చలం రచనల జాబితా
From Wikipedia, the free encyclopedia
ప్రఖ్యాత తెలుగు రచయిత గుడిపాటి వెంకటచలం రచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఆయా రచనల గురించి సంబంధిత ప్రత్యేక వ్యాసాలు చూడండి.
మైదానం (చలం రచన), దైవమిచ్చిన భార్య, ప్రేమ లేఖలు, స్త్రీ, మ్యూజింగ్స్ వంటివి చలం రచనలలో సుప్రసిద్ధమైనవి. చలం తన భావాలను వ్యక్త పరచటానికి అనేక రచనా ప్రక్రియలు వాడాడు. కథలు, నవలలు అందులో ముఖ్యమైనవి. నాటకాలు కూడా ఉన్నాయి కాని, అందులో వ్యంగ నాటికలు ఎక్కువ. ఈజాబితాలో ఉదహరించినవి చలం వ్రాసిన అసంఖ్యాకమైన రచనలలోనివి కొన్ని మాత్రమే. అనేకమైన కథలు ఏవేవో పత్రికలలో పడినవి దొరకనివి చాలా ఉన్నవట. అలా దొరకని కథలను వెదికి పుస్తక రూపంలోకి తేవటానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
చలం నవలలు, కథా సంపుటాలు గురించిన వివరాలు ఈ లింక్ లూ ఉన్నాయి రంగనాయకమ్మ రాసిన ’చలం సాహిత్యం’, స్వీట్ హోమ్ పబ్లికేషన్స్, మూడవ ముద్రణ (2008 ఆగస్టు) ఆధారంగా చలం రచనల జాబితా పొందుపరిచాను..
- ఈ గుర్తు ఉన్న పుస్తకాలు అన్నీ ఆ పేరుతో అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్, విజయవాడ 520 002వారి వద్ద (ఫోన్: 0866 2431181 ) లభిస్తున్నాయి.