భూకంపం
causes of earth quake / From Wikipedia, the free encyclopedia
EarthquakesTelugu
ఒక భూకపం / ఎర్త్ క్వేక్ (ట్రేమార్ లేక టెమ్బ్లార్) అనేది భూమి యొక్క పటలంలో అకస్మాత్తుగా విడుదలయ్యే శక్తి వలన ఉద్భవించు భూ ప్రకంపనాల ఫలితము. భూకంపాలను సీస్మోమీటర్తో కొలుస్తారు. దీనినే సీస్మోగ్రాఫ్ అని కూడా అంటారు. భూకంపము యొక్క తీవ్రతను తెలియచేయు సాంకేతికము , పురాతనమయిన రిక్టర్ తీవ్రతను కొలుచునపుడు తీవ్రత 3 అంతకన్నా తక్కువ అయినపుడు అది సాధారణముగా గోచరించదు, ఆ తీవ్రత 7 అయినపుడు అది పెద్ద విస్తీర్ణములలో ప్రమాదములకు కారణమగును. భూకంప తీవ్రతను మెర్కాల్లి స్కేల్ ద్వారా కొలుస్తారు.
భూకంపములు సంభవించినప్పుడు భూమి ఉపరితలం నందు ప్రకంపనలే కాకుండా కొన్ని సందర్భములలో భూమి విచ్ఛిన్నం అవుతుంది. ఒక పెద్ద భూప్రకంపనం యొక్క భూకంప కేంద్రం సముద్రము నందు సంభవించినపుడు సముద్ర గర్బము విచ్ఛిన్నమయినందు వలన సునామీ ఏర్పడును. భూకంపము వలన వచ్చు కదలికలు రాళ్ళు , మట్టి దొర్లిపడుటకు కారణమయి కొన్ని సందర్భాలలో అగ్నిపర్వతములాగా రూపాంతరము చెందును.
భూకంపము అంటే సహజంగా గమనించబడిన భుప్రకంనలు అయిన అయివుండవచ్చును లేక మనుషుల చేత సృష్టించబడిన కంపనాలు అయిన అయివుండవచ్చును. భుకంపనలకు కారణాలు అనేకము అవి రాళ్ళు బీటలువారడం వలన, అగ్నిపర్వత చర్యల వలన, పెద్ద పెద్ద బండలు జారి పడటం వలన, (మైన్లు) గనులను పేల్చడం వలన , న్యూక్లియర్ ప్రయోగాల వలన. భూకంపానికి కారణమైన మొదటి స్థానాన్ని ఫోకస్ లేదా హైపోసెంటర్ అంటారు. భూమి ఉపరితలమునకు దగ్గరగా జరిగిన విచిన్నాన్నే ఎపిసెంటర్ లేదా భూకంపకేంద్రము అంటారు .