బ్రిటిషు పాలన లేదా బ్రిటిషు రాజ్ భారత ఉపఖండంలో స్థూలంగా 1858 నుంచి 1947 వరకూ సాగిన బ్రిటిషు పరిపాలన. [1][2] ఈ పదాన్ని అర్థస్వతంత్ర కాలావధికి కూడా ఉపయోగించవచ్చు.[2][3] ఇండియాగా సాధారణంగా పిలిచే ఈ బ్రిటిషు పాలిత ప్రాంతంలో -బ్రిటిషర్లు నేరుగా పరిపాలించే ప్రాంతాలతో పాటుగా, వేర్వేరు రాజులు పరిపాలించే సంస్థానాలు కూడా కలిసి ఉన్నాయి- మొత్తంగా ఆ ప్రాంతమంతా బ్రిటిషు సార్వభౌమత్వం లేదా చక్రవర్తిత్వం కింద ఉన్నట్టు. ఈ ప్రాంతాన్ని కొందరు బ్రిటిషు ఇండియా అని కూడా వ్యవహరించేవారు.[4]
భారతీయ సామ్రాజ్యం Indian Empire | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1858–1947 | |||||||||||||
రాజధాని | కలకత్తా (1858–1911) క్రొత్త ఢిల్లీ (1911–1947) | ||||||||||||
సామాన్య భాషలు | |||||||||||||
మతం | హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం, జొరాస్ట్రియన్ మతం, జుడాయిజం | ||||||||||||
ప్రభుత్వం | British Colonial Government | ||||||||||||
Monarch of the United Kingdom and Emperor/Empressa | |||||||||||||
• 1858–1901 | విక్టోరియా | ||||||||||||
• 1901–1910 | ఎడ్వర్డ్ VII | ||||||||||||
• 1910–1936 | జార్జి V | ||||||||||||
• 1936 | ఎడ్వర్డ్ VIII | ||||||||||||
• 1936–1947 | జార్జి VI | ||||||||||||
Viceroyb | |||||||||||||
• 1858–1862 (first) | Charles Canning | ||||||||||||
• 1947 (last) | Louis Mountbatten | ||||||||||||
Secretary of State | |||||||||||||
• 1858–1859 (first) | Edward Stanley | ||||||||||||
• 1947 (last) | William Hare | ||||||||||||
శాసనవ్యవస్థ | Imperial Legislative Council | ||||||||||||
చరిత్ర | |||||||||||||
1757 మే 23 , 1857 మే 10 | |||||||||||||
• Government of India Act | మే 2 1858 | ||||||||||||
జులై 18 1947 | |||||||||||||
1947 మే 14 , 15 | |||||||||||||
ద్రవ్యం | భారతీయ రూపాయి | ||||||||||||
ISO 3166 code | IN | ||||||||||||
| |||||||||||||
|
విక్టోరియా రాణి కొరకు భారత సామ్రాజ్యాన్ని అధికారికంగా టోరీ ప్రధాని బెంజమిన్ డిస్రేలీ 1876 లో ఏర్పరచాడు. జర్మనీ, రష్యా పాలకులకు విక్టోరియా తీసిపోయినట్టు భావించకుండా ఉండేందుకు ఈ ఏర్పాటుచేశారు.[5] భారతదేశం బ్రిటిషు పాలనలో ఉండగానే నానాజాతిసమితి వ్యవస్థాపక సభ్యదేశం. 1900, 1920, 1928, 1932,1936 సంవత్సరాల్లో వేసవి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న దేశం. 1945లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఐక్యరాజ్యసమితిలో వ్యవస్థాపక సభ్యత్వం ఉన్న దేశం.[6]
పరిపాలన విధానం 1858 జూన్ 28లో బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ పాలన విక్టోరియా రాణి సింహాసనానికి మారినప్పుడు ఏర్పాటయింది. [7] (1876లో అదే విక్టోరియా రాణిని భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించారు), బ్రిటిషు ఇండియా సామ్రాజ్యం యూనియన్ ఆఫ్ ఇండియా (తర్వాతి కాలంలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా), డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్ (తదనంతర కాలంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, దానిలోని తూర్పుభాగం మరింత తర్వాతి కాలంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ అయింది), డొమినియన్ ఆఫ్ సిలోన్ (ప్రస్తుతం శ్రీలంక), సిక్కిం (ప్రస్తుతం భారతదేశంలో భాగం) గా ఐదు సార్వభౌమ రాజ్యాలుగా 1947లో విభాజితమయ్యే వరకు కొనసాగింది. 1858లో బ్రిటిషు రాజ్ ఆరంభమయ్యేనాటికే దిగువ బర్మా బ్రిటిషు పాలనలో భాగంగా ఉంది. 1886 లో ఎగువ బర్మా చేర్చారు. దాంతో బర్మాను 1937 వరకూ స్వయంపాలిత విభాగంగా నిర్వహించారు. తర్వాత అదొక ప్రత్యేక బ్రిటిషు కాలనీగా స్వాతంత్ర్యాన్ని పొందడం ప్రారంభమై చివరకు 1948లో బ్రిటిషు మయన్మార్ బర్మాగా రూపాంతరం చెందింది.
భౌగోళిక పరిధి
బ్రిటిషు రాజ్ గోవా, పాండిచ్చేరి వంటి కొద్ది మినహాయింపులతో దాదాపు నేటి భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతాలలో విస్తరించింది.[8] దీనికితోడు ఆడెన్ (1858 నుంచి 1937 వరకు), ఎగువ బర్మా (1886 నుంచి 1937 వరకు), బ్రిటిషు సోమాలీలాండ్ (1884 నుంచి 1898 వరకు), సింగపూర్ (1858 నుంచి 1867 వరకు) వేర్వేరు కాలాల్లో చేరాయి. 1937 నుంచి బర్మా భారతదేశం నుంచి విడివడి 1948లో స్వాతంత్ర్యం పొందేంతవరకూ నేరుగా బ్రిటిషు రాణి పాలన కిందకు వచ్చింది. పర్షియన్ గల్ఫ్‌కు చెందిన ట్రూషియల్ రాజ్యాలు సైద్ధాంతికంగా ప్రిన్స్ లీ స్టేట్స్, 1946 వరకూ ఇవి బ్రిటిషు ఇండియాలో భాగం, రూపాయిని వారి మారకద్రవ్యంగా (కరెన్సీ) వాడేవారు.[9] ఈ ప్రాంతానికి చెందిన ఇతర దేశాల్లో, సిలోన్ (ప్రస్తుతం శ్రీలంక) 1802లో అమైన్స్ ఒప్పందం ప్రకారం బ్రిటన్ పాలన కిందికి వచ్చింది.1793 నుంచి 1798 వరకు సిలోన్ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగం.[10] నేపాల్, భూటాన్ రాజ్యాలు, బ్రిటిషు వారితో యుద్ధాలు చేసి, తదనంతరం వారితో ఒప్పందాలు సంతకం చేసి, బ్రిటిషు వారి నుంచి స్వతంత్ర రాజ్యాలుగా గుర్తింపు పొందాయి.[11][12] 1861 లో జరిగిన ఆంగ్లో సిక్కిమీస్ ఒప్పందం అనంతరం సిక్కిం రాజ్యానికి ప్రిన్స్ లీ స్టేట్ హోదా దక్కింది, అయితే సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం నిర్ధారించకుండా విడిపెట్టారు.[13] మాల్దీవులు 1887 నుంచి 1965 వరకూ బ్రిటిషు సంరక్షిత ప్రాంతంగా ఉంటూవచ్చినా బ్రిటిషు ఇండియాలో భాగం కాలేదు.
ఆర్థిక పరిధి
1780లో కన్సర్వేటివ్ వర్గానికి చెందిన బ్రిటిషు రాజకీయవేత్త ఎడ్మండ్ బర్క్ భారతదేశం స్థితిని గురించిన అంశాన్ని ముందుకుతెచ్చారు, వారన్ హేస్టింగ్స్, ఇతర ఉన్నతాధికారులు భారతీయ సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థని నాశనం చేశారంటూ తీవ్రంగా ఈస్టిండియా కంపెనీపై దాడిచేశారు. భారతీయ చరిత్రకారుడు రాజత్ కాంత రాయ్ (1998) ఈ దాడిని కొనసాగిస్తూ, 18వ శతాబ్దంలో బ్రిటిషర్లు తీసుకువచ్చిన కొత్త ఆర్థికవ్యవస్థ దోపిడీ అనీ, సంప్రదాయ మొఘల్ సామ్రాజ్య ఆర్థిక వ్యవస్థకు మహా విపత్తు అనీ పేర్కొన్నారు.[14] బ్రిటిషు పాలన ప్రారంభమయ్యాకా ధనం, ఆహారాల నిల్వలు తరిగిపోవడం, అత్యంత తీవ్రస్థాయిలో పన్నులు విధించడాన్ని విమర్శిస్తూ, తుదకు బెంగాల్‌లో మూడోవంతు జనం మరణించడానికి కారణమైన 1770లో వచ్చిన దారుణమైన బెంగాల్ కరువుకు దారితీశాయని రాయ్ ప్రతిపాదించారు.[15] ఇటీవలి పరిశోధనల్లో ఈ విషయాన్ని పునర్వ్యాఖ్యానిస్తూ పి.జె.మార్షల్ మునుపటి సంపన్న, నిరపాయకరమైన మొఘల్ పాలన పేదరికం, అరాచకత్వాలకు దారితీసిందని చూపారు.[16]
ఆయన బ్రిటిషు స్వాధీనం భారతదేశపు గతంతో గొప్ప తేడా ఏమీ తెచ్చిపెట్టలేదని, ప్రాంతీయ మొఘల్ పాలకులకు పెద్దస్థాయిలో అధికారాన్ని కట్టబెట్టి సాధారణంగా సంపన్నమైన ఆర్థిక వ్యవస్థను మిగతా 18 వ శతాబ్దమంతా కొనసాగిస్తూ వచ్చిందన్నది ఆయన వాదన. బ్రిటిషు వారు భారతీయ బాంకర్లతో భాగస్వామ్యం చేసుకుని, పన్నువసూలు చేసుకునే స్థానిక నిర్వాహకులతోనే ఆదాయం పెంచుకున్నారని, వారు పాత మొఘల్ కాలపు పన్ను రేటునే కొనసాగించారని మార్షల్ పేర్కొన్నారు. చాలామంది చరిత్రకారులు ఈస్టిండియా కంపెనీ ఈస్టిండియా కంపెనీ పాలన భారతీయ రైతుల పంటలో మూడోవంతు తీసుకునే అత్యంత భారమైన పన్నుల విధానాన్ని కొనసాగించిందన్నది అంగీకరిస్తారు.[16]
బ్రిటిషు ఇండియా , రాచరిక రాష్ట్రం
బ్రిటిషు రాజ్ నాటి భారతదేశం రెండు రకాల భూభాగాలతో కూడివుండేది: బ్రిటిషు ఇండియా, స్థానిక రాజ్యాలు (లేదా ప్రిన్స్ లీ స్టేట్స్).[17] దానిని వ్యాఖ్యానించే 1889 నాటి చట్టంలో బ్రిటిషు పార్లమెంటి కింది నిర్వచనాలను స్వీకరించింది:
- "బ్రిటిషు ఇండియా" అనే పదానికి అర్థం రాణి గారి రాజ్యంలో భారతదేశపు గవర్నర్ జనరల్ లేదా అతని కింది అధికారి ద్వారా పరిపాలింపబడే ప్రాంతాలు, ప్రదేశాలు.
- ఇండియా అనే పదానికి అర్థం స్థానిక ప్రభువు లేదా నాయకుని అధీనంలో వుండి రాణి గారి పాలనను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా అతని కింది అధికారి ద్వారా పరిపాలింపబడే ప్రాంతాలు ప్రదేశాలు.[18]
సాధారణంగా, బ్రిటిషు ఇండియా అనే పదం బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ పాలనలో 1600 నుంచి 1858 వరకూ కొనసాగిన ప్రాంతాలను కూడా సూచించేందుకు వాడుతుంటారు (వాడుచున్నారు).[19] భారతదేశంలో బ్రిటిషర్లు (వారి పాలన) అన్నదాన్ని సూచించేందుకు సాధారణంగా ఆ పదం వాడుకలో వుంది.[20]
"బ్రిటిషు ఎంపైర్" (భారతీయ సామ్రాజ్యం) "ఎంపైర్ ఆఫ్ ఇండియా" (భారతీయ సామ్రాజ్ఞి) అన్న పదబంధాలు చట్టాల్లో ఉపయోగించలేదు. పరిపాలకులను ఎంప్రెస్/ఎంపరర్ ఆఫ్ ఇండియా (భారతీయ సామ్రాట్టు లేదా సామ్రాజ్ఞి) అంటూ సంబోధించేవారు, ఈ పదబంధం తరచు విక్టోరియా రాణి రాణీ ప్రసంగాల్లోనూ, పార్లమెంట్ ముగింపు ప్రసంగాల్లోనూ వాడబడింది. బ్రిటిషు ఇండియా ప్రభుత్వం జారీచేసిన పాస్ పోర్టుల కవర్ పైన "ఇండియన్ ఎంపైర్" అని, లోపల "ఎంపైర్ ఆఫ్ ఇండియా" అనీ వుండేది.[21] దీనికితోడు 1878లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆర్డర్ ఆఫ్ ఇండియా అన్న నైట్ హుడ్ ఏర్పాటుచేశారు. వైశ్రాయ్ కింద బ్రిటిషు ఇండియా కేంద్ర ప్రభుత్వం 175 అర్థస్వతంత్ర రాజ్యాలపై, అందునా కొన్ని పెద్ద, ముఖ్యమైన రాజ్యాలపై, విదేశీపాలన నెరపేవారు; మిగిలిన దాదాపు 500 రాజ్యాలు గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్, లేదా ఛీఫ్ కమీషనర్ పాలనలోని ప్రొవెన్షియల్ ప్రభుత్వాల పాలనలో ఉండేవి.[22] అధినివేశ, విదేశీపాలిత రాజ్యాల నడుమ స్పష్టమైన భేదాన్ని నిర్వచించగల అధికారపరిధి న్యాయస్థానాలకు ఉండేది: బ్రిటిషు ఇండియా చట్టాలు బ్రిటిషు పార్లమెంటులో ఆమోదం పొందేవి, వాటి శాసనాధికారాలు కేంద్ర, స్థానిక ప్రభుత్వాలతో కలిపి వేర్వేరు బ్రిటిషు ఇండియా ప్రభుత్వాల చేతిలో వుండేవి. దీనికి భిన్నంగా స్థానిక రాజ్యాలలో న్యాయస్థానాలు అక్కడి పాలకుల అధికారం కింద పనిచేసేవి.[22]
ప్రధానమైన ప్రావిన్సులు
20వ శతాబ్ది నాటికి, బ్రిటిషు ఇండియా లెఫ్టినెంట్ గవర్నర్ కానీ, గవర్నర్ కానీ పరిపాలించే ఎనిమిది ప్రావిన్సులతో కూడివుండేది.[22]
(ప్రస్తుత) | మొత్తం విస్తీర్నం చ.మైళ్లు, చ. కి. మీటర్లలో | 1901 లో జనాభా మిలియన్లలో | ముఖ్య పాలనాధికారి |
---|---|---|---|
అస్సాం (అస్సాం) |
130,000 (50,000) |
6 | |
బెంగాల్ (బంగ్లాదేశ్, వెస్ట్ బంగా, బీహార్, ఝార్ఖండ్, ఒడిశా) |
390,000 (150,000) |
75 | లెఫ్టినెంట్ గవర్నర్ |
బాంబే (సింధ్, మహారాష్ట్ర, గుజరాత్ లోని భాగాలు, కర్ణాటక) |
320,000 (120,000) |
19 | గవర్నర్ ఇన్ కౌన్సిల్ |
బర్మా (బర్మా) |
440,000 (170,000) |
9 | లెఫ్టినెంట్ గవర్నర్ |
సెంట్రల్ ప్రావిన్సెస్ (మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్) |
270,000 (100,000) |
13 | ఛీఫ్ కమిషనర్ |
మద్రాస్ (తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకలోని కొన్ని భాగాలు) |
370,000 (140,000) |
38 | |
పంజాబ్ (పంజాబ్ ప్రావిన్స్, ఇస్లామాబాద్ కేపిటల్ టెరిటరీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఛంఢీగఢ్, నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ) |
250,000 (97,000) |
20 | లెఫ్టినెంట్ గవర్నర్ |
యునైటెడ్ ప్రావిన్స్ (ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్) |
280,000 (110,000) |
48 | లెఫ్టినెంట్ గవర్నర్ |
బెంగాల్ విభజన కాలంలో (1905–1913 ) అస్సాం, ఈస్ట్ బెంగాల్ అనే కొత్త ప్రావిన్సులు లెఫ్టినెంట్ గవర్నర్ షిప్ కింద ఏర్పాటయ్యాయి. 1911లో ఈస్ట్ బెంగాల్ తిరిగి బెంగాల్ తో తిరిగి ఏకమయ్యాకా, తూర్పున కొత్త ప్రావిన్సులు అస్సాం, బెంగాల్, బీహార్, ఒరిస్సాగా మారాయి.[22]
చిన్న ప్రావిన్సులు
వీటికి తోడు, ఛీఫ్ కమీషనర్ పరిపాలన కిందవుండే చిన్న ప్రావిన్సులు ఉన్నాయి:[22] ఎ బ్రి ఎక్స్ అఫీషియో ఛీఫ్ కమిషనర్
మైనర్ ప్రావెన్సెస్ బ్రిటిష్ ఇండియా ( ప్రస్తుత కేంద్రపాలిత భూభాగాలు) |
వైశాల్యం చదరపు కిలో మీటర్లలో | 1901 లో జనాభా వేలల్లో | ముఖ్య పాలనాధికారి |
---|---|---|---|
అజ్మీర్-మేర్వారా (రాజస్థాన్లో కొన్ని భాగాలు) |
7,000 (2,700) |
477 | |
అండమాన్, నికోబార్ దీవులు (అండమాన్ నికోబార్ దీవులు) |
78,000 (30,000) |
25 | చీఫ్ కమీషనర్ |
బ్రిటిషు బెలూచిస్తాన్ (బెలూచిస్తాన్) |
120,000 (46,000) |
308 | శ్రీక్ Chief Commissioner |
కూర్గ్ (కొడగు జిల్లా) |
4,100 (1,600) |
181 | ఎక్స్ అఫీషియో ఛీఫ్ కమిషనర్ |
నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ (ఖైబర్ పఖ్తూన్ఖ్వా) |
41,000 (16,000) |
2,125 | ఛీఫ్ కమిషనర్ |
రాచరిక రాష్ట్రం
ప్రిన్స్ లీ స్టేట్ నే స్థానిక రాజ్యం, లేదా భారతీయ రాజ్యం అని కూడా అంటూంటారు. అది నామమాత్ర సార్వభౌమత్వాన్ని కలిగి భారతీయ మూలాలున్న పరిపాలకుడు వుండి బ్రిటిషు ప్రభుత్వంతో అనుబంధ కూటమి కలిగిన ప్రాంతం.[23] 1947 ఆగస్టులో బ్రిటన్ నుంచి భారతదేశం, పాకిస్థాన్లకు స్వాతంత్ర్యం వచ్చేనాటికి దాదాపుగా 565 స్థానిక రాజ్యాలు ఉన్నాయి. స్థానిక రాజ్యాల్లో, నేరుగా బ్రిటిషు పాలన లేనందున అవి బ్రిటిషు ఇండియాలో భాగం కాదు. పెద్ద రాజ్యాలకు బ్రిటన్ తో రాజులకు కలిగే హక్కులను గుర్తిస్తూ ఒప్పందాలు ఉన్నాయి; చిన్న రాజ్యాల్లో రాజులకు కేవలం కొద్దిపాటి హక్కులే వుండేవి. స్థానిక రాజ్యాల నడుమ విదేశీ వ్యవహారాలు, రక్షణ, ప్రధానమైన రవాణా, సమాచార ప్రసారం వంటివి బ్రిటిషు అధీనంలో ఉండేవి.[24] బ్రిటిషర్లు రాజ్యాల్లోని అంతర్గత రాజకీయాలపై కూడా సాధారణ ప్రభావం చూపించేవారు, వివిధ పాలకులకు గుర్తింపునివ్వడం లేదా ఇవ్వకపోవడం ద్వారా సాధించేవారు. 600 స్థానిక రాజ్యాలున్నా అత్యధికం చాలా చిన్నవి, ప్రభుత్వ పాలన వ్యవహారాలను బ్రిటిషర్లకే కాంట్రాక్టుగా ఇచ్చేసేవి. 25 చ. కి. (10 చ. మైళ్ళు) మించిన విస్తీర్ణంలోనివి కేవలం 200 రాజ్యాలే వుండేవి.[23]
నిర్వహణ
1857 భారత ప్రథమ స్వాతంత్ర్య పోరాటం (బ్రిటిషర్లు దీన్నే సిపాయిల తిరుగుబాటు లేదా పితూరీగా వ్యవహరిస్తూంటారు) అనంతరం, భారత ప్రభుత్వ చట్టం 1858 ద్వారా భారత ప్రభుత్వంలో మూడు స్తరాల్లో మార్పు చేశారు:
- లండన్లో అత్యున్నతాధికారం కలిగిన ప్రభుత్వం,
- కలకత్తాలో కేంద్ర ప్రభుత్వం,,
- ప్రెసిడెన్సీల్లో ప్రొవిన్షియల్ ప్రభుత్వాలు (తర్వాతికాలంలో ప్రావిన్సులు).[25]
లండన్లో, భారతదేశంలో కనీసం పదేళ్ళు ఇటీవలి పదేళ్ళ క్రితమే గడిపిన ఉన్నతాధికారులు, రాజకీయనాయకులతో కూడిన 15మంది సభ్యుల కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేబినెట్ హోదా కలిగిన భారత రాజ్యకార్యదర్శి ఉండేవారు.[26] సెక్రటరీ ఆఫ్ స్టేట్ భారతదేశానికి పంపవలసిన పాలసీ సూచనలను తయారు చేసినా, అనేక సందర్భాల్లో, ముఖ్యంగా భారతీయ ఆదాయాన్ని ఖర్చుచేసే విషయాలపై, కౌన్సిల్ సలహా తీసుకోవాల్సివుండేది. ఈ చట్టం ద్వంద్వ ప్రభుత్వం అనే పద్ధతిని తయారుచేసింది, తద్వారా కౌన్సిల్ అటు ఇంపీరియల్ పాలసీల మితిపైన తనిఖీదారుగానూ, భారతదేశంపైన ఎప్పటికప్పటి కొత్త అంశాలపైన నిపుణత కల నిర్మాణంగానూ పనికివస్తుంది. ఏదేమైనా, స్టేట్ సెక్రటరీకి ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన అత్యవసరాధికారాలు కూడా వుండేవి, వాస్తవ స్థితిలో కౌన్సిల్ నైపుణ్యం పాతగా, అప్పటి అవసరాలకు పనికిరానిదిగా వుండేది.[27] 1858 నుంచి 1947 వరకూ, 27మంది వ్యక్తులు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పనిచేసి భారతీయ కార్యకలాపాలను మార్గదర్శనం చేశారు; వారిలో: సర్ ఛార్లెస్ వుడ్ (1859–1866), మార్క్వెజ్ ఆఫ్ సాలిస్బరీ (1874–1878; తర్వాతి కాలంలో బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు), జాన్ మార్లే (1905–1910; మింటో-మార్లే సంస్కరణలకు ఆద్యుడు), ఇ.ఎస్. మోంటెగూ (1917–1922; మాంటెగూ-ఛేంస్ ఫర్డ్ సంస్కరణల రూపశిల్పి),, ఫ్రెడ్రిక్ పి.లారెన్స్ (1945–1947; 1946లోని భారతీయ కేబినెట్ మిషన్ కి నేతృత్వం వహించారు) ఉన్నారు. బ్రిటిషు పాలనలోని రెండవ అర్థశతాబ్దానికి సలహామండలి (కౌన్సిల్) పరిమాణం తగ్గినా, వారిఅధికారంలో మాత్రం మార్పురాలేదు. 1907లో, మొట్టమొదటిసారి ఇద్దరు భారతీయులను కౌన్సిల్లో నియమితులయ్యారు.[28] వారు కె.జి.గుప్తా, సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి.
ఇవి కూడా చూడండి
Notes and references
వెలుపలి లంకెలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.