రెసిస్టెన్సు బట్ వెల్డింగు విధానంలో ఎక్కువగా తీగెల (wires) అంచులను అతుకుటకు ఉపయోగిస్తుంటారు సాధారణంగా రాగి, అల్యూమినియం తీగెలను తయారు చేయు పరిశ్రమలలో, తీగెలను తయారుచేయున్నప్పుడు తెగిన తీగెయొక్క రెండు అంచులను అతికెదరు.తక్కువ మందమున్న ఉక్కు, నికెల్ మరియుమిశ్రమ లోహ తీగెలను అతికెదరు.ఈ వెల్డింగు విధానంలో కూడా లోహంల విద్యుత్తు ప్రవాహ నిరోధక గుణాన్నిఉపయోగించుకొని, వత్తిడిని అతుకు సమయంలో ప్రయోగించి తీగెలను/తంత్రులను అతికెదరు.[1]

Thumb

రెసిస్టెన్సు బట్ వెల్డింగును అఫ్‌సెట్ (upset) వెల్డింగు అనికూడా అంటారు.ఈ వెల్డింగు విధానం కూడా ఒకరకమైన స్పాట్ వెల్డింగు (చుక్క వెల్డింగు) వంటిదే.ఇందులో కూడా ఒక తీగఒక అంచు/చివర స్థిరంగా బంధింపబడివుండగా, రెండవ చివర ముందుకు వెనుకకు కదలును.స్పాట్ వెల్డింగు పద్ధతిలో విద్యుత్తుప్రవాహాన్ని ప్రవహింప చేయుటకు ప్రత్యేకంగా స్థిరంగా వున్న, కదిలే టంగ్‌స్టన్ ఎలక్ట్రోడులు వుండగా, బట్ వెల్డింగులో అతుకబడే తీగలే ఎలక్ట్రోడులుగా పనిచేయును.

బట్ లేదా అప్‌సెట్ వెల్డింగులో తీగెల రెండు అంచులవద్ద లోహం కరగి ఒకదానితో ఒకటి సమ్మేళనం చెంది అతుకుకొనుటకు, విద్యుత్తును ప్రవహింపచేసి, లోహంల విద్యుత్తు నిరోధకతత్వం వలన వేడి/ఉష్ణం ఏర్పరచి, వత్తిడి సహాయంతో లోహంలను అతికించడం జరుగుతుంది.[2]

వెల్డింగు యంత్రం

వెల్డింగు యంత్రం లేదా పరికరం దాని పై పనిచేయు కార్మికుడు నిల్చోని లేదా ఎత్తైన స్టూల్ మీద/పీట మీద కూర్చోని సునాయాసంగా పనిచేయుటకు అనుకూలంమైన ఎత్తులో అమర్చబడివుండును.యంత్రానికి రెండు దవడల (jaws) వంటి భాగంలుండును.వెల్డింగు యంత్రం యొక్క ఒక దవడ వంటి భాగం కదలకుండా నిశ్చలంగా/స్థిరంగా వుండును, రెండవది ఒక లివరు (liver) సహాయంన ముందుకు వెనకకు భూసమాంతరంగా (horizontally) కదలును.యంత్రంయొక్క దవడల వంటి భాగంలో అతుకవలసిన తీగలను కదలకుండా పట్టివుంచు అమరిక వుండును.పరికరంయొక్క లివరు చేతితో లేదా కాలితో పనిచేతునట్లు నిర్మింపబడి వుండును.అతుకు రెండు తీగెలకు ఒక ట్రాన్సుఫ్రార్మరు ద్వారా విద్యుత్తును ప్రవహింప చేయు ఏర్పాటు వుండును.వెల్డింగు యంత్రానికి తీగెలను భూసమాంతరంగా బిగించెదరు.ఈ వెల్డింగు యంత్రాలలో వ్యక్తి నియంత్రణలో పనిచేయునవి (manually, వ్యక్తి నియంత్రణ లేకుండ స్వంయచలిత (automatic) వెల్డింగు యంత్రాలున్నాయి.4 మి.మీ.నుండి40 మి.మీ మందం/వ్యాసం వున్నఉక్కు లోహ తీగెలను అతుకు యంత్రాలున్నాయి.[3]

వెల్డింగు చేయు విధానం

లోహ తీగెలను తయారు చేయు పరిశ్రమలలో ఉత్పత్తి సమయంలోకొన్ని సమయాలలో తీగె తెగిపోవడం జరుగుతుంది.అందువలన లోహతీగెల పరిశ్రమలలో ఈ వెల్డింగు ప్రక్రియ అవసరం.అతుకవలసిన తీగెల చివరలను శుభ్రం చేసి, వెల్డింగు యంత్రం యొక్క రెండు దవడలకున్న క్లాంపులతో గట్టిగా కదలకుండ క్షితిజ సమాంతరంగా, అభిముఖంగా బిగించెదరు.ఇప్పుడు లివరును కదపడటం ద్వారా ఒకతీగె యొక్క చివర రెండో తీగెయొక్క చివరను గట్టిగా తాకి, వత్తిడిని కలుగచేయును.ఇప్పుడు అలా ఒకతీగేంచు మరోతీగె అంచును బలంగా నొక్కి వత్తిడి ప్రభావంలో వుండగా, తీగెలలో స్టెప్& డవున్ ట్రాన్సుఫార్మర్ ద్వారా విద్యుత్తు ప్రవహింపచెయ్యడం జరుగుతుంది.లోహం యొక్క విద్యుత్తు నిరోధక తత్వం వలన రెండు తీగెల చివరల వద్ద వేడి పుట్టుతుంది, అదే సమయంలో తీగెలమీద వత్తీది/బల ప్రయోగం కొనసాగుతుంది, వేడెక్కిన అంచులు కరగి ఒకదానితో ఒకటి మేళనంచెందును.అదే సమయంలో ప్రయోగిస్తున్న బహ్యావత్తిడి కారణంగా అతుకు ఏర్పడిన ప్రాంతంలో తీగె కొద్దిగా వుబ్బును.అందుచేతనే దీన్ని బట్ లేదా అప్‌సెట్ వెల్డింగు అనడం జరుగుతుంది.అతుకు ఏర్పడిన తరువాత విద్యుత్తు ప్రవాహాన్ని ఆపివేసి, బహ్యావత్తిడిని అతుకు చల్లారేవరకు ఉపసంహరించరు.చల్లారిన తరువాత క్లాంపులను వదులుచేసి తీగెను బయటకు తీయుదురు.వుబ్బుభాగాన్ని అవసరమైనచో రాపిడి (grinding) చేసి తొలగించెదరు.

వెల్డింగు చేయుటకు అనువైన లొహంలు,మిశ్రమ థాతువులు

  1. రాగి దాని మిశ్రమ థాతువులు (మిశ్రమలోహంలు)
  2. తక్కువ కార్బను కలిగిన ఉక్కు
  3. ఎక్కువ కార్బను కలిగిన ఉక్కు
  4. తుప్పుపట్టిని (stainless steel) ఉక్కు
  5. అల్యూమినియం
  6. నికెల్ యొక్క మిశ్రమలోహాలు
  7. ఎక్కువ విద్యుత్తు ప్రవాహ నిరోధ గుణమున్న లోహంలు.

ఇవికూడా చూడండి

  1. వెల్డింగ్

బాహ్యా లింకులు

  1. బట్ వెల్డింగ్

సూచికలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.