నౌపడా
ఒడిశా రాష్ట్రం నౌపడా జిల్లా ముఖ్యపట్టణం / From Wikipedia, the free encyclopedia
నౌపడా, ఒడిషా రాష్ట్రం పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక పట్టణం. దీన్ని నౌపాడ అని కూడా అంటారు. ఇది నౌపడా జిల్లాకు కేంద్రం. 1993 మార్చి 27 న అవిభక్త కలాహండి జిల్లా నుండి నౌపడా జిల్లా ఏర్పాటైంది. ఇది ఒడిశా పశ్చిమ సరిహద్దులో ఉంది. జిల్లా భాషాపరంగా, సాంస్కృతికంగా ఒడిషాలో భాగం. ఇది భారతదేశంలోని అత్యంత వెనకబడ్డ జిల్లాలలో ఒకటి.