భూగర్భ జలాలను తోడుకోవడానికి తవ్విన నిర్మాణం From Wikipedia, the free encyclopedia
బావులు లేదా నూతులు (Wells) కొన్ని ప్రాంతాలలో మంచినీటి అవసరాల కోసం తయారుచేసుకున్న కట్టడాలు.
ఊట బావి: ఈ బావులలో ప్రకృతి సిద్దంగా నీరు ఊరుతుంది. అందువల్ల ఇవి వేసవి కాలంలో కూడా ఎండిపోవు.
దిగుడు బావి: ఈ బావులు భూమి ఉపరితలంలో కలిసిపోయి ఉంటాయి. అంటే వీనికి గట్లు ఉండవు. అందువల్ల వీనిలో పశువులు, చిన్న పిల్లలు పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కొన్నింటిలోనికి దిగడానికి మెట్లు ఉంటాయి.
గొట్టపు బావి: ఈ బావులు యంత్రాల సహాయంతో చాలా లోతు వరకు తవ్వించే అవకాశం ఉన్నాయి. ఇవి భూగర్భ జాలాలలోని క్రింది పొరల లోనికి వేసి నీరును మోటారు పంపు ద్వారా బయటకు తెస్తారు. పెద్ద పట్టణాలలోని ఎక్కువ మంది ఇండ్లలో ఈ రకం బావులు ఉంటున్నాయి. ఆధునిక వ్యవసాయంలో కూడా ఇవి ఎక్కువగా తవ్విస్తున్నారు.
గిలక బావి: ఈ బావులు గట్టుతో ఉండి సురక్షితమైనవి. చేదతో నీరు తోడుకోవడానికి మధ్యలో బావిగిలక నిర్మించబడి ఉంటుంది.