ఝాన్సీ జిల్లా
ఉత్తర్ ప్రదేశ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలలో ఝాన్సీ జిల్లా ఒకటి. ఝాన్సీ పట్టణం ఈ జిల్లా కేంద్రం. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 1,746,715.1891లో ఝాన్సీ జిల్లాతో లలిత్పూర్ ప్రాంతం ఝాన్సీ జిల్లాతో చేర్చబడింది. 1974లో లలిత్పూర్ ప్రాంతం ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది.
త్వరిత వాస్తవాలు ఝాన్సీ జిల్లా झांसी जिला, దేశం ...
ఝాన్సీ జిల్లా
झांसी जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | ఝాన్సీ |
ముఖ్య పట్టణం | ఝాన్సీ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | ఝాన్సీ |
విస్తీర్ణం | |
• మొత్తం | 5,024 కి.మీ2 (1,940 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 19,98,603 |
• జనసాంద్రత | 400/కి.మీ2 (1,000/చ. మై.) |
• Urban | 5,49,391 |
జనాభా వివరాలు | |
• లింగ నిష్పత్తి | 866 |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి
జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టు (నేషనల్ హైవే డెవెలెప్మెంట్ ప్రాజెక్ట్) మూలంగా ఝాన్సీ త్వరగా అభివృద్ధి చెందుతున్నది. కాశ్మీర్ నుండి కన్యాకుమారిని కలిపే ఉత్తర-దక్షిణ కారిడార్, తూర్పు-పడమర కారిడార్ లు రెండూ ఝాన్సీ మీదుగా ప్రయాణిస్తాయి.