Thumb
పొటాషియం క్లోరైడ్

ద్రావణీయత

స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో గల ద్రావిత గరిష్ఠ పరిమాణాన్ని ద్రావణీయత అంటారు. ఉదాహరణకు 100 గ్రాముల నీరు 36.3 గ్రాముల ఉప్పును మాత్రమే కరిగించుకోగలదు. అందువలన ఉప్పు ద్రావణీయత 36.3 అవుతుంది.

300 C వద్ద కొన్ని సమ్మేళనాల ద్రావణీయతలు
క్రమసంఖ్య సమ్మేళనం పేరు ఫార్ములా ద్రానణీయత
(గ్రా. /100గ్రా.ల నీరు)
1 కాల్షియం కార్బొనేట్ CaCO3 0.0052
2 పొటాషియం పర్మాంగనేట్ KMno4 9.0
3 ఆగ్జాలికామ్లం H2C2O4.H2O 14.3
4 కాపర్ సల్ఫేట్ CuSO4.2H2O 31.6
5 సోడియం క్లోరైడ్ NaCl 36.3
6 పొటాషియం క్లోరైడ్ KCl 37.0
7 అమ్మోనియం క్లోరైడ్ NHC4Cl 41.4
8 సోడియం థయోసల్ఫేట్ Na2S2O3.2H2O 84.7
9 సిల్వర్ నైట్రేట్ AgNO3 300.0

ద్రావణీయతను ప్రభావితం చేసే ఆంశాలు

  1. ద్రావణి ద్రావిత స్వభావం
  2. ఉష్ణోగ్రత
  • ధృవ ద్రావితం ధృవ ద్రావణిలో కరుగుతుంది. ఉదాహరణకు నీరు ధృవ ద్రావణి. నీటిలో ధృవ ద్రావితాలైన సోడియం క్లోరైడ్ (తినే ఉప్పు), కాపర్ సల్పేట్, పొటాషియం పర్మాంగనేట్ (చినాల రంగు) వంటి వి కరుగుతాయి. కాని అధృవ ద్రావితాలైన కిరోసిన్, నాప్తలీన్, బెంజీన్ వంటి వి కరుగవు.
  • అధృవ ద్రావితం అధృవ ద్రావణిలో కరుగుతుంది. ఉదాహరణకు నాప్తలీన గోళీలు అధృవ పదార్థము. ఇది అధృవ ద్రావితాలైన కిరోసిన్, పెట్రోలు వంటి ధృవ ద్రావణులలో కరుగుతుంది. కాని నీరు వంటి ధృవ ద్రావణిలో కరుగదు.
  • కొన్ని ద్రావణముల ద్రావణీయత ఉష్ణోగ్రత పెంచినపుడు పెరుగు తోంది. ఉదాహరణకు 100 గ్రాముల నీటిలో 68.89 గ్రాముల పంచదార మాత్రమే కరుగుతుంది. ఇంకనూ ఎక్కు వ పంచదార కలిపినట్లైతే హెచ్చుగా కలిపిన పంచదార పాత్ర అడుగున అవక్షేపంగా మిగిలిపోవును. ఈ హెచ్చుగా గల ద్రావితాన్ని కూడా కరిగించాలి అనుకుంటే ఆ ద్రావణాన్ని వేడిచేయాలి. అపుడు ఆ ద్రావణం అతి సంతృప్త ద్రావణంగా మారుతుంది. మరల గది ఉష్ణోగ్రతకు వచ్చినపుడు హెచ్చుగా గల పంచదార పాత్ర గోడలకు అంటుకొని ఉండిపోతుంది.
  • కొన్ని ద్రావణముల ద్రావణీయత ఉష్ణోగ్రత పెంచినా లేదా తగ్గించినా మారదు. ఉదా: ఉప్పు నీటి ద్రావణం తీసుకుంటే 100 గ్రాముల నీరు 36.3 గ్రాముల ఉప్పును మాత్రమే కరిగించుగకోగలదు. దీని ద్రావణీయత ఉష్ణోగ్రత పెంచినా లేదా తగ్గించినా మారదు. స్థిరంగా ఉంటుంది.
  • కొన్ని ద్రావణముల ద్రావణీయత ఉష్ణోగ్రత పెంచినట్లయిన తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గించినట్లయిన పెరుగుతుంది. ఉదా: సీరస్ సల్ఫేట్.

వాయువుల ద్రావణీయత

వాయువులు కూడా వివిధ ద్రావణులలో కరుగుతాయి. ఉదాహరణకు నీటిలో కార్బన్ డై ఆక్సైడ్ కలిపినపుడు సోడా తయారవుతుంది. ఉష్ణోగ్ర త పెంచినపుడు ద్రావణీయత ఫుర్తిగా తగ్గి నీరు యేర్పడుతుంది.

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.