గురజాడ కృష్ణదాసు వెంకటేష్
భారతీయ సంగీత స్వరకర్త (1927-1993) / From Wikipedia, the free encyclopedia
జి.కె.వెంకటేష్ లేదా గురజాడ కృష్ణదాసు వెంకటేష్ (సెప్టెంబర్ 21, 1927 - నవంబర్ 17, 1993) ప్రఖ్యాత దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలకు సంగీతము సమకూర్చినప్పటికీ కన్నడ చిత్రరంగములో 1960ల నుండి 1980ల వరకు అనేక కన్నడ సినిమాలకు సంగీతం సమకూర్చాడు. ఒక సాంఘిక సినిమా కన్నడ నాట ఒకే థియేటర్లో ఒకే రోజు మూడు ఆటల చొప్పున సంవత్సరానికి మూడు మాసాల పాటు ఏకథాటిగా నడిచింది. ఆ సినిమా పేరు బంగారద మనష్య, ఈ సినిమాకు సంగీతదర్శకుడు జి.కె.వెంకటేషే. ఈ సినిమాను తెలుగులో బంగారు మనిషిగా తిరిగి తీశారు.
త్వరిత వాస్తవాలు గురజాడ కృష్ణదాసు వెంకటేష్, జననం ...
గురజాడ కృష్ణదాసు వెంకటేష్ | |
---|---|
![]() జి. కె. వెంకటేష్ | |
జననం | జి. కె. వెంకటేష్ సెప్టెంబర్ 21, 1927 హైదరాబాద్, బ్రిటిష్ ఇండియా |
మరణం | నవంబరు 17, 1993 (వయసు 66) చెన్నై, తమిళనాడు |
ఇతర పేర్లు | జి. కె. వెంకటేష్ |
వృత్తి | సంగీత దర్శకత్వం, నేపథ్య గానం |
పదవీ కాలం | 1946 - 1993 |
మూసివేయి