దౌస, భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం, దౌసా జిల్లాకు చెందిన ఒక నగరం.ఇది దౌస జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం. ఇది జైపూర్ నుండి 55 కి.మీ., ఢిల్లీ నుండి 240 కి.మీ.దూరంలో జైపూర్-ఆగ్రా జాతీయ రహదారి (ఎన్ఎచ్ -11)లో ఉంది. దీనిని "దేవ్ నగరి" అని కూడా అంటారు.

త్వరిత వాస్తవాలు దౌస, దేశం ...
దౌస
Thumb
దౌస
దౌస
భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్ర పటం
Thumb
దౌస
దౌస
దౌస (India)
Thumb
దౌస
దౌస
దౌస (Asia)
Coordinates: 26.8932°N 76.3375°E / 26.8932; 76.3375
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లాదౌస
Elevation
327 మీ (1,073 అ.)
జనాభా
 (2011)
  Total85,960
భాషలు
  అధికారికహిందీ[1]
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
Vehicle registrationRJ-29
మూసివేయి

చరిత్ర

దౌసా నగరం విస్తృతంగా దుంధర్ అని పిలువబడే ప్రాంతంలో ఉంది. సా.శ.10వ శతాబ్దంలో చౌహన్స్, రావుస్ ఈ భూమిని పరిపాలించారు. అప్పటి దుందర్ ప్రాంతానికి మొదటి రాజధానిగా అవతరించడానికి దౌసకు ప్రత్యేక అర్హత ఉంది. దుందర్ ప్రాంతానికి దౌస ఒక ముఖ్యమైన రాజకీయ ప్రదేశం. సా.శ. 996 నుండి 1006 వరకు చౌహాన్ రాజా సూధ్ దేవ్ ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు.తరువాత, సా.శ.1006 నుండి సా.శ.1036 వరకు, రాజా దులే రాయ్ 30 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు.[2]

మహాదేవ్ ప్రాంతంలో ఉన్న దౌస నగరం చుట్టూ నీలకంఠ, గుప్తేశ్వర్, సహజ్నాథ్, సోమనాథ్, వైద్యనాధ్ అనే ఐదు ఆలయాలు ఉన్నాయి.అందువలన ఇది సంస్కృత పదం 'దౌ', 'సా' నుండి ఈ నగరానికి ఆపేరు వచ్చింది.

దౌసా ప్రాంతం నుండి దేశానికి విలువైన స్వాతంత్ర్య సమరయోధులను ఇచ్చింది.స్వాతంత్ర్య పోరాటం కోసం, రాజస్థాన్ రాష్ట్రం ఏర్పాటుకు రాచరిక రాష్ట్రాల సమ్మేళనం కోసం తమ విలువైన సహకారాన్ని అందించిన స్వాతంత్ర్య సమరయోధులలో దివంగత టికారామ్ పాలివాల్, దివంగత రామ్ కరణ్ జోషి ఉన్నారు.దివంగతులైన టికారామ్ పాలివాల్ 1952లో రాజస్థాన్ రాస్ట్రానికి మొదటిసారిగా జరిగిన ఎన్నికలలో మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు. అలాగే, దివంగత శ్రీ రామ్ కరణ్ జోషి రాజస్థాన్ రాష్ట్ర మొదటి పంచాయతీ రాజ్ మంత్రిగా పనిచేస్తూ, విధానసభలో మొదటి పంచాయతీ రాజ్ బిల్లును 1952 లో సమర్పించారు.

కవి సంత్ సుందర్‌దాస్ దైసాలోని విక్రమ్ సంవత్ 1653 లో చైత్ర శుక్ల నవమి నాడు జన్మించాడు. అతను నిర్గున్ పంతి సంత్, 42 గ్రంథాలను వ్రాసాడు. వీటిలో జ్ఞాన్ సుందరం, సుందర్ విలాస్ విలువైన గ్రంథాలుగా గుర్తించారు.

భౌగోళికం

దౌసా నగరం 26.88°N 76.33°E / 26.88; 76.33 వద్ద ఉంది.[3] ఇది భూమి మట్టానికి 333 మీటర్లు (1072 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.ఇది జైపూర్ విభాగంలోని 5 జిల్లాలలో ఒకటి.దీనికి జైపూర్, టాంక్, శవై మధోపూర్, కరౌలి, భరత్పూర్, అల్వార్, అనే 7 జిల్లాలు దౌస నగరానికి సమీప జిల్లాలుగా అన్నాయి.

జనాభా

2011 భారత జనాభా లెక్కలు ప్రకాం దౌస నగరం 85,960 మంది జనాభా కలిగి ఉంది.అందులో పురుషులు 45,369, స్త్రీలు 40,591.దౌస నగర అక్షరాస్యత 69.17 శాతం ఉంది.ఇది జాతీయ సగటు అక్షరాస్యత 74.04 శాతం కన్నా తక్కువగా ఉంది.పురుషుల అక్షరాస్యత 84.54% ఉండగా, స్త్రీల అక్షరాస్యత 52.33% ఉంది.దౌస నగర జనాభాలో 6 సంవత్సరాల వయస్సు లోపు గల పిల్లలు 11,042 మంది ఉన్నారు[4]

స్థానిక పండుగలు

బసంత్ పంచమి మేళా

దౌస నగరంలో, రసంనాథ్జీ, నర్సింగ్‌జీ, సూర్య దేవుడు విగ్రహాల ఆరాధనతో బసంత్ పంచమి మేళా ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహిస్తారు.ఇది సంవత్సరానికి అవసరమైన సరుకులు, వస్తువులు మొత్తం సేకరించడానికి గ్రామస్తులకు పెద్ద స్థానిక సంత. ఈ పండుగ బసంత్ పంచమి మేళా సందర్భంగా మూడు రోజులు జరుగుతుంది.

పర్యాటక

దౌసలో అభనేరి, మెహండిపూర్ బాలాజీ ఆలయం,ఇంకా ఇతర అనేక పర్యాటక ప్రాంతాల ఉన్నాయి.అభనేరిలో పహేలితో సహా చాలా సినిమాలు చిత్రీకరించబడ్డాయి.[5]

  • అభనేరి : గుప్తా కాలం అనంతరం లేదా ప్రారంభ మధ్యయుగ స్మారక కట్టడాలకు చెందింది.ఇది జిల్లా ప్రధాన కార్యాలయం దౌస నుండి బండికుయ్ వైపు సుమారు 33 కి.మీ.దూరం వద్ద ఉంది.చంద్ బౌరి (స్టెప్ వెల్), హర్షత్ మాతా ఆలయం సందర్శించవలసిన ముఖ్యమైన ప్రదేశాలు.
  • గెటోలావ్ పక్షుల కేంద్రం:జాతీయ రహదారి 11లో 200 మీటర్ల దూరంలో ఉన్న వలస పక్షులు కేంద్రం.
  • భండారేజ్ :త్రవ్వకాల్లో కనిపించే గోడలు, శిల్పాలు, అలంకరణ జాలక పని, టెర్రకోట పాత్రలకు భండారేజ్ ప్రాముఖ్యత చెందింది.భండారెజ్‌ను 18 వ శతాబ్దపు దశ-బాండ్ అని పిలుస్తారు.
  • ఖవరాజీ:అప్పటి పాలకుడు రావుజీ, జైమాన్ పురోహిత్ల నివాసం.
  • జాజిరాంపూరా:సహజ నీటి తొట్టె, రుద్ర (శివ), బాలాజీ (హనుమాన్), ఇతర మత దేవుడు, దేవతల దేవాలయాలకు హజిరంపురా పేరు పొందింది.[6]

రవాణా

రైలు ద్వారా

దౌస నగరానికి రైలు మార్గం బాగా అనుసంధానించబడి ఉంది. ఇది ఢిల్లీ-జైపూర్, ఆగ్రా-జైపూర్ రైలు మార్గంలో ఉంది. ఇది మంచి అనుసంధాన్ని ఇస్తుంది. దౌసకు సమీప ముఖ్యమైన రైల్వే స్టేషన్ బండికుయ్ జంక్షన్.జైపూర్ విభాగం పరిధిలో వాయవ్య రైల్వే చాలా ముఖ్యమైన రైల్వే స్టేషన్. దౌస నగరానికి కొత్త రైల్వే లైన్తో పాటు దౌస రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది.

రోడ్డు మార్గం ద్వారా

జాతీయ రహదారి దౌస గుండా వెళుతుంది.దౌస ఎన్‌హెచ్ -11 లో జైపూర్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆగ్రాతో బాగా అనుసంధానించబడి ఉంది. ఢిల్లీ ఇతర పరిసర జిల్లాలు, కరౌలి, సవాయి మాధోపూర్, భరత్పూర్ ప్రాంతాలకు రోడ్డు మార్గం అనుసందానించబడింది.ఇంకా జాతీయ రహదారి 11ఎ కూడా దౌస, లాల్సోట్ తహసీల్ ప్రాంతాలను కలుపుతూ వెళుతుంది.

ప్రస్తావనలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.