నవగ్రహాలు
venus / From Wikipedia, the free encyclopedia
నవగ్రహాలు (Nine Planets, Navagrahas) అనగా తొమ్మిది గ్రహాలు. ఈ పదాన్ని రెండు విషయాలలో వాడుతారు.
- ఖగోళ శాస్త్రములో సూర్యుని చుట్టూ తిరిగే తొమ్మిది గోళాలు. అయితే ఇటీవలి కాలంలో చివరి గ్రహమైన ప్లూటో గ్రహం కాదని శాస్త్రజ్ఞులు తీర్మానించారు. కనుక ఇప్పుడు ఎనిమిది గ్రహాలు అనే చెప్పడం ఉచితం.
- భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో జీవితాలపైనా, ఘటనలపైనా ప్రభావం చూపే గ్రహాలు. ఖగోళ శాస్త్రంలో ఉన్న గ్రహాలకూ, ఈ నవ గ్రహాలకూ కొంత భేదం ఉంది. సూర్యుడు (సౌరమండలం కేంద్ర నక్షత్రం), చంద్రుడు (భూమికి ఉప గ్రహం).కానీ.,మన ఈ జ్యోతీశ్య శాస్త్రంలో & సంప్రదాయంలో సూర్య, చంద్రులు కూడా గ్రహాలుగా పరిగణింప బడుతాయి !యురేనస్, నెప్ట్యూన్ లు మన ఈ శాస్త్రం లెక్కలోకి రావు. కాని, రాహువు, కేతువు అనే రెండు ఛాయా గ్రహాలను ఈ సంప్రదాయంలో గ్రహాలుగా గణిస్తారు.