బెర్నార్డ్ హిల్
From Wikipedia, the free encyclopedia
బెర్నార్డ్ హిల్ (ఆంగ్లం: Bernard Hill; 1944 డిసెంబరు 17 - 2024 మే 5) ఒక ఆంగ్ల నటుడు. ఆయన ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫిల్మ్ ట్రైలజీలో థియోడెన్, కింగ్ ఆఫ్ రోహన్, టైటానిక్ (1997)లో కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్, క్లింట్ ఈస్ట్‌వుడ్ చిత్రం ట్రూ క్రైమ్‌లో శాన్ క్వెంటిన్ జైలు వార్డెన్ లూథర్ ప్లంకిట్ పాత్రలకు పేరుగాంచాడు. 1980లలో అలాన్ బ్లీస్‌డేల్ రూపొందించిన బాయ్స్ ఫ్రమ్ ది బ్లాక్స్టఫ్లో జీవితం ఛిన్నాభిన్నం అవుతున్న సమస్యల్లో ఉన్న "హార్డ్ మ్యాన్" యోసెర్ హ్యూస్‌తో సహా టెలివిజన్ నాటకాలలో పాత్రలు పోషించడంలో ఆయన ప్రసిద్ది చెందాడు. ఆయన బిబిసి టూలో ప్రసారమైన హిల్లరీ మాంటెల్ వోల్ఫ్ హాల్ (Wolf Hall)లో డ్యూక్ ఆఫ్ నార్ఫోక్ పాత్రలో నటించాడు.
త్వరిత వాస్తవాలు బెర్నార్డ్ హిల్, జననం ...
బెర్నార్డ్ హిల్ | |
---|---|
జననం | (1944-12-17)1944 డిసెంబరు 17 బ్లాక్లీ, మాంచెస్టర్, ఇంగ్లాండ్ |
మరణం | 2024 మే 5(2024-05-05) (వయసు 79) |
విద్య | జావేరియన్ కళాశాల |
విద్యాసంస్థ | మాంచెస్టర్ పాలిటెక్నిక్ స్కూల్ ఆఫ్ డ్రామా |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1970–2024 |
జీవిత భాగస్వామి | మరియాన్నా హిల్ (విడాకులు తీసుకున్నారు) |
పిల్లలు | 1 |
మూసివేయి