గ్రెనడా
From Wikipedia, the free encyclopedia
ఆగ్నేయకరేబియన్ సముద్రంలో ఉన్న ద్వీపదేశాలలో ఒకటి. ఇందులో గ్రెనడియన్ ద్వీపం, గ్రెనడియన్ ద్వీపమాలిక దక్షిణతీరంలో ఉన్న ఆరు చిన్న చిన్న ద్వీపాలు భాగంగా ఉన్నాయి. ఇది ట్రినిడాడ్ , టొబాగో దేశాలకు వాయవ్యదిశలో వెనుజులా దేశానికి ఈశాన్యదిశలో,
సెయింట్ వింసెంట్ దేశానికి నైఋతిదిశలో ఉంది. దేశ వైశాల్యం 344 చ. కి.మీ. 2012 గణాంకాలను అనుసరించి దేశజనసంఖ్య. సెయింట్ జార్జెస్ దీనికి రాజధానిగా ఉంది. గ్రెనడాలో మసాలాదినుసులు విస్తారంగా పండించబడుతున్న కారణంగా ఇది " ఐలాండ్ ఆఫ్ స్పైస్ " గా కూడా గుర్తించబడుతుంది. గ్రెనడాలో పోక, మాక్ పంటలు విస్తారంగా పండించబడి విదేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. గ్రెనడా జాతీయపక్షి అయిన గ్రెనడా పావురం తీవ్రంగా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉంది.