దూదేకుల
ఒక కులం / From Wikipedia, the free encyclopedia
దూదేకుల అనే కులం వెనుకబడిన కులాల 'బి' గ్రుపులో 5వది. రాష్ట్రం మొత్తం బి.సి.లలో 4% దూదేకుల వారున్నారు. ఈ కులం వారిలో సర్వమత సమానత్వం కానవస్తుంది. వీరిలో హిందూ, ముస్లిం ఆచారాలు కనిపిస్తాయి. వీరిని నూర్ బాషా, లదాఫ్, పేర్లతో కూడా పిలుస్తారు. వీరిలో 80% ప్రజలకు తెలుగు మాతృభాష . వీరిలో హిందూ ఆచారాలు ఎన్ని ఉన్నా సున్నతి, పెళ్ళి, సమాధి ఈ మూడూ ముస్లిముల పద్ధతిలోనే ఉంటాయి. వీరిలో ఉర్దూ,అరబీ భాషలు రాని కారణాన ఒకింత ఆత్మన్యూనతా భావం,ఇస్లాం విషయాల పట్ల అంత శ్రద్ధ, విషయపరిజ్ఞానం లేదనే భావనల వల్ల కొంత జంకే స్వభావం కానవస్తుంది. కాని, ఇవి మానసిక భావనలే. ఆధ్యాత్మికతలో వీరెవరికీ తీసిపోరు. వీరు మతాచారాల పట్ల చాలా ఉదారస్వభావులుగా కానవస్తారు. విద్యార్థి దశలో TC లలో మతం ఇస్లామ్/ముస్లిమ్ కు బదులు హిందూ అని కులం దూదేకుల అని కొందరికి, ఉపాద్యాయులు నేటికీ కొన్నిచోట్ల నమోదు చేయటం వలన వీరు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు, మైనారిటీ ఫలాలు పొందటంలో ఇబ్బందులకు గురిఅవుతున్నారు అనేది గమనార్హం. ఉత్తర భారతదేశంలో (గుజరాత్ & రాజస్థాన్) నూర్బాష్ కులాన్ని మన్సూరి, భాయ్, ధునియా అని పిలుస్తారు. గ్రేట్ మైసూర్ రాజులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ఈ కులం నుండి ప్రశంసించబడ్డారు,
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
చరిత్ర |
ఆగమనం |
మాలిక్ బిన్ దీనార్ · తమీం అంసారీ · ఔలియా |
నిర్మాణాలు |
ప్రఖ్యాత వ్యక్తులు |
ఔరంగజేబ్ · కులీ కుతుబ్ షా |
కమ్యూనిటీలు |
ఉత్తరభారత · తమిళ ముస్లింలు |
న్యాయ పాఠశాలలు |
హనఫీ · షాఫయీ · మాలికి · హంబలి |
విశ్వాస పాఠశాలలు |
ఆంధ్రప్రదేశ్ లో మస్జిద్లు · ఆంధ్రప్రదేశ్ లో దర్గాల జాబితా |
ఆంధ్రప్రదేశ్ లో చారిత్రక మస్జిద్లు |
సంస్కృతి |
ఇతర విషయాలు |
దక్షిణాసియాలో అహ్లె సున్నత్ ఉద్యమం |