ప్రభుత్వం చేత లైఫ్‌ టైం అచీవ్‌ మెంట్‌ అవార్డు
  • 8. 2005 - భారత ప్రభుత్వం చేత పద్మభూషణ్ అవార్డు

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.