భారత రాజకీయ నాయకుడు From Wikipedia, the free encyclopedia
నితిన్ గడ్కరి మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త. మే 27, 1957న జన్మించిన గడ్కరి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.[1] మహారాష్ట్ర మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అనేక నిర్మాణాత్మక పనులు ముఖ్యంగా ముంబాయి-పూనా ఎక్స్ప్రెస్వే వలన మంచిపేరు సంపాదించారు.[2] 26 మే, 2014 నాడు నరేంద్రమోడి కేబినెట్లో కేంద్రమంత్రిగా నియమితులైనారు.
నితిన్ గడ్కరి | |||
కేంద్ర మంత్రి | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం మే 26, 2014 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
---|---|---|---|
జననం | నాగ్పూర్, | 1957 మే 27||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | కామ్చన్ గడ్కరి | ||
సంతానం | నిఖిల్, సారంగ్, కెట్కి | ||
వృత్తి | న్యాయవాది, పారిశ్రామికవేత్త | ||
మతం | హిందూమతము | ||
వెబ్సైటు | nitingadkari.in |
నితిన్ గడ్కరి ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబములో నాగ్పూర్ లో జన్మించారు. చిన్న వయస్సులోనే భారతీయ జనతా యువమోర్చా, భారతీయ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేశారు. క్రిందిస్థాయి కార్యకర్తగా రాజకీయ జీవనాన్ని ప్రారంభించారు.[3] మహారాష్ట్రలోనే M.Com, L.L.B., D.B.Mలను పూర్తిచేశారు.
నితిన్ గడ్కరి భార్య కాంచన్. వారికి ముగ్గురు సంతానం, నిఖిల్, సారంగ్, కెట్కి. నితిన్ నాగ్పూర్ లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయం ప్రక్కనే నివాసముంటున్నారు.[4]
1995 నుండి 1999 వరకు మహరాష్ట్ర ప్రభుత్వంలో నితిన్ గడ్కరి ప్రజాపనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయములోనే అనేక నిర్మాణాత్మక పనులు చేపట్టి పేరు సంపాదించారు. తాను చేపట్టిన శాఖను పై నుండి క్రిందివరకు పూర్తిగా వ్యవస్థీకరించినారు.[5] 26 మే, 2014 నాడు నరేంద్రమోడి కేబినెట్లో కేంద్రమంత్రిగా నియమితులైనారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.