పిత్తకోశం లేదా పిత్తాశయం (Gall bladder) పైత్యరసాన్ని నిలువచేస్తుంది. బేరిపండు ఆకారములో ఉన్న ఈ అవయవము 50 మి.లీ. వరకు పైత్యరసాన్ని నిలువ ఉంచుకొని జీర్ణక్రియకు అవసరమయినప్పుడు చిన్న ప్రేగులోనికి విడుదలచేస్తుంది.

మరింత సమాచారం పిత్తాశయం, లాటిన్ ...
పిత్తాశయం
పిత్తాశయం #5 సంఖ్యతో సూచించబడినది
లాటిన్ వెసికా బిలియారిస్
గ్రే'స్ subject #250 1197
అంగ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ (GI Tract)
ధమని కోశీయ ధమని
సిర కోశీయ సిర
నాడి సీలియాక్ గాంగ్లియా, వేగస్[1]
Precursor Foregut
MeSH Gallbladder
Dorlands/Elsevier g_01/12383343
మూసివేయి

స్వరూపం

మానవులలో పిత్తాశయము దాదాపు 10-12 సెంటీమీటర్లు పొడవుగా ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. పిత్తాశయానికి ఈ రంగు కణజాలాల వళ్ళకాక అందులో నిలువవున్న పైత్యరసం వల్ల కలుగుతున్నది. పైత్యరసవాహిక పిత్తాశయాన్ని ఒకవైపు కాలేయముతోనూ మరోపైపు ఆంత్రమూలముతోనూ కలుపుతున్నది.

పిత్తాశయం మూడు భాగాలుగా విభజించబడింది: ఫండస్, బాడీ, అండ్ నెక్. పిత్తాశయం చివర గుండ్రని బాగాన్ని ఫండస్ అంటారు. బాడీ పిత్తాశయం గుంటలో పడి, కాలేయంతో సంబంధం కలిగి ఉంటుంది. మెడ భాగం సన్నగా ఉండి సిస్టిక్ వాహిక అనే పిత్త వృక్షం భాగంతో కలిసిపోతుంది. సిస్టిక్ వాహిక హెపాటిక్ వాహికతో కలిసి సాధారణ పిత్త వాహిక మారుతుంది. పిత్తాశయం మెడ, సిస్టిక్ వాహిక కలయిక వద్ద, పిత్తాశయం గోడ శ్లేష్మ మడతని ఏర్పాటు చేస్తుంది దీనిని హార్ట్మన్ సంచి అంటారు, ఇక్కడ గాల్‌స్టోన్స్ ఇరుక్కుపోతాయి. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడం అత్యంత సాధారణ పిత్తాశయ సమస్య. పిత్త రసము కొలెస్ట్రాల్తో నిండిపోతే పిత్తాశయ రాళ్లు ఏర్పడతాయి. చాలా రాళ్లు బిలియరీ సిస్టమ్ తో వెళ్ళిపోతాయి, కొన్ని రాళ్లు మాత్రమే ఇరుక్కుపోయి పొట్ట నొప్పి వంటి లక్షణాలను చూపిస్తాయి. రాళ్లు పిత్తాశయంకి అడ్డుగా ఉంటే కోలేసైస్టిటిస్ అనే మంట వస్తుంది. ఒకవేళ రాళ్లు బిలియరీ సిస్టమ్ లో ఉండిపోతే కామెర్లు వస్తాయి. రాళ్లు క్లోమ వాహికకి అడ్డుగా ఉంటే పాంక్రియాటైటిస్ (క్లోమము గ్రంథీకి వాపు) వస్తుంది. పిత్తాశయంలో రాళ్లు తరచుగా వస్తుంటే శస్త్రచికిత్స చేసి వాటిని తీసివేస్తారు.

  • పిత్తాశయము నుండి బయలుదేరే కోశీయ వాహిక కాలేయ వాహికతో కలసి పైత్యరస వాహిక ఏర్పడుతుంది.
  • పైత్యరస వాహిక ఆ తరువాత క్లోమరస వాహికతో కలిసి మేజర్ డ్యూయోడినల్ ఆంప్యుల్లా వద్ద హెపాటో-ప్రాంక్రియాటిక ఆంప్యుల్లా లో చేరుతుంది.

విభాగపు మూలాలు[2], [3]

వ్యాధులు

  • కోలిసిస్టైటిస్ (Cholecystitis)
  • పిత్తాశయపు కాన్సర్
  • స్ట్రాబెర్రీ పిత్తాశయము
  • పిత్తాశయ రాళ్ళు: పైత్యరసంలో తయారైన గట్టి పదార్ధాలు.

ఇవి పిత్తాశయం, పైత్యరస నాళాలలో ఎక్కడైనా తయారుకావచ్చును. వీని మూలంగా పైత్యరసం చిన్నప్రేగులోనికి పోవడం పూర్తిగా గాని, పాక్షికంగా గాని ఆగిపోయి పచ్చకామెర్లు వస్తుంది. క్లోమరస వాహికకు అడ్డం పడుట వలన క్లోమము వాచిపోవచ్చును. ఈ రాళ్లు వివిధ రంగులలో, పరిమాణాలలో ఉంటాయి.

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.